Great Place To Work : ఉద్యోగులు మెచ్చిన దేశంగా భారత్... ఆసియాలోనే టాప్

Published : Sep 01, 2025, 09:20 PM IST

ఆసియాలోనే అత్యుత్తమ పని వాతావరణం గల దేశంగా భారత్  నిలిచింది. ఈ మేరకు 'గ్రేట్ ప్లేస్ టు వర్క్' సంస్థ సర్వేలో ఆసక్తికర వివరాలు బైటపడ్డాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం. 

PREV
15
బెస్ట్ వర్క్ కల్చర్ లో ఇండియా టాప్

ఆసియాలోనే అత్యుత్తమ పని వాతావరణం గల దేశాల్లో భారతదేశం మొదటి స్థానంలో ఉందని 'గ్రేట్ ప్లేస్ టు వర్క్' (Great Place To Work) సంస్థ 2025 నివేదికలో తెలిపింది. ఆసియాలోని టాప్ 100 కంపెనీల్లో 48 భారతదేశంలోనే ఉన్నాయని… అదేవిధంగా మధ్యస్థాయి కంపెనీల విభాగంలో 12 ఇక్కడ ఉన్నాయని ఈ సంస్థ వెల్లడించింది. వర్క్ ప్లేస్ కల్చర్, ఉద్యోగుల అనుభవం భారతదేశ అభివృద్ధిని చూపిస్తున్నాయని ఈ నివేదిక పేర్కొంది.

25
32 లక్షల మంది ఉద్యోగులతో సర్వే

ఈ నివేదిక 32 లక్షలకు పైగా ఉద్యోగుల అభిప్రాయాల ఆధారంగా రూపొందించబడింది. గ్రేట్ ప్లేస్ టు వర్క్ జాబితాలోని కంపెనీల్లో ఎక్కువ శాతం ఉద్యోగులు ఇక్కడ పనిచేయడంపై సానుకూల అనుభవాలను పొందామని చెప్పారు.

91% మంది ఉద్యోగులు తమ పనిని ప్రభావితం చేసే నిర్ణయాల్లో తాము భాగస్వాములుగా భావిస్తున్నామని తెలిపారు. అలాగే 86% మంది ఉద్యోగులు తమ మేనేజర్లు, ఉన్నతాధికారులు నిష్పక్షపాతంగా, న్యాయంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.

35
బెస్ట్ ప్లేస్ టు వర్క్ జాబితాలోని ఇండియన్ కంపెనీలు

93% మంది ఉద్యోగులు వయస్సు, లింగం, హోదా, జాతి లేదా లైంగిక ధోరణితో సంబంధం లేకుండా తాము న్యాయంగా వ్యవహరించబడుతున్నామని భావిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం జాబితాలో ఉన్న కొన్ని ముఖ్యమైన భారతీయ కంపెనీలలో Novartis, Schneider Electric, Ericsson, Visa, NVIDIAలు ఉన్నాయి.

45
గ్రేట్ ప్లేస్ టు వర్క్ సంస్థ సిఈవో కామెంట్స్

'గ్రేట్ ప్లేస్ టు వర్క్' సంస్థ CEO మైఖేల్ సి. బుష్ మాట్లాడుతూ.. "ఈ జాబితాలోని ముఖ్య కంపెనీలు సమాజాలను బలోపేతం చేసే, దేశాలను అభివృద్ధి చేసే, ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చే పని ప్రదేశాలను సృష్టిస్తున్నాయి" అని అన్నారు.

55
గ్రేట్ ప్లేస్ టు వర్క్ సంస్థ ఇండియా సీఈవో కామెంట్స్

భారతదేశం గణనీయమైన కృషి గురించి 'గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇండియా' CEO బల్బీర్ సింగ్ మాట్లాడుతూ.. "ఈ జాబితాలో అనేక భారతీయ కంపెనీల ప్రాతినిధ్యం నిజంగా ప్రశంసనీయం. ఈ పని ప్రదేశాల ద్వారా పెంపొందించబడిన న్యాయం, అద్భుతమైన సంస్కృతికి ఇది ఒక శక్తివంతమైన నిదర్శనం" అని అన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories