
Reliance Foundation Scholarships 2025-26 : చదువుకోవాలని తపన ఉండికూడా ఆర్థిక కష్టాలు, ఇతర సమస్యల కారణంగా చాలామంది చదువుకోలేకపోతున్నారు. మరీముఖ్యంగా ఉన్నత విద్యాభ్యాసం సమయంలో కుటుంబానికి భారం కాకూడదని ఆత్మాభిమానంతో చదువు మానేసి ఏదో ఒక ఉద్యోగంలో చేరిపోయేవారు సమాాజంలో చాలామంది కనిపిస్తుంటారు. ఇలా మంచి టాలెండ్ ఉండి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న యువతకు అండగా నిలుస్తోంది రిలయన్స్ ఫౌండేషన్. గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివేవారికి ప్రతిఏటా ప్రత్యేక స్కాలర్ షిప్స్ అందిస్తోంది.ఇలా ఈ విద్యాసంవత్సరం 2025-26 కు గాను యూజి, పిజి విద్యార్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది రిలయన్స్ ఫౌండేషన్.
ప్రస్తుతం భారతదేశం యువతతో నిండివుంది... ప్రపంచంలో అత్యధికంగా 25 ఏళ్లలోపు యువతీయువకులు కలిగిన దేశంగా గుర్తింపు పొందింది. అయితే ఈ యువశక్తిని సరైన మార్గంలో నడిపిస్తేనే దేశానికి ఉపయోగం... ఇందుకోసం తనవంతు ప్రయత్నం చేస్తోంది రిలయన్స్. యువత ఉన్నత చదువుల కోసం ఆర్థిక సాయం చేసేందుకు రిలయన్స్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. ప్రతిఏటా 5000 మంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులను మెరిట్ ఆధారంగా ఎంపికచేసి స్కాలర్షిప్స్ అందిస్తోంది. ఇలా ఆర్థిక కష్టాలు వారి చదువుకు అడ్డంకి కాకుండా చూస్తోంది... తద్వారా యువత తమ కలలను సాకారం చేసుకునే అవకాశం కల్పిస్తోంది.
రూ.15 లక్షలలోపు వార్షికాదాయం కలిగిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఈ రిలయన్స్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్ ఇయర్ 2025-26 లో ఏదైనా డిగ్రీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నవారు అర్హులు. ఈ స్కాలర్ షిప్ కు ఎంపికైనవారు డిగ్రీ పూర్తయ్యేవరకు రూ.2 లక్షల వరకు ఆర్థికసాయం పొందుతారు. అలాగే ఇంకొన్ని విషయాల్లోనూ రిలయన్స్ ఫౌండేషన్ సహకారం లభిస్తుంది.
1. ఇండియన్ సిటిజన్ అయివుండాలి
2. ఇంటర్మీడియట్ లో కనీసం 60 శాతం మార్కులతో పాసై ఉండాలి.
3. 2025-26 అకడమిక్ ఇయర్ లో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుండాలి. రెగ్యులర్ ఫుల్ టైమ్ డిగ్రీ కోర్సులు చదివేవారే అర్హులు
4. కుటుంబ వార్షిక ఆదాయం రూ.15 లక్షల లోపు ఉండాలి.
5. రాతపరీక్షలో మంచి మార్కులు సాధించాలి.
6. కేవలం 5000 మందిని మాత్రమే ఈ స్కాలర్ షిప్ ప్రోగ్రాంకు ఎంపికచేస్తారు.
1. కేవలం ఈ అకడమిక్ ఇయర్ లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివేవారు మాత్రమే అర్హులు. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ చదివేవారికి అవకాశం ఉండదు.
2. డిస్టెన్స్, ఆన్లైన్, హైబ్రిడ్, రిమోట్ వంటి నాన్ రెగ్యులర్ పద్దతుల్లో డిగ్రీ చేసేవారు అనర్హులు.
3. పదో తరగతి తర్వాత తప్పకుండా ఇంటర్మీడియట్ చదివి వుండాలి. డిప్లోమా చేసినవారు ఈ స్కాలర్షిప్ కు అనర్హులు.
4. రెండేళ్లు, ఆరేళ్ల అండర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసేవారు అనర్హులు
5. రిలయన్స్ ఫౌండేషన్ నిర్వహించే ఆప్టిట్యూడ్ టెన్ట్ రాయనివారు, పరీక్షలో చీటింగ్ చేస్తూ పట్టుబడ్డవారు అనర్హులు.
ఈ స్కాలర్ షిప్ పొందేందుకు అన్ని అర్హతలు గల అభ్యర్థులు రిలయన్స్ ఫౌండేషన్ అధికారిక వెబ్ సైట్ https://scholarships.reliancefoundation.org/UG_Scholarship.aspx పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలి. వ్యక్తిగత, అకడమిక్ సమాచారంతో పాటు కాంటాక్ట్ డిటెయిల్స్ తో దరఖాస్తు పూర్తిచేయాలి.
ఇలా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహిస్తారు. వెర్బల్ ఎబిలిటి, అనాలిటికల్ ఆండ్ లాజికల్ ఎబిలిటి, న్యూమరికల్ ఎబిలిటి వంటి అంశాలపై ఇచ్చే 60 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలను 60 నిమిషాల్లో పూర్తిచేయాలి. ఇందులో సాధించిన స్కోరు, అకడమిక్, వ్యక్తిగత వివరాల ఆధారంగా 5000 మందిని ఎంపికచేస్తారు.
భవిష్యత్ లో మంచి డిమాండ్ ఉన్న విభాగాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే 100 మందిని మాత్రమే ఈ స్కాలర్ షిప్ కోసం ఎంపికచేస్తారు. అంటే ఇంజనీరింగ్, లైఫ్ సైన్సెస్ విభాగాల్లో అద్భుతాలు చేసేవారికి ఈ స్కాలర్ షిప్ లభిస్తుంది. ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్సెస్, మ్యాథ్స్ ఆండ్ కంప్యూటింగ్, ఎలక్ట్రానికల్ ఆండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, రెన్యువబుల్ ఆండ్ న్యూ ఎనర్జీ, మెటీరియల్ సైన్స్ ఆండ్ ఇంజనీరింగ్, లైఫ్ సైన్సెస్ లో పిజి చేసేవారు అర్హులు. ఈ స్కాలర్ షిప్ కేవలం ఆర్థిక సాయమే కాదు అనేక అవకాశాలు కల్పిస్తుంది.
అయితే ఈ పిజి స్కాలర్ షిప్ కు ఎంపిక విధానం కాస్త కఠినంగా ఉంటుంది. మొదట పరీక్ష, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది... ఇందులో ప్రతిభ చూపిన 100 ఎంపిక చేస్తారు. వీరి పిజి పూర్తయ్యేవరకు రూ.6 లక్షల వరకు ఆర్థికసాయంతో పాటు మరికొన్ని బెనిఫిట్స్ కల్పిస్తారు.
రిలయన్స్ ఫౌండేషన్ అందించే యూజి, పిజి స్కాలర్షిప్స్ కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమయ్యింది. ఇది అక్టోబర్ 4, 2025 వరకు కొనసాగుతుంది. ఆసక్తి, అర్హతలు గల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కాలర్ షిప్స్ కు సంబంధించి ఏమైనా అనుమానాలుంటే 7977100100 నంబర్ కు వాట్సాప్ చేయవచ్చు. లేదంటే హెల్ప్ లైన్ నంబర్ (011) 41171414 కు ఫోన్ చేయవచ్చు లేదా RF.UGScholarships@reliancefoundation.org మెయిల్ చేయవచ్చు.