IND vs PAK: ఆసియా కప్ 2025 ఫైనల్… ట్రంప్ కార్డ్ ను కోల్పోయిన భారత్.. హార్దిక్, వకార్ యూనిస్ డ్రామా

Published : Sep 28, 2025, 08:35 PM IST

Asia Cup 2025 Final IND vs PAK: ఆసియా కప్ 2025 ఫైనల్‌లో భారత్–పాకిస్తాన్ తలపడుతున్నాయి. హార్దిక్ పాండ్యా ఔట్ కాగా, టాస్ సమయంలో వకార్ యూనిస్ ఎంట్రీతో కొత్త వివాదం చెలరేగింది.

PREV
15
ఆసియా కప్ 2025 ఫైనల్: భారత్ vs పాకిస్తాన్ బిగ్ ఫైట్

దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం ఆసియా కప్ 2025 ఫైనల్ ప్రారంభమైంది. భారత్–పాకిస్తాన్ జట్లు తొలిసారి ఆసియా కప్ ఫైనల్‌లో ఎదురెదురయ్యాయి. ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌లో టాస్ నుంచే ఉత్కంఠభరిత పరిణామాలు చోటుచేసుకున్నాయి. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. 

25
టీమిండియాకు షాక్.. హార్దిక్ పాండ్యా ఔట్

టాస్ అనంతరం భారత జట్టుకు ఒక చేదు వార్త ఎదురైంది. మ్యాచ్ విన్నర్‌గా నిలిచే సామర్థ్యం ఉన్న ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఫైనల్ ఫైట్ కు దూరం అయ్యాడు. అతని స్థానంలో రింకూ సింగ్‌ను జట్టులోకి వచ్చాడు. భారత్ మూడు మార్పులతో మైదానంలోకి దిగింది. జస్ప్రీత్ బుమ్రా, శివం దుబే మళ్లీ జట్టులోకి వచ్చారు. గత మ్యాచ్‌లో ఆడిన హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్ ప్లేయింగ్-11 నుంచి అవుట్ అయ్యారు. 

మంచి ఫామ్ లో ఉన్న హార్దిక్ పాండ్యా లేకపోవడం భారత్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పాలి. ఎందుకంటే అతను ఓపెనింగ్ బౌలింగ్ తో వికెట్లు అందిస్తున్నాడు. అలాగే, బ్యాటింగ్ లో కూడా మంచి టచ్ లో ఉన్నాడు. పాక్ పై మంచి రికార్డులు ఉన్న హార్దిక్ పాండ్యా ఫైనల్ పోరులో లేకపోవడం భారత్ కు ఎదురుదెబ్బ. 

35
భారత్–పాకిస్తాన్ ప్లేయింగ్ ఎలెవన్

భారత్ జట్టు: అభిషేక్ శర్మ, శుభ్ మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజూ శాంసన్(వికెట్‌కీపర్), శివం దుబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.

పాకిస్తాన్ జట్టు: సహిబ్‌జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా (కెప్టెన్), హుస్సేన్ తలత్, మహ్మద్ హారిస్ (వికెట్‌కీపర్), మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, హారిస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్.

45
భారత్ vs పాకిస్తాన్: వకార్ యూనిస్ ఎంట్రీతో టాస్ డ్రామా

ఆసియా కప్ 2025 ఫైనల్‌లో టాస్ సమయంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. సాధారణంగా ఒకే బ్రాడ్‌కాస్టర్ టాస్‌ను నిర్వహిస్తారు. కానీ ఈసారి ఇద్దరు మైదానంలో కనిపించారు. భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో రవి శాస్త్రి మాట్లాడగా, పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అగాతో వకార్ యూనిస్ సంభాషించారు. లీగ్ మ్యాచ్‌లలో మాత్రం సల్మాన్ అగా భారత బ్రాడ్‌కాస్టర్‌తోనే మాట్లాడాడు.

55
షేక్ హ్యాండ్‌ వివాదం కొనసాగుతూనే ఉంది

భారత్–పాకిస్తాన్ మ్యాచ్‌లలో హ్యాండ్‌షేక్ వివాదం కొనసాగుతూనే ఉంది. లీగ్ స్టేజ్ నుంచే భారత ఆటగాళ్లు హ్యాండ్‌షేక్ చేయకపోవడం చర్చనీయాంశమైంది. ఫైనల్ ముందు కూడా భారత్ పాకిస్తాన్‌తో ట్రోఫీ ఫోటోషూట్ చేయడాన్ని నిరాకరించింది. కొన్ని రిపోర్టుల ప్రకారం, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ గెలిస్తే కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ అధికారి మొహ్సిన్ నక్వీ నుండి ట్రోఫీ తీసుకోకుండా ఉండే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

Read more Photos on
click me!

Recommended Stories