TGPSC : నిరుద్యోగ యువతకు నెలనెలా ఖర్చులకు డబ్బులు... ఇందుకోసం వెంటనే దరఖాస్తు చేసుకొండి

Published : Jul 25, 2025, 11:23 AM ISTUpdated : Jul 25, 2025, 11:46 AM IST

తెలంగాణ యువతీయువకులకు అద్భుత అవకాశం. ప్రభుత్వమే ఖర్చులకు డబ్బులిచ్చి ప్రభుత్వ ఉద్యోగాలను పొందేందుకు సిద్దంచేస్తుంది. ఇందుకోసం అభ్యర్థులు ఏం చేయాలో తెలుసా? 

PREV
17
తెలంగాణ యువతకు బంపరాఫర్

Free Coaching For Government, Bank, RRB Jobs : డిగ్రీలు చేతబట్టుకుని ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యువతీయువకులకు సాయం చేసేందుకు ముందుకువచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగాలను పొందేందుకు సహకరించడంతో పాటు యువతకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూస్తోంది... ఇందుకోసం తెలంగాణ బిసి స్టడీ సర్కిల్స్ ద్వారా ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతోంది.

చాలామంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనేది కల. కానీ వారి పేదరికం ఆ లక్ష్యానికి అడ్డుపడుతుంటుంది. ఇలాంటివారిలో టాలెంటెడ్ స్టూడెంట్స్ కి ఉచితంగానే నిపుణులతో కోచింగ్ ఇప్పిస్తుంటుంది తెలంగాణ స్టడీ సర్కిల్. తాజాగా గ్రూప్ 1, 2, 3, 4 ఉద్యోగాలతో పాటు రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్ (RRB), స్టాఫ్ సెలక్షన్ కమీషన్ (SSC), బ్యాంకింగ్ ఉద్యోగాలకు సన్నద్దమయ్యే పేద విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ ఇచ్చేందుకు ప్రకటన విడుదల చేసింది.

27
తెలంగాణ విద్యార్థులకు ఫ్రీ కోచింగ్

డిగ్రీలో మంచి మార్కులుండి ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్దమయ్యే యువతీయువకులు వెంటనే బిసి స్టడి సర్కిల్ లో ఫ్రీ కోచింగ్ కోసం దరకాస్తు చేసుకోవచ్చు. అయితే ఇది కేవలం బిసి, ఎస్సి, ఎస్టి విద్యార్థులకు మాత్రమే. రాష్ట్రంలోని మొత్తం 12 బిసి స్టడీ సర్కిల్స్ లో 150 రోజులు అంటే ఐదునెలల పాటు మీరు ఎంచుకునే ఉద్యోగాన్ని సాధించేందుకు కోచింగ్ ఇస్తారు. ఆయా రంగంలోని ప్రముఖులు, నిపుణులతో క్లాసులు ఇప్పించడమే కాదు ప్రిపరేషన్ కోసం ఇతర సౌకర్యాలు కూడా కల్పిస్తుంది బిసి స్టడి సర్కిల్.

ఇప్పటికే బిసి స్టడి సర్కిల్ లో ఫ్రీ కోచింగ్ కోసం ప్రకటన వెలువడి దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమయ్యింది. వచ్చేనెలలోనే సెలక్ట్ అయ్యే అభ్యర్థులతో కొత్త బ్యాచ్ కు క్లాసులు ప్రారంభించనున్నారు. మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్దం అవుతుంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొండి... వెంటనే దరఖాస్తూ చేసుకొండి.

37
ముఖ్యమైన తేదీలు

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 16 జులై 2025

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ : 11 ఆగస్ట్ 2025

ఫ్రీ కోచింగ్ కు సెలెక్ట్ అయిన అభ్యర్థుల జాబితా ప్రకటన : 14 ఆగస్ట్ 2025

సర్టిఫికేట్ వెరిఫికేషన్ : ఆగస్ట్ 18 నుండి 21 వరకు

కోచింగ్ ప్రారంభం : 25 ఆగస్ట్ 2025

47
విద్యార్హతలు

తెలంగాణ బిసి స్టడీ సర్కిల్స్ లో ప్రభుత్వ, ఆర్ఆర్బి, ఎస్సెస్సి, బ్యాకింగ్ జాబ్స్ ఫ్రీ కోచింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం డిగ్రీ పూర్తిచేసి వుండాలి. డిగ్రీలో మంచి మార్కులు సాధించినవారికి ఈ ఫ్రీ కోచింగ్ కు ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 

57
ఇతర అర్హతలు

బిసి స్టడి సర్కిల్ లో ఫ్రీ కోచింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.1.50 లక్షలలోపు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలలోపు ఉండాలి.

బిసిలకు 75 శాతం, ఎస్సిలకు 15 శాతం, ఎస్టిలకు 5 శాతం, ఇతరులకు (ఈబిసి, అనాధలు) మరో 5 శాతం సీట్లు కేటాయిస్తారు. వీటిలో మహిళలు, దివ్యాంగులకు ప్రత్యేక కోటా ఉంటుంది.

గతంలో బిసి స్టడి సర్కిల్ లో కోచింగ్ తీసుకున్నవారికి మరోసారి అవకాశం ఉండదు. 

67
నెలనెలా స్టైఫండ్ ఎంత?

ఉచిత కోచింగ్ తో పాటు నెలానెలా ఖర్చులకు ప్రభుత్వమే స్టైఫండ్ రూపంలో డబ్బులు ఇస్తుంది. ఇలా ఐదు నెలల కోచింగ్ కాలంలో నెలకు రూ.1000 చొప్పున మొత్తం రూ.5000 అందిస్తుంది. అయితే ఇది ప్రతినెలా 75 శాతం అంటెడెన్స్ కలిగిన విద్యార్థులకు మాత్రమే అందిస్తారు… కోచింగ్ క్లాసులకు ఎక్కువగా డుమ్మాలుకొడితే ఈ స్టైఫండ్ మిస్ అవుతారు.

77
ఎంపిక విధానం

బిసి స్టడి సర్కిల్స్ లో ఫ్రీ కోచింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను మెరిట్ ప్రకారం ఎంపిక చేస్తారు. డిగ్రీలో అధిక పర్సంటేజ్ కలిగినవారికి అవకాశం ఇస్తారు.

ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్దమయ్యే అభ్యర్థులు ఈ బిసి స్టడీ సర్కిల్ ఫ్రీ కోచింగ్ గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే  http://tgbcstudycircle.cgg.gov.in వెబ్ సైట్ సందర్శించవచ్చు. లేదంటే TGBCESDTC, Hyderabad ఫోన్ నంబర్ 040-24071178 కు కాల్ చేయవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories