Published : Jul 26, 2025, 02:41 PM ISTUpdated : Jul 26, 2025, 03:38 PM IST
అదనపు ఆదాయాన్ని పొదుపు చేసి తెలివిగా పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు కూడా ధనవంతులు కావచ్చు. సరైన పెట్టుబడి ప్రణాళికలను ఎంచుకోవడం, సంపదను సృష్టించడం ఎలాగో ఇక్కడ తెలుసుకొండి.
చాలామంది తమ ఉద్యోగం కాకుండా అదనపు ఆదాయం కోసం ఏదో ఒక పని చేస్తుంటారు. ఆ డబ్బును పొదుపు చేసి పెట్టుబడి పెడితే సంవత్సరాంతానికి లక్షాధికారి, కొన్నేళ్లలో కోటీశ్వరుడు అవ్వొచ్చు. అదనంగా వచ్చే 500 రూపాయలు కూడా విలువైనవే.. వాటిని పొదుపు చేసి పెట్టుబడి పెడితే మంచి రాబడి వస్తుంది.
DID YOU KNOW ?
కోటీశ్వరులు పెరుగుతున్నారు
ఇండియా ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ధనవంతుల కేంద్రం. 2025కి భారత్‌లో US$10 మిలియన్ (సుమారు ₹83 కోట్ల రూపాయలు)కి పైగా నికర ఆస్తులు కలగిన వారు 85,698 మంది ఉన్నారు.
28
జాగ్రత్త పెట్టుబడి పెట్టండి..
కొంతమందికి అవగాహన లేకపోవడంతో ఖర్చులు పోగా మిగిలిన డబ్బును సరైన పద్దతిలో పెట్టుబడి పెట్టలేకపోతారు. కానీ కొంచెం జాగ్రత్తగా పెట్టుబడి పెడితే ఇవే మనల్ని ధనవంతుల్ని చేస్తాయి. ఎక్కడ, ఎప్పుడు పెట్టుబడి పెడతామనేది ముఖ్యం… సరైన ఇన్వెస్ట్మెంట్ మన ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది.
3.7%
ప్రపంచ మిలియనీర్లలో భారతీయుల వాటా
అమెరికా, చైనా, జపాన్ తర్వాత కోటీశ్వరులు అధికంగా ఉన్న దేశం భారత్.
38
సంపద సృష్టిలో ఇవే ముఖ్యం
సంపద సృష్టికి కొన్ని ప్రాథమిక నియమాలున్నాయి… అందులో ముఖ్యమైనవి సంపద సృష్టితో పాటు సంపద రక్షణ, సంపద వృద్ధి. అదనపు ఆదాయాన్ని ఇలా పెట్టుబడి పెట్టినవారే ప్రపంచ స్థాయిలో విజయం సాధించారు.
ఉద్యోగంలో వచ్చే జీతం ఖర్చులకే సరిపోతుంటే.. అదనపు ఆదాయాన్ని పొదుపు చేసి పెట్టుబడి పెడితే సంపద పెరుగుతుంది. మంచి లాభసాటి వ్యాపారాలతో పాటు షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్, మ్యూచువల్ ఫండ్స్ లాంటి వాటిని జాగ్రత్తగా ఎంచుకుని పెట్టుబడులు పెడితే మీ సంపద పెరుగుతుంది.
58
తెలివిగా ఈ ఖర్చులు తగ్గించుకొండి...
ప్రతి నెలా జీతం వచ్చినా, దాన్ని రక్షించుకోవడానికి భీమా చేయడం చాలా ముఖ్యం. వ్యక్తిగత, కుటుంబ, వాహన భీమాలు… లైఫ్ ఇన్సూరెన్స్ , ఆరోగ్య భీమా, గృహ భీమా మనల్ని ఆకస్మిక ఆర్థిక ఇబ్బందుల నుండి కాపాడతాయి.
68
ఇవి మన సంపదను పెంచుతాయి
కొన్ని పెట్టుబడులు మన ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తాయి. షేర్ మార్కెట్, బాండ్లు, రియల్ ఎస్టేట్, బంగారం, వెండి వంటివి కొనడం మన సంపదను పెంచుతుంది.
78
పెట్టుబడులు పెట్టండి
సంపదను పొదుపు చేయడానికి, పెంచుకోవడానికి 'ఆస్తి కేటాయింపు' చాలా ముఖ్యం అని నిపుణులు చెబుతున్నారు. మీ ఆదాయంలో 3 నుండి 6 నెలల ఖర్చులకు సరిపడా డబ్బును ప్రత్యేకంగా ఉంచుకుని, మిగిలిన డబ్బును పెట్టుబడి పెట్టడం మంచిది.
88
ఆర్థిక క్రమశిక్షణ అవసరం
సంపదను కాపాడుకోవడం అంత సులభం కాదు. సంపదను సృష్టించి, కాపాడుకుని, పెంచుకున్న తర్వాత, దాన్ని నిర్వహించడం కూడా నేర్చుకోవాలి. షేర్ ఖాతాలు, మ్యూచువల్ ఫండ్స్, ఆస్తి పన్ను, ఇంటి నిర్వహణ, డీమ్యాట్ ఖాతా వంటి వాటిని ప్రతి నెలా పరిశీలించాలి. సంపద అనేది ఒక రోజు ప్రయాణం కాదు, అది దీర్ఘకాలిక ప్రయాణం. ఆర్థికంగా బాగా ప్రణాళిక వేసుకుని ప్రయాణిస్తేనే ఆ ప్రయాణం ఫలిస్తుంది అని నిపుణులు అంటున్నారు.