ఆసియా కప్ 2025: టీమిండియా మ్యాచ్‌లు ఏ టైమ్ కు ప్రారంభం అవుతాయి?

Published : Aug 30, 2025, 11:26 PM IST

Asia Cup 2025: ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9న యూఏఈలో ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 28న దుబాయ్‌లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నీ కోసం బీసీసీఐ 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది.

PREV
15
ఆసియా కప్ 2025 ఎప్పుడు ప్రారంభం అవుతుంది?

ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ)లో ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్‌లో ఎనిమిది జట్లు టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. మొత్తం 19 మ్యాచ్‌లు జరుగుతాయి. ఫైనల్ సెప్టెంబర్ 28న దుబాయ్‌లో జరుగుతుంది. భారత జట్టు టైటిల్ ను నిటబెట్టుకోవాలని చూస్తోంది.

DID YOU KNOW ?
ఆసియా కప్ లో భారత్
ఆసియా కప్ లో భారత్ అత్యంత విజయవంతమై జట్టుగా ఉంది. ఇప్పటిరవకు 16 ఎడిషన్లు జరగ్గా.. భారత్ 8 సార్లు ఛాంపియన్ గా నిలిచింది.
25
ఆసియా కప్ లో పాల్గొనే 8 జట్లు ఏవి?

ఆసియా కప్ లో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. 8 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ Aలో భారత్, పాకిస్తాన్, యుఏఈ, ఒమన్ జట్లు ఉన్నాయి. గ్రూప్ Bలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ జట్లు ఉన్నాయి.

ప్రతి జట్టు గ్రూప్ స్టేజ్‌లో మూడు మ్యాచ్‌లు ఆడుతుంది. ప్రతి గ్రూప్ నుంచి రెండు జట్లు సూపర్ ఫోర్‌కు అర్హత సాధిస్తాయి. సూపర్ ఫోర్‌లో అగ్రస్థానాల్లో నిలిచిన రెండు జట్లు ఫైనల్‌లో తలపడతాయి.

35
ఆసియా కప్ 2025 మ్యాచ్ టైమింగ్స్‌లో మార్పులు

సెప్టెంబర్‌లో యూఏఈలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు చేరుతాయని వాతావరణ నివేదికలు పేర్కొంటున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని మ్యాచ్ సమయాలను మారుస్తూ బోర్డులు నిర్ణయం తీసుకున్నాయి. అన్ని మ్యాచ్‌లు స్థానిక సమయం ప్రకారం సాయంత్రం 6:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు) ప్రారంభమవుతాయి.

అయితే సెప్టెంబర్ 15న యుఏఈ వర్సెస్ ఒమన్ మధ్య జరిగే ఒక్క మ్యాచ్ మధ్యాహ్నం 4 గంటలకు (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:30 గంటలకు) ప్రారంభం అవుతుంది.

45
ఆసియా కప్ 2025 ఆతిథ్య నగరాలు ఏవి?

ఆసియా కప్ 2025 కోసం దుబాయ్, అబుదాబి వేదికలుగా ఉన్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్స్ భారత్ ఈసారి సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో ఆడనుంది. భారత్ తన తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 10న యుఏఈతో తలపడుతుంది.

ఆసియా కప్ 2025 భారత్ షెడ్యూల్

సెప్టెంబర్ 10 – భారత్ vs యుఏఈ, దుబాయ్ – రాత్రి 8:00 IST

సెప్టెంబర్ 14 – భారత్ vs పాకిస్తాన్, దుబాయ్ – రాత్రి 8:00 IST

సెప్టెంబర్ 19 – భారత్ vs ఒమన్, అబుదాబి – రాత్రి 8:00 IST

సెప్టెంబర్ 28 – ఫైనల్, దుబాయ్ – రాత్రి 8:00 IST (సెప్టెంబర్ 29 – రిజర్వ్ డే)

55
ఆసియా కప్ 2025 ముఖ్యాంశాలు
  • ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9న యుఏఈలో ప్రారంభం
  • ఎనిమిది జట్లు టైటిల్ కోసం పోటీ పడనున్నాయి
  • మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభం అవుతాయి
  • భారత్ తొలి మ్యాచ్ యుఏఈతో సెప్టెంబర్ 10న ఆడుతుంది
  • భారత్ vs పాకిస్తాన్ పోరు సెప్టెంబర్ 14న దుబాయ్‌లో జరుగుతుంది
  • ఆసియా కప్ 2025 ఫైనల్ సెప్టెంబర్ 28న జరగనుంది
Read more Photos on
click me!

Recommended Stories