ప్రైవేట్ రంగంలో జీతాలు ఎక్కువే, పని ఎక్కువే… ప్రభుత్వ రంగంలో జీతాలు తక్కువ, పని తక్కువ అనే భావన ప్రజల్లో ఉంది. అయితే కొన్ని గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రైవేట్ రంగాల్లో మాదిరిగా లక్షల్లో సాలరీ ఉంది.. అలాంటి ఉద్యోగాలేవో ఇక్కడ తెలుసుకుందాం.
Highest Paying Government Jobs : ప్రభుత్వ ఉద్యోగం... ఇది చాలామంది యువత కల. ప్రైవేట్ రంగంలో మంచి సాలరీలు ఉన్నా పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం, జాబ్ సెక్యూరిటీ లేకపోవడంతో చాలామంది ప్రభుత్వ ఉద్యోగాల వైపే మొగ్గుచూపుతున్నారు. అయితే కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలు కార్పోరేట్ కంపెనీల ఉద్యోగుల స్థాయిలో భారీ సాలరీలను కూడా కలిగివున్నాయి. ఇలా అన్నివిధాలుగా సౌకర్యవంతంగా ఉండి అత్యధిక జీతాలు కలిగిన టాప్ 5 ప్రభుత్వ ఉద్యోగాలేవో ఇక్కడ తెలుసుకుందాం.
26
1. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS), ఇండియన్ పోలీస్ సర్వీసెస్ (IPS) :
భారతదేశంలో అత్యున్నతమైన ప్రభుత్వ ఉద్యోగాలు ఈ ఐఏఎస్, ఐపిఎస్. పాలనా వ్యవహారాల్లో ఈ అధికారులే అత్యంత కీలకపాత్ర పోషించేది. అందుకే యూపిఎస్సి (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్) అత్యంత కఠిన పరీక్షల ద్వారా దేశంలోని టాలెంటెడ్ యువతను ఈ ఐఏఎస్, ఐపిఎస్ ఉద్యోగాలకు ఎంపికచేస్తుంది. ఇలా పాలనలో కీలకంగా వ్యవహరించే ఈ సివిల్ సర్వెంట్స్ కు అత్యధిక సాలరీ, ప్రత్యేక అలవెన్సులు ఉంటాయి.
సాధారణంగా ఐఏఎస్, ఐపిఎస్ బాధ్యతలు చేపట్టిన మొదట్లో రూ.56,100 సాలరీని పొందుతారు. ఇలా 8 ఏళ్ళపాటు తక్కువ సాలరీలే ఉంటాయి... అయితే ఆ తర్వాత సీనియారిటీని బట్టి వీరికి రూ.1,31,249 నుండి రూ.2,50,000 వరకు జీతాలు అందుతాయి. అంతేకాదు గవర్నమెంట్ నివాసం, వ్యక్తిగత సహాయకులు, కారు వంటి ఇతర సౌకర్యాలను కూడా ప్రభుత్వమే అందిస్తుంది. ఇలా దేశంలో అత్యధిక సాలరీలు అందుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగుల్లో ఐఏఎస్, ఐపిఎస్ లు టాప్ లో ఉంటారు.
36
2. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI Jobs) :
భారత ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైనది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా... కాబట్టి ఇందులో పనిచేసే ఉద్యోగులకు కూడా మంచి సాలరీలు ఉంటాయి. ఆర్బిఐ గ్రేడ్ బి లో DEPR (Department of Economic and Policy Research), DSIM (Department of Statistics and Information Management)వంటి ఉద్యోగాలుంటాయి. ఈ ఉద్యోగాలకు ప్రారంభ జీతమే రూ.55,200 వరకు ఉంటుంది. ఇలా అనుభవం ఆధారంగా దాదాపు రూ.1,08,404 వరకు సాలరీ ఉంటుంది.
3. ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలు (Indian Army and Airforce Jobs) :
ఇండియన్ డిఫెన్స్ అకాడమీ ఆండ్ నావల్ అకాడమీ (NDA & NA) ఇండియన్ ఆర్మీలో పనిచేసే అవకాశం కల్పిస్తున్నాయి. ఈ విభాగంలో పనిచేసే ఉద్యోగులకు మంచి సాలరీలు, అలవెన్సులు ఉంటాయి. గత 7వ కమీషన్ సిపారసులు అమల్లోకి వచ్చాక డిఫెన్స్ రంగంలో ఉద్యోగులకు జీతాలు భారీగా పెరిగాయి.
NDA లో లెఫ్టినెంట్ గా చేరిన ఉద్యోగులకు ఆరంభంలోనే రూ.56,100 వరకు సాలరీ వస్తుంది. ఈ ఉద్యోగులకు అత్యధికంగా రూ.1,77,500 వరకు జీతాలు ఉంటాయి.
దేశంలో ఎంతో కీలకమైన ప్రభుత్వ సంస్థలు ఈ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO), డిఫెన్స్ రీసెర్చ్ ఆండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO). కాబట్టి ఇందులో పనిచేసే శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు అత్యధిక సాలరీలు పొందుతున్నారు. ముఖ్యంగా సైంటిస్ట్, అసిస్టెంట్ సైంటిస్ట్, జూనియర్ ప్రొడ్యూసర్, సోషల్ రీసెర్చ్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్ వంటి పోస్టుల్లో పనిచేసే ఉద్యోగులు రూ.56,100 నుండి రూ.1,77,500 సాలరీలు అందుకుంటారు.
66
5. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (Indian Forest Jobs) :
ప్రకృతి అందాలమధ్య చేసే ఉద్యోగాలు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ లో ఉంటాయి. ఇందులో అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వంటి ఉద్యోగాలుంటాయి. జూనియర్ గ్రేడ్ ఫారెస్ట్ సర్వీస్ ఉద్యోగులకే నెలకు రూ.56,100 వరకు సాలరీ ఉంటుంది. అనుభవం, పదోన్నతుల ఆధారంగా రూ.2,25,000 వరకు నెలజీతం పొందే ఉద్యోగులు కూడా ఇండియన్ ఫారెస్ట్ సర్విస్ లో కనిపిస్తారు. అలాగే ఈ ఉద్యోగులు ఇతర బెనిఫిట్స్, అలవెన్సులు... ఉద్యోగ విరమణ అనంతరం బెనిఫిట్స్ పొందుతారు.