బెంగళూరు: ఆర్సీబీ హోం గ్రౌండ్ లో ఇక క్రికెట్ మ్యాచ్ లు లేనట్టేనా?

Published : Aug 22, 2025, 11:38 PM IST

Bengaluru: ఐపీఎల్ 2025 టైటిల్ గెలుపు తర్వాత.. ఆర్సీబీ విజయోత్సవం క్రమంలో జూన్ లో జరిగిన తొక్కిసలాట కారణంగా బెంగళూరులో మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 మ్యాచ్‌లు రద్దు చేశారు. ఇక్కడి మ్యాచ్ లను నవీ ముంబై వేదికకు మార్చారు.

PREV
16
బెంగళూరుకు షాక్.. చిన్నస్వామి స్టేడియం నుంచి మ్యాచ్ లు తరలింపు

బెంగళూరులోని  ఏం. చిన్నస్వామి స్టేడియం ఇకపై మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 వేదిక కాదు. ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీ విజయోత్సవం క్రమంలో జూన్‌లో జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ స్టేడియం పెద్ద ఈవెంట్లకు పనికిరాదని విచారణల్లో తేలింది. 

దీంతో, ఐసీసీ మ్యాచ్‌లను నవి ముంబై, కొలంబో వేదికలకు మార్చింది. ఒకప్పుడు క్రికెట్ పట్ల బెంగళూరువారి మక్కువకు ప్రతీకగా నిలిచిన ఈ స్టేడియం, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో అవమానానికి గురైందని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.

DID YOU KNOW ?
బెంగళూరు క్రికెట్ స్టేడియం
బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు హోం గ్రౌండ్ గా ఉంది. జూన్ లో ఇక్కడ తొక్కిసలాట జరిగి 11 మంది చనిపోయారు.
26
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట

జూన్‌లో ఆర్‌సీబీ ఐపీఎల్ టైటిల్‌ను గెలిచిన సందర్భంగా బెంగళూరు వీధులు అభిమానులతో నిండిపోయాయి. వేలాదిగా వచ్చిన అభిమానులు స్టేడియం బయట సంబరాలు జరుపుకున్నారు. కానీ, ఆ ఆనందం విషాదంగా మారింది. పెద్ద సంఖ్యలో వచ్చిన జనంతో గందరగోళం ఏర్పడి తొక్కిసలాట జరిగింది. 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు.

36
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం ఘటనపై దర్యాప్తు

ఈ సంఘటన అనంతరం దర్యాప్తులు జరిగాయి. విచారణ కమిటీ చిన్నస్వామి స్టేడియం పెద్దసంఖ్యలో జనం వచ్చే ఈవెంట్లకు సురక్షితంగా ఆతిథ్యం ఇచ్చే పరిస్థితిలో లేదని తేల్చింది. పోలీసులు కూడా ఇక్కడ ప్రధాన క్రికెట్ మ్యాచ్‌లకు అనుమతి ఇవ్వకూడదని స్పష్టం చేశారు. వేదిక మార్పు గురించి ఐసీసీ అధికారికంగా అనుకోని పరిస్థితులు అంటూ పేర్కొంది. కానీ, విచారణ కమిటీ రిపోర్టుతో వేదికను మార్చింది.

46
బెంగళూరుకు బదులుగా నవి ముంబైలో మ్యాచ్ లు

బెంగళూరు బదులుగా, నవి ముంబైలోని డివై పాటిల్ స్టేడియం వేదికగా మారింది. ఇది మూడు లీగ్ మ్యాచ్‌లు, ఒక సెమీ ఫైనల్, అవసరమైతే ఫైనల్‌ను కూడా ఆతిథ్యం ఇస్తుంది. దీంతో పాటు గౌహతి, ఇండోర్, విశాఖపట్నం, కొలంబో లు కూడా వేదికలుగా నిర్ణయించారు. మొదట బెంగళూరులో జరగాల్సిన భారత్-శ్రీలంక తొలి మ్యాచ్ ఇప్పుడు అస్సాంలో జరగనుంది. భారత్ లోని నాలుగు వేదికలు, శ్రీలంకలో ఒక వేదికను ఈ టోర్నీ కోసం ఫిక్స్ చేశారు.

56
వేదిక మార్పుపై జైషా ఏమన్నారంటే?

ఐసీసీ ఛైర్మన్ జైషా మాట్లాడుతూ.. "నవి ముంబై మహిళల క్రికెట్‌కు నిజమైన హోమ్‌గా అవతరించింది. ఇక్కడి అభిమానుల మద్దతు అంతర్జాతీయ మ్యాచ్‌లు, వుమెన్స్ ప్రీమియర్ లీగ్ సమయంలో అద్భుతంగా కనిపించింది. ఈ ఉత్సాహం వరల్డ్ కప్‌లో కూడా కొనసాగుతుందని నమ్ముతున్నాను" అని అన్నారు. 

అలాగే, ఈ వరల్డ్ కప్ మహిళల క్రికెట్ భవిష్యత్తును తీర్చిదిద్దే ముఖ్యమైన మలుపుగా గుర్తింపు పొందుతుందని పేర్కొన్నారు.

66
మహిళల వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్
  • మొదటి సెమీ ఫైనల్: అక్టోబర్ 29 – గౌహతి లేదా కొలంబో
  • రెండో సెమీ ఫైనల్: అక్టోబర్ 30 – నవి ముంబై
  • ఫైనల్: నవంబర్ 2 – కొలంబో లేదా నవి ముంబై

2025 సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు జరగనున్న ఈ టోర్నమెంట్‌లో 8 జట్లు పాల్గొంటాయి. 2013 తర్వాత భారత్‌లో జరుగుతున్న మహిళల వన్డే వరల్డ్ కప్ ఇదే. బెంగళూరుకు ఇది చేదు అనుభవంగా మిగిలిపోగా, నవి ముంబై క్రికెట్ లో మరో చరిత్రను రాయడానికి సిద్ధమవుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories