Champions Trophy 2025: పాకిస్తాన్ పై భారత్ గెలవడానికి 5 ముఖ్య కారణాలు ఇవే !

Published : Feb 23, 2025, 11:28 PM IST

Champions Trophy 2025: దుబాయ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 IND vs PAK మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌పై గెలిచింది. ఈ విజయంతో టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. టీమిండియా గెలుపునకు గల 5 ముఖ్య కారణాలను ఏంటో తెలుసా?

PREV
16
Champions Trophy 2025: పాకిస్తాన్ పై భారత్ గెలవడానికి 5 ముఖ్య కారణాలు ఇవే !

IND vs PAK Champions Trophy 2025: ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా జరిగిన ఐదో మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్తాన్ త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్ లో భార‌త్ బ్యాటింగ్, బౌలింగ్ లో అద‌ర‌గొడుతూ పాకిస్థాన్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఛేజింగ్ మాస్ట‌ర్ విరాట్ కోహ్లీ మ‌రోసారి అద్భుత‌మైన బ్యాటింగ్ తో పాకిస్తాన్ బౌలింగ్ ను దంచికొట్టాడు. 

విరాట్ కోహ్లీ 100 పరుగుల అజేయ సెంచ‌రీతో భార‌త్ కు విజ‌యాన్ని అందించాడు. పాకిస్తాన్ భార‌త్ ముందుంచిన 242 పరుగుల లక్ష్యాన్ని భారత బ్యాట్స్‌మెన్ 42.3 ఓవర్లలోనే అందుకున్నారు. ఈ విజ‌యంతో ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు సెమీ-ఫైనల్‌కు చేరుకుంది. వ‌రుస‌గా రెండు మ్యాచ్ ల‌లో ఓడిపోయిన పాకిస్తాన్ సెమీస్ రేసు నుంచి ఔట్ అయింది. అయితే పాకిస్తాన్ పై రోహిత్ శ‌ర్మ కెప్టెన్సీలోని భార‌త జ‌ట్టు గెలవడానికి 5 ప్రధాన కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

26
Kuldeep Hardik

1. బౌలర్లు ప్రారంభంలోనే వికెట్లు తీయడం 

టాస్ గెలిచిన తర్వాత పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పాక్ నిర్ణ‌యం త‌ప్పని ఇండియా బౌలర్లు నిరూపించారు. పాకిస్తాన్ ఓపెనర్లు ఇద్దరూ మొదటి 9.2 ఓవర్లలో 47 పరుగుల వద్ద అవుటయ్యారు. అందులో 23 పరుగులు చేసిన బాబర్ ఆజం బిగ్ వికెట్ కూడా ఉంది. 

36
Kuldeep Yadav

2. మధ్య ఓవర్లలో పాక్ ను పరుగుల చేయ‌కుండా అడ్డుకున్న భార‌త్ 

భారత బౌలర్లు పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్‌లను మిడిల్ ఆర్డర్‌లో పరుగులు చేయ‌కుండా అడ్డుకున్నారు. దీంతో ర‌న్ రేటు చాలా వ‌ర‌కు త‌గ్గిపోయింది. పాక్ పెద్ద స్కోర్ చేయ‌లేక‌పోయింది. ఇది భార‌త‌ జట్టుకు లాభించింది. సౌద్ షకీల్, మ‌హ్మ‌ద్ రిజ్వాన్ 104 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పినప్పటికీ దాని కోసం 144 బంతులు తీసుకున్నారు.

46
Shaheen Shah Afridi

3. 8 మంది పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ 100 పరుగుల లోపు ఔట్ 

పాకిస్తాన్ ఆరంభంలో కొంచెం మెరుగైన స్థితిలో కనిపించింది. ఆ త‌ర్వాత కూడా మెరుగైన స్థితికి వెళ్తున్న‌ట్టుగా ముందుకు సాగింది. అయితే, మ‌హ్మ‌ద్ రిజ్వాన్ 151 పరుగుల వద్ద ఔటవగానే, ఎనిమిది వికెట్లు ఒకదాని తర్వాత ఒకటి వ‌రుస‌గా పడిపోయాయి. ఆ త‌ర్వాత‌ 90 పరుగులకే ఆలౌట్ అయింది. దీని కారణంగా పాకిస్తాన్ 241 పరుగులు మాత్రమే చేయగలిగింది.

56
Virat Kohli vs Pakistan

4. ఛేజింగ్ లో భార‌త్ కు మంచి ఆరంభం ల‌భించింది 

242 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత బ్యాట్స్‌మెన్ వేగంగా ఆరంభించారు. మొదట రోహిత్ శర్మ 20 పరుగులు, ఆ తర్వాత శుభ్‌మాన్ గిల్ 46 పరుగులు చేశాడు. దీని కారణంగా జట్టుకు మంచి ఆరంభం లభించింది.

66
Image Credit: Getty Images

5. విరాట్ కోహ్లీ సెంచరీ, శ్రేయాస్ క్లాసిక్ ఇన్నింగ్స్ 

చాలా కాలంగా ఫామ్‌తో ఇబ్బంది ప‌డుతున్న విరాట్ కోహ్లీ పాకిస్తాన్ పై అద్భుత‌మైన ఇన్నింగ్స్ తో ఫామ్‌లోకి వచ్చాడు. పాకిస్థాన్ బౌలింగ్ ను దంచికొట్టాడు. 100 ప‌రుగుల‌ అజేయ సెంచరీతో పాటు భార‌త్ కు విజ‌యాన్ని అందించాడు. 

స్కోర్ బోర్డు: 

పాకిస్తాన్ : 241 (49.4 Ov) ప‌రుగులు (సౌద్ ష‌కీల్ 62, మ‌హ్మ‌ద్ రిజ్వాన్ 46, కుష్ దిల్ 38 ప‌రుగులు - కుల్దీప్ యాద‌వ్ 3 వికెట్లు, హ‌ర్దిక్ పాండ్యా 2 వికెట్లు) 

భార‌త్: 244-4 (42.3 Ov) ప‌రుగులు (విరాట్ కోహ్లీ 100*, శ్రేయాస్ అయ్య‌ర్ 56, గిల్ 46, రోహిత్ శ‌ర్మ 20 ప‌రుగులు - షాహీన్ అఫ్రిది 2 వికెట్లు)

Read more Photos on
click me!

Recommended Stories