రాహుల్ ద్రావిడ్ రాజస్థాన్ రాయల్స్ ను వీడటానికి సంజూ శాంసన్ కారణమా?

Published : Aug 30, 2025, 10:16 PM IST

Rahul Dravid - Sanju Samson: ఐపీఎల్ 2026కు ముందు రాహుల్ ద్రావిడ్ రాజస్థాన్ రాయల్స్ కోచ్‌గా రాజీనామా చేశారు. దీనికి సంజూ శాంసన్ కారణం అంటూ కొత్త చర్చ మొదలైంది.

PREV
15
రాజస్థాన్ రాయల్స్ కు రాహుల్ ద్రావిడ్ వీడ్కోలు

రాజస్థాన్ రాయల్స్ (RR) హెడ్ కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రావిడ్ పదవికి రాజీనామా చేశారు. ఐపీఎల్ 2026 ముందు ఆయన పదవి నుంచి వైదొలిగినట్లు ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. 2024 సెప్టెంబర్ 6న కోచ్‌గా నియమితులైన ద్రావిడ్ కేవలం ఒకే సీజన్ అనంతరం ఈ బాధ్యత నుంచి తప్పుకున్నారు. ఇంతకుముందు ఆయన రాయల్స్ కు కెప్టెన్ గా, మెంటర్ గా కూడా సేవలు అందించారు.

DID YOU KNOW ?
రాహుల్ ద్రావిడ్ ఐపీఎల్ కెప్టెన్సీ
రాహుల్ ద్రావిడ్ ఐపీఎల్‌లో 2008లో RCB, 2012-2013లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా ఉన్నారు. ఆయన నాయకత్వంలో RR జట్టు 2013లో ప్లేఆఫ్స్ చేరి, ఛాంపియన్స్ లీగ్ T20 ఫైనల్‌కి చేరింది. ద్రావిడ్ ప్రశాంతమైన, ప్రేరణనిచ్చే కెప్టెన్‌గా గుర్తింపు పొందారు.
25
ఐపీఎల్ 2025లో ఆర్ఆర్ నిరాశాజనక ప్రదర్శన కారణమా?

2025 ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ దారుణంగా ఆడింది. రాహుల్ ద్రావిడ్ కోచ్‌గా ఉండగా జట్టు 14 మ్యాచ్‌ల్లో కేవలం 4 విజయాలే సాధించింది. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ కంటే కేవలం నెట్ రన్‌రేట్ ఆధారంగా మాత్రమే ముందంజలో నిలిచింది. 

టీ20 ప్రపంచకప్ తర్వాత కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన విక్రమ్ రాథోర్‌ను బ్యాటింగ్ కోచ్‌గా తీసుకొచ్చినా ఫలితాలు రాలేదు. భారత జట్టు హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ అద్భుత ఫలితాలు తీసుకొచ్చారు. దీంతో భారీ అంచనాలతో ద్రావిడ్ ను రాయల్స్ ప్రధాన కోచ్ గా జట్టులోకి తీసుకుంది. ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతోనే ద్రావిడ్ జట్టును వీడుతున్నారనే చర్చ కూడా సాగుతోంది.

35
రాజస్థాన్ రాయల్స్‌తో రాహుల్ ద్రావిడ్ ప్రయాణం

రాహుల్ ద్రావిడ్ రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్లేయర్ గా, కెప్టెన్ గా, మెంటర్ గా, ప్రధాన కోచ్ గా సేవలు అందించారు. 2011లో రాయల్స్ జట్టులో ఆటగాడిగా చేరారు. 2012, 2013లో కెప్టెన్‌గా ఆర్ఆర్ జట్టును నడిపారు. 2014, 2015లో టీమ్ డైరెక్టర్, మెంటార్‌గా పని చేశారు. 

2024లో హెడ్ కోచ్‌గా తిరిగి చేరిన తర్వాత జట్టు సంస్కృతి, ఆటగాళ్ల అభివృద్ధిపై దృష్టి సారించారు. అయితే ఫ్రాంచైజీ నిర్వహణ మార్పుల తర్వాత ఆయనకు మరో పెద్ద రోల్ ను ఆఫర్ చేసినా ద్రావిడ్ తిరస్కరించారని సమాచారం.

45
ద్రావిడ్ రాజీనామాకు సంజూ శాంసన్ కారణమా?

రాహుల్ ద్రావిడ్ రాజీనామా తర్వాత సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఊహాగానాలు పెరిగాయి. కొన్ని పోస్టుల ప్రకారం జట్టు మేనేజ్‌మెంట్ సంజూ శాంసన్, ద్రావిడ్ ఇద్దరిలో ఒకరిని ఎంచుకోవాల్సి వచ్చిందని, చివరకు శాంసన్ ను కొనసాగించారనే కామెంట్స్ చేస్తున్నారు. 

ఒక అభిమాని “ద్రావిడ్ వెళ్లిపోతే శాంసన్ 100% జట్టులో ఉంటాడు” అని పోస్ట్ చేశారు. మరోవైపు, “సంజూ వెనుకే ద్రావిడ్ వైదొలగాల్సి వచ్చింది” అని మరో అభిమాని వ్యాఖ్యానించారు. అయితే అధికారికంగా ఎటువంటి విభేదాల గురించి ద్రావిడ్ గానీ, సంజూ శాంసన్ గానీ ప్రస్తావించలేదు.

55
ఆటగాళ్ల రిటెన్షన్‌లో రాహుల్ ద్రావిడ్ కీలక పాత్ర

2025 సీజన్ ముందు వేలం వ్యూహంలో, ఆటగాళ్ల రిటెన్షన్‌లో రాహుల్ ద్రావిడ్ కీలక పాత్ర పోషించారు. సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, ధృవ్ జురెల్, రియాన్ పరాగ్, షిమ్రాన్ హిట్మేయర్ వంటి ఆటగాళ్లను జట్టులోనే ఉంచడంలో ఆయన నిర్ణయం కీలకంగా ఉంది. అయితే గాయాలు, క్లోజ్ మ్యాచ్‌లలో ఓటములు జట్టు అవకాశాలను దెబ్బతీశాయి. అలాగే, సీజన్ సమయంలో రాహుల్ ద్రావిడ్ గాయాలు కూడా కొంత ప్రభావం చూపాయనే చర్చ సాగింది.

తాజా పరిస్థితుల్లో రాజస్థాన్ రాయల్స్ కొత్త కోచ్ కోసం అన్వేషించే అవకాశముంది. లేకపోతే ప్రస్తుతం క్రికెట్ డైరెక్టర్‌గా ఉన్న కుమార్ సంగక్కరను మళ్లీ ప్రధాన కోచ్ బాధ్యతల్లోకి తీసుకురావచ్చు. ప్రస్తుతం జట్టులో సంగక్కర (డైరెక్టర్ ఆఫ్ క్రికెట్), విక్రమ్ రాథోర్ (బ్యాటింగ్ కోచ్), షేన్ బాండ్ (బౌలింగ్ కోచ్) ఉన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories