Published : Jul 30, 2025, 11:33 PM ISTUpdated : Jul 31, 2025, 12:39 AM IST
RRB Recruitment Notification : రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఇండియన్ రైల్వేలో భర్తీచేయనున్న ఉద్యోగాల వివరాలను ఇక్కడ తెలుసుకొండి.
రైల్వేలో ఉద్యోగం సంపాదించాలని చాలా మంది కలలు కంటారు. అలాంటివారికి ఇది మంచి అవకాశం. ఇప్పుడు రైల్వేలో పారామెడికల్ స్టాఫ్ 434 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్ (RRB) ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.
DID YOU KNOW ?
ప్రపంచంలోనే రెండోస్థానం
భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అత్యధిక ఉద్యోగులను కలిగిన సంస్థల్లో ఇండియన్ రైల్వేది రెండో స్థానం. సుమారు 14 లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు.
26
రైల్వేలో ఖాళీల వివరాలు
నర్సింగ్ సూపరింటెండెంట్ - 272
ఫార్మసిస్ట్ - 105
హెల్త్ & మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ III - 33
ల్యాబ్ అసిస్టెంట్ - 12
ఎక్స్-రే టెక్నీషియన్ - 4
ఈ.సి.జి టెక్నీషియన్- 4
డయాలసిస్ టెక్నీషియన్ - 4
మొత్తం 434 ఖాళీలు.
36
సాలరీ వివరాలు
నర్సింగ్ సూపరింటెండెంట్ - రూ.44,900
డయాలసిస్ టెక్నీషియన్ - రూ.35,400
హెల్త్ & మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ III - రూ.35,400
ఉద్యోగాన్ని బట్టి అర్హతలు మారుతాయి. నర్సింగ్ సూపరింటెండెంట్ కి జనరల్ నర్సింగ్ లాంటివి చదివి ఉండాలి. డయాలసిస్ టెక్నీషియన్ కి బీఎస్సీ (డిప్లొమా ఇన్ హెమోడయాలసిస్) తో పాటు అనుభవం ఉండాలి. ఫార్మసిస్ట్ కి 10, 12 తరగతులతో సైన్స్ తో డిప్లొమా లేదా బీ.ఫార్మ్ ఉండాలి.
56
వయోపరిమితి
నర్సింగ్ సూపరింటెండెంట్ కి 20 నుండి 43 ఏళ్ల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. మిగతా ఉద్యోగాలకు 36 ఏళ్ల లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, జనరల్ దివ్యాంగులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
66
ఎంపిక విధానం
కంప్యూటర్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500. ఎస్సీ/ఎస్టీలకు రూ.250. పరీక్ష రాసిన తర్వాత ఈ డబ్బులు తిరిగి ఇస్తారు. జనరల్ అభ్యర్థులకు రూ.400 తిరిగి ఇస్తారు. సెప్టెంబర్ 8 దరఖాస్తుకు చివరి తేదీ. ఆన్లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాలి.