India vs Pakistan: ఆసియా కప్ 2025 బిగ్ అప్డేట్.. భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు?

Published : Jun 29, 2025, 10:29 PM IST

Asia Cup 2025: ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 10న ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) జూలై మొదటివారంలో షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు రిపోర్టులు పేర్కొంటున్నాయి.

PREV
17
వచ్చే వారంలో ఆసియా కప్ 2025 షెడ్యూల్

భారత్-పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, క్రికెట్ ప్రేమికులకు గుడ్ న్యూస్ వచ్చింది. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ సెప్టెంబర్ 10న ప్రారంభం కానుందని క్రిక్‌బజ్ నివేదిక వెల్లడించింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) టోర్నమెంట్ షెడ్యూల్‌ను జూలై మొదటి వారం లోగా విడుదల చేయనున్నట్లు సమాచారం.

27
హైబ్రిడ్ మోడల్‌ లో ఆసియా కప్ 2025, ప్రధాన వేదికగా UAE

ఇండియా అధికారికంగా 2025 ఆసియా కప్‌కు ఆతిథ్యమివ్వనున్నప్పటికీ, టోర్నమెంట్‌ను UAEలో నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మధ్య సుదీర్ఘ చర్చల తర్వాత, భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లు న్యూట్రల్ వేదికలపై జరగాలని ఒప్పందం కుదిరింది. గతంలో ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా వచ్చిన ఈ అవగాహనను ఈసారి కూడా అనుసరించనున్నట్లు తెలుస్తోంది.

37
టెర్రర్ దాడి తర్వాత భారత్ - పాకిస్తాన్ మధ్య ఉత్కంఠ

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్ర దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ సంబంధాలు మరింత ఉద్రిక్తతకు గురయ్యాయి. దాని ప్రభావం క్రికెట్ పైన కూడా పడింది. ఈ నేపథ్యంలో, భారత్ పాకిస్తాన్‌ను బహుళ దేశాల క్రికెట్ టోర్నీల్లో కూడా బహిష్కరించవచ్చనే ఊహాగానాలు వినిపించాయి. కానీ తాజా పరిణామాల ప్రకారం, ఈ ఇద్దరు ప్రత్యర్థుల మధ్య మ్యాచ్‌లు కొనసాగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

47
ఆసియా కప్ లో ఆరు జట్లు.. టీ20 ఫార్మాట్‌లో పోటీలు

ఆసియా 2025 టోర్నమెంట్ టీ20 ఫార్మాట్‌లో జరగనుంది. ఇందులో భారతదేశం, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్తాన్, యూఏఈ జట్లు పాల్గొననున్నాయి. ఇది 2026 టీ20 ప్రపంచకప్‌కు ప్రాక్టీస్ టోర్నీగా పలు జట్లు భావిస్తున్నాయి. టోర్నీ షెడ్యూల్ ఖరారు కోసం ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) సమావేశం జూలైలో జరగనుంది.

57
భారత ప్రభుత్వం అనుమతి ఉంటేనే టీమిండియా ఆడేది !

ఇప్పటికే ఇరు దేశాలు రాజకీయ, భౌగోళిక విభేదాల మధ్య భారత్ - పాకిస్తాన్ జట్లు ద్వైపాక్షిక సిరీస్ లు ఆడటం లేదు. పహల్గామ్ లో ఉగ్రదాడి తర్వాత రెండు దేశాలు మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. దీంతో పాకిస్తాన్ తో అన్ని సంబంధాలు తెంచుకున్న భారత్.. క్రీడల విషయంలో కూడా అదే విధంగా ముందుకు సాగుతుందని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ఇటీవల బీసీసీఐ సైతం పాకిస్తాన్‌తో మ్యాచ్‌లు ఆడే విషయంలో ప్రభుత్వం మార్గదర్శకత్వం ఇవ్వాల్సి ఉందని పేర్కొంది. ఇదే సమయంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఇటీవల “ఇండియాకు ఆసియా కప్ టోర్నీ నుంచి వైదొలిగే ఆలోచన లేదు” అని ప్రకటించారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ అనుమతికి ఎదురు చూస్తున్నట్లు ఇండసైడ్‌స్పోర్ట్ తెలిపింది.

67
మహిళల వరల్డ్‌కప్ షెడ్యూల్‌లో కూడా భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లు

ఐసీసీ ఇటీవల విడుదల చేసిన మహిళల వన్డే వరల్డ్‌కప్ (భారత్, శ్రీలంక ఆతిథ్యంతో), మహిళల టీ20 వరల్డ్‌కప్ (ఇంగ్లండ్ వేదికగా) షెడ్యూల్‌ల్లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లు ఉన్నాయి. ఇది రెండు బోర్డులు మధ్య ఉద్రిక్తతలు ఉన్నా, క్రికెట్‌ను కొనసాగించాలనే ప్రాధాన్యతను సూచిస్తుంది.

77
ఆర్థిక ప్రయోజనాల నేపథ్యంలో క్రికెట్ కొనసాగింపు

భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లు క్రికెట్ బోర్డులకు భారీ ఆదాయాన్ని అందిస్తాయి. ఈ కారణంగా ఐసీసీ, ఏసీసీ, రెండు సభ్య దేశాల బోర్డులు మ్యాచ్ లను కొనసాగించాలనే దిశగా అడుగులు వేస్తున్నాయి. ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ లు ఐసీసీ, ఏసీసీ సహా గ్లోబల్ ఈవెంట్స్‌లో మాత్రమే తలపడుతున్నాయి.

ఆసియా కప్ 2025 పై స్పష్టత జూలై మొదటి వారంలో రానుంది. షెడ్యూల్, వేదికలు, తేదీలతో సహా పూర్తి వివరాలు అధికారికంగా ఏసీసీ ప్రకటించే అవకాశం ఉంది. అన్ని పరిమితులను అధిగమిస్తే, సెప్టెంబర్ 10 నుంచి ఆసియా కప్ 2025 క్రికెట్ అభిమానులకు మరో క్రికెట్ పండుగగా రానుంది.

Read more Photos on
click me!

Recommended Stories