Asia Cup 2025: ఆసియా కప్ 2025లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుండా భారత్ ఆడనుంది. అనుభవం లోటు, మిడిల్ ఆర్డర్ బలహీనత, పాకిస్తాన్ తో బిగ్ ఫైట్ వంటి విషయాలు టీమిండియాకు సవాళ్లుగా ఉన్నాయి.
రోహిత్-విరాట్ లేకుండా ఆసియా కప్ 2025 లో భారత జట్టు
ఆసియా కప్ 2025లో 17 ఏళ్ల తర్వాత మొదటిసారి టీమిండియా స్క్వాడ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుండా ఆడనుంది. 2012 తర్వాత ఇదే మొదటి సారి ఈ ఇద్దరు సీనియర్లు టోర్నమెంట్‌కు దూరమవుతున్నారు. సెప్టెంబర్ 9 నుంచి యూఏఈలో జరిగే ఈ ఆసియా కప్ ఈ సారి టీ20 ఫార్మాట్‌లో జరుగుతోంది.
ఇప్పటికే ఈ టోర్నీ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 15 మందితో కూడిన భారత జట్టును ప్రకటించింది. అయితే, సీనియర్ స్టార్ ప్లేయర్లు రోహిత్-విరాట్ లేకపోవడం వల్ల భారత జట్టుకు 3 పెద్ద నష్టాలు జరిగే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
DID YOU KNOW ?
ఆసియా కప్ లో విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ వన్డే, టీ20 ఫార్మాట్లలో ఆడిన ఆసియా కప్ మ్యాచ్‌లలో మొత్తం 1171 పరుగులు సాధించారు. ఆసియా కప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా నిలిచారు. 183 vs పాకిస్తాన్ (2012) పై ఈ టోర్నీలో తన అత్యుత్తమ స్కోర్ నమోదుచేశాడు.
25
పెద్ద టోర్నమెంట్‌లో అనుభవజ్ఞుల లోటుతో భారత జట్టు
ఆసియా కప్ చిన్న టోర్నమెంట్ కాదు. ఇందులో పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి బలమైన జట్లు పోటీ పడుతున్నాయి. ఇలాంటి సందర్భంలో జట్టుకు అనుభవజ్ఞులైన ప్లేయర్లు అవసరం ఉంటుంది.
సూర్యకుమార్ యాదవ్ ఈసారి కెప్టెన్‌గా ముందుకు వస్తున్నారు కానీ ఇది ఆయనకు మొదటి ఆసియా కప్ కెప్టెన్సీ. గతంలో రోహిత్-విరాట్ జట్టును నడిపిస్తూ ప్లేయర్లకు ప్రేరణ ఇచ్చేవారు. ఈసారి ఈ స్టార్స్ లేకపోవడం జట్టుకు అనుభవ లోటును స్పష్టంగా చూపిస్తుంది.
35
కష్టసమయంలో జట్టును ముందుకు నడిపించే ప్లేయర్ కోహ్లీ
విరాట్ కోహ్లీ అనేకసార్లు ఆసియా కప్‌లో టీమిండియాకు ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్లేయర్ గా నిరూపించుకున్నారు. నెమ్మదిగా రన్స్ చేసి, భాగస్వామ్యాలు నిర్మించడంలో ఆయన ప్రత్యేకత నైపుణ్యం చూపించేవారు. అయితే, ప్రస్తుత జట్టులో మిడిల్ ఆర్డర్‌లో కోహ్లీలా కష్టసమయంలో భారత జట్టు ఇన్నింగ్స్ ను నిలబెట్టే ఆటగాడు లేకపోవడం టీమిండియా బ్యాటింగ్‌కు పెద్ద పరీక్ష కానుంది.
విరాట్ కోహ్లీ, పాకిస్తాన్ మధ్య పోటీలు ఎప్పుడూ ప్రత్యేకం. 2012లో ఆయన 183 పరుగుల ఇన్నింగ్స్, 2016లో 49, 2022లో 60-35, 2023లో 122* పరుగులు పాక్ బౌలర్లపై సాధించిన ప్రత్యేక ఇన్నింగ్స్ లుగా ఉన్నాయి. ఈసారి ఆయన లేకపోవడం పాకిస్తాన్ జట్టుకు కొంత ఊరటను ఇస్తుంది. అయితే భారత జట్టుకు పాక్‌ను ఎదుర్కోవడం మరింత కఠినం కావచ్చు. మరి పాక్ పై ఈ సారి ఎవరు ప్రభావం చూపుతారనేది ఆసక్తికరంగా మారింది.
55
టీమిండియాలోని కొత్త ఆటగాళ్లకు సవాలు
ఆసియా కప్ 2025 భారత జట్టులో జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ మినహా ఎక్కువమంది కొత్త ఆటగాళ్లే ఉన్నారు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అనుభవం తక్కువగానే ఉంది. దీంతో రోహిత్-విరాట్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందనే చర్చ మొదలైంది. కొత్త తరం ఆటగాళ్లు ఈ సవాలును ఎలా ఎదుర్కొంటారో చూడాలి మరి !