రూ.40 వేల స్టైఫండ్‌తో ఇంటర్న్‌షిప్.. విద్యార్థులకు ఎన్‌హెచ్‌ఏఐ బంపర్ ఆఫర్

Published : Apr 08, 2026, 10:08 PM IST

NHAI Recruitment : నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సమ్మర్ ఇంటర్న్‌షిప్ 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ₹40,000 స్టైపెండ్‌తో ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ విద్యార్థులకు ఇది అద్భుతమైన అవకాశం. ఏప్రిల్ 15 లోపు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలు మీకోసం.

PREV
15
ఎన్‌హెచ్‌ఏఐ సమ్మర్ ఇంటర్న్‌షిప్ 2026 నోటిఫికేషన్ వచ్చేసింది

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. 2026 సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ కోసం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు మౌలిక సదుపాయాల అభివృద్ధి రంగంలో ప్రత్యక్ష అనుభవం పొందే అవకాశం కలుగుతుంది. కేవలం అనుభవమే కాకుండా, రూ. 40,000 స్టైపెండ్‌ను కూడా ఎన్‌హెచ్‌ఏఐ అందించనుంది.

25
ఎవరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు?

ఈ ఇంటర్న్‌షిప్ కార్యక్రమం కేవలం ఒక విభాగానికే పరిమితం కాలేదు. వివిధ రంగాల్లో చదువుతున్న అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్యంగా కింది విభాగాల విద్యార్థులకు ప్రాధాన్యం ఉంటుంది..

• ఇంజనీరింగ్: సివిల్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్.

• ఇతర రంగాలు: డేటా సైన్స్, ఫైనాన్స్, లా, మేనేజ్మెంట్, కామర్స్, మాస్ కమ్యూనికేషన్.

ఈ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు నేరుగా ఎన్‌హెచ్‌ఏఐ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయవచ్చు.

35
ఇంటర్న్‌షిప్ టైమ్, పని ప్రదేశం ఇదే

ఎన్‌హెచ్‌ఏఐ సమ్మర్ ఇంటర్న్‌షిప్ 2026 మొత్తం రెండు నెలల పాటు కొనసాగుతుంది. ఎంపికైన విద్యార్థులను వారి అర్హతలను బట్టి ఎన్‌హెచ్‌ఏఐ ప్రధాన కార్యాలయంలో లేదా దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ కార్యాలయాల్లో నియమిస్తారు. ఈ రెండు నెలల కాలంలో విద్యార్థులు ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులలో భాగస్వాములయ్యే అవకాశం ఉంటుంది. వాస్తవ పని వాతావరణంలో నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పాలి.

45
ఎన్‌హెచ్‌ఏఐ ఇంటర్న్‌షిప్ విధులు, బాధ్యతలు ఏమిటి?

విద్యార్థులు తమ సంబంధిత విద్యా నేపథ్యం ఆధారంగా వివిధ బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుంది.

• సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు: వీరు ప్రధానంగా రోడ్ల డిసైన్, నిర్మాణాల పర్యవేక్షణ విభాగాల్లో పని చేస్తారు.

• ఇతర విభాగాల విద్యార్థులు: డేటా అనాలిసిస్, ఐటీ వ్యవస్థల నిర్వహణ, టోల్ ప్లాజా కార్యకలాపాలు, లీగల్ పనుల్లో అధికారులకు సహాయం చేస్తారు.

ప్రభుత్వ రంగ సంస్థలు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడానికి ఇది ప్రాక్టికల్ గైడ్‌గా ఉపయోగపడుతుంది.

55
ఎన్‌హెచ్‌ఏఐ ఇంటర్న్‌షిప్ స్టైపెండ్, సర్టిఫికేట్ ప్రయోజనాలు

ఈ ఇంటర్న్‌షిప్ విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మొదటిది, నెలకు రూ. 20,000 చొప్పున రెండు నెలలకు 40 వేల స్టైపెండ్ అందుతుంది. రెండవది, ఇంటర్న్‌షిప్ పూర్తియిన తర్వాత ఎన్‌హెచ్‌ఏఐ నుండి అధికారిక సర్టిఫికేట్ అందుకుంటారు. ఈ సర్టిఫికేట్ భవిష్యత్తులో ఉద్యోగ వేటలో విద్యార్థులకు ఒక పెద్ద అడ్వాంటేజ్‌గా మారుతుంది. ఏటా సుమారు 500 మంది విద్యార్థులకు ఈ పథకం కింద అవకాశం కల్పించాలని ఎన్‌హెచ్‌ఏఐ లక్ష్యంగా పెట్టుకుంది.

అప్లైకి లాస్ట్ డేట్ ఎప్పుడు? 

ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆలస్యం చేయకుండా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

• అధికారిక వెబ్‌సైట్: internshipsatnhai.digitalindiacorporation.in

• చివరి తేదీ: ఏప్రిల్ 15, 2026.

చివరి నిమిషంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండటానికి విద్యార్థులు ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

Read more Photos on
click me!

Recommended Stories