India vs England: స్మృతి మంధానా ఇంగ్లాండ్‌పై టీ20లో సెంచరీతో మూడు ఫార్మాట్లలో సెంచరీలు కొట్టిన తొలి భారతీయ మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించారు. విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత ఇప్పుడు జెర్సీ నెంబర్ 18 హాట్ టాపిక్ గా మారింది.
Jersey No 18 : భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ కు ముందు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో జెర్సీ నెంబర్ 18 హాట్ టాపిక్ గా అయింది. ఇప్పుడు ఇంగ్లాండ్ సిరీస్ లో మన ప్లేయర్ల అద్భుతమైన ప్రదర్శనతో మరోసారి జెర్సీ నెంబర్ 18 హాట్ టాపిక్ గా మారింది.
అదేంటి విరాట్ కోమ్లీ లేకుండా జెర్సీ నెంబర్ 18 టాపిక్ ఎందుకు వచ్చింది అనే కదా మీ ప్రశ్న ! ప్రస్తుతం ఇంగ్లాండ్ తో భారత సీనియర్ పురుషుల జట్టుతో పాటు మహిళల జట్టు, అలాగే జూనియర్ జట్టు కూడా సిరీస్ ఆడుతోంది. అందులో జెర్సీ నెంబర్ 18 ధరించిన మహిళా స్టార్ బ్యాటర్ స్మృతి మంధానా, జూనియర్ జట్టులోని వైభవ్ సూర్యవంశీలు అద్భుతమైన ఆటతో దుమ్మురేపుతున్నారు.
26
భారత మహిళా క్రికెట్‌లో కొత్త చరిత్ర
భారత మహిళా క్రికెట్‌లో మరో మైలురాయి నమోదైంది. ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో కెప్టెన్ స్మృతి మంధానా అద్భుతమైన సెంచరీతో భారత జట్టుకు గెలుపు అందించి చరిత్ర సృష్టించారు.
మంధానా 62 బంతుల్లో 112 పరుగులు చేసి టీమిండియాను 210 పరుగుల భారీ స్కోరు వైపు నడిపారు. ఈ విజయంతో ఆమె మూడు ఫార్మాట్లలో సెంచరీలు సాధించిన తొలి భారతీయ మహిళా క్రికెటర్‌గా నిలిచారు.
36
ఇంగ్లాండ్ పై 97 పరుగులతో భారత్ ఘన విజయం
నాటింగ్‌హామ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ తరఫున ధాటిగా ఆడుతూ స్మృతి మంధానా సెంచరీ సాధించారు. టీమిండియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది.
ఆపై బౌలర్ల అద్భుత ప్రదర్శనతో ఇంగ్లాండ్ ను కేవలం 113 పరుగులకే కట్టడి చేయగలిగారు. దీంతో భారత్ 97 పరుగుల తేడాతో విజయం సాధించింది.
రాధా యాదవ్ చెప్పిన మాటలు ప్రేరణ దంచికొట్టిన స్మృతి మంధానా
మ్యాచ్ అనంతరం స్మృతి మంధానా మాట్లాడుతూ.. “మూడు రోజుల క్రితం నేను, రాధా యాదవ్ మాట్లాడుకున్నాం.. నీ ప్రతిభకు న్యాయం చేయాలంటే టీ20లో ఒక సెంచరీ కావాలి అని ఆమె నన్ను ఉత్సాహపరిచింది’ అని చెప్పారు.
"అప్పుడే నిర్ణయం తీసుకున్నాను, ఈ సిరీస్‌లో ఒక మ్యాచ్‌లో సెంచరీ కొట్టాలనీ, మొదటి మ్యాచ్‌లోనే అది సాధించగలగడం చాలా ఆనందంగా ఉంది” అని స్మృతి మంధానా తెలిపారు.
స్మృతి మంధానా మూడు సిక్సర్లు, 15 బౌండరీలతో 112 పరుగులు చేయగా, ఆమెతో పాటు హర్లీన్ దియోల్ 23 బంతుల్లో 43 పరుగులు చేశారు. షెఫాలీ వర్మ 22 బంతుల్లో 20 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ తరపున లారెన్ బెల్ 4 ఓవర్లలో 27 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసారు.
56
డెబ్యూట్‌లో శ్రీ చరణి సంచలనం
20 ఏళ్ల శ్రీ చరణి తన తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లోనే అద్భుతంగా రాణించారు. 3.5 ఓవర్లలో కేవలం 12 పరుగులే ఇచ్చి 4 కీలక వికెట్లు తీసి ఇంగ్లాండ్ ను దెబ్బకొట్టింది. ఇది భారత విజయంలో కీలకమైన ఘట్టంగా నిలిచింది.
ఆమెతోపాటు దీప్తి శర్మ రెండు వికెట్లు (3 ఓవర్లలో 32 పరుగులు), రాధా యాదవ్ రెండు ఓవర్లో రెండు వికెట్లు తీసారు. అమన్‌జోత్ కౌర్, అరుంధతి రెడ్డి మంచి బౌలింగ్ తో చెరో ఒక వికెట్ తీశారు.
66
ఇంగ్లాండ్ బ్యాటింగ్ విఫలం
ఇంగ్లాండ్ 211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. వారి బ్యాటింగ్ లైనప్ భారత బౌలర్ల ముందు నిలవలేకపోయింది. ఓపెనర్లు సోఫియా డంక్లీ (7 పరుగులు), డానీ వ్యాట్ (0) త్వరగా ఔట్ అయ్యారు. కెప్టెన్ నాట్ సివర్-బ్రంట్ ఒక్కరే పోరాడారు. 42 బంతుల్లో 66 పరుగులు చేయగా, మిగతా బ్యాటర్లలో ఎవరూ రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు.
కాగా, భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జూలై 1న బ్రిస్టల్‌లోని కౌంటీ గ్రౌండ్ వేదికగా జరగనుంది. మొదటి మ్యాచ్ గెలవడంతో భారత జట్టు మోమెంటం కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకుంది.