Triple century in ODI: రోహిత్ శర్మ వన్డేల్లో 264 పరుగులతో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ప్లేయర్ గా టాప్ లో ఉన్నాడు. అయితే, ఈ రికార్డును బ్రేక్ చేసి వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ కొట్టే సత్తా ఉన్న ప్లేయర్లు ఓవరో ఇప్పుడు తెలుసుకుందాం.
రోహిత్ శర్మ రికార్డును అధిగమించగల ముగ్గురు బ్యాట్స్‌మెన్ ఎవరు?
వన్డే క్రికెట్‌లో ప్రతి సంవత్సరం ఎన్నో కొత్త రికార్డులు రావడంతో పాటు పాత రికార్డులు బద్దలవుతున్నాయి. కానీ ఇప్పటివరకు ఈ ఫార్మాట్‌లో ఎవరూ ట్రిపుల్ సెంచరీ (Triple Century) సాధించలేకపోయారు. అయితే, వన్డేల్లో మొట్టమొదటి ట్రిపుల్ సెంచరీ కొట్టేది ఎవరు?
26
వన్డేల్లో రోహిత్ శర్మ డబుల్ సెంచరీ రికార్డులు
2014లో కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో శ్రీలంకపై 264 పరుగుల డబుల్ సెంచరీ ఇన్నింగ్స్‌తో రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. దాదాపు పదేళ్లయ్యింది కానీ ఈ అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. ఎవరూ దీనిని బద్దలు కొట్టలేకపోయారు. అయితే ప్రస్తుతం ఉన్న కొంతమంది యువ బ్యాట్స్‌మెన్లు ఈ రికార్డును బ్రేక్ చేయడమే కాదు, వన్డేల్లో తొలి ట్రిపుల్ సెంచరీ సాధించగల శక్తిని కలిగి ఉన్నారు.
36
రోహిత్ శర్మ – ఇప్పటి వరకు వన్డేలో అత్యధిక వ్యక్తిగత స్కోరు
2014 నవంబర్ 13న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ 173 బంతుల్లో 264 పరుగులు చేశారు. ఇందులో 33 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. తొలి 100 పరుగులు 100 బంతుల్లో సాధించిన రోహిత్, ఆ తర్వాత ఆగ్రెసివ్ బ్యాటింగ్‌తో మిగిలిన 164 పరుగులు కేవలం 73 బంతుల్లో సాధించాడు. ఈ స్కోరు ఇప్పటికీ వన్డే క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరుగా ఉంది.
భారత జట్టు యంగ్ కెప్టెన్, టాప్-ఆర్డర్ బ్యాట్స్‌మన్ శుభ్ మన్ గిల్.. వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ సాధించే అవకాశమున్న ఆటగాళ్లలో ముందువరుసలో ఉన్నాడు. 2023లో న్యూజిలాండ్‌పై 208 పరుగులు చేసి వన్డేల్లో తన తొలి డబుల్ సెంచరీ సాధించాడు. గిల్ స్పష్టమైన టెక్నిక్, టైమింగ్‌తో పాటు సెంచరీని సాధించిన తర్వాత కూడా స్ట్రైక్ రేట్ సునామీల పెంచగల సామర్థ్యం కలిగి ఉన్నాడు.
క్రీజులో సెటయ్యాక గిల్ ను ఆపడం కష్టం. బౌలర్లపై ఫోర్లు, బౌండరీలతో విరుచుకుపడతాడు. అతని బ్యాటింగ్‌లోని స్టైల్, బిగ్ ఇన్నింగ్స్ లు ఆడగల సామర్థ్యం ట్రిపుల్ సెంచరీ సాధించేందుకు అవసరమైన అంశాలుగా ఉన్నాయి.
56
పాతుమ్ నిస్సాంక
శ్రీలంక ఓపెనర్ పాతుమ్ నిస్సాంక కూడా వన్డే క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ సాధించగల ఆటగాడిగా ఎదుగుతున్నాడు. 2024 ఫిబ్రవరి 9న అఫ్గానిస్తాన్‌పై 210 నాటౌట్ పరుగులతో శ్రీలంక తరఫున తొలి డబుల్ సెంచరీ చేసిన ఆటగాడు అతనే.
ఓపెనర్‌గా బరిలోకి దిగే పాతుమ్ నిస్సాంకకు మొదటి బంతి నుంచి చివరి వరకు బ్యాటింగ్ చేయగల అవకాశముంది. అతని బ్యాటింగ్‌లో స్థిరత, టెంప్లేట్ బ్యాటింగ్ శైలి, బిగ్ ఇన్నింగ్స్‌లు ఆడగల సామర్థ్యం ట్రిపుల్ సెంచరీ దిశగా అతను ముందుకు సాగే అవకాశముంది.
66
ఇషాన్ కిషన్
ఇషాన్ కిషన్ టీమిండియాలో ప్రస్తుతం స్థిరంగా లేకపోయినా, అతని బ్యాటింగ్ శైలి ట్రిపుల్ సెంచరీ సాధించగలిగే శక్తివంతంగా ఉంటుంది. 2022లో బంగ్లాదేశ్‌పై కేవలం 126 బంతుల్లో 210 పరుగులు చేయడంతో వన్డే క్రికెట్ చరిత్రలో వేగవంతమైన డబుల్ సెంచరీ నమోదు చేశాడు.
అతని హిట్టింగ్ శైలి, స్పీడ్‌తో స్కోరింగ్ చేయగల సామర్థ్యం, మల్టిపుల్ షాట్స్ కలగలుపుతో ప్రత్యర్థి బౌలర్లకు ఇషన్ కిషన్ ఎదురుదెబ్బగా మారాడు. పుల్, కట్, లాఫ్టెడ్ డ్రైవ్, స్వీప్ లాంటి షాట్లు అతని బ్యాటింగ్‌ను వేరే లెవెల్‌కు తీసుకెళ్తాయి. భవిష్యత్తులో అతనికి అవకాశమిస్తే ట్రిపుల్ సెంచరీ చేయడం సాధ్యమే.