10th Results : త్వరలోనే 10వ తరగతి రిజల్ట్స్.. ఎక్కడ చెక్ చేసుకోవాలో తెలుసా..?

Published : Apr 06, 2026, 05:32 PM IST

CBSE 10th Results :  త్వరలోనే పదో తరగతి పలితాలు విడుదలకానున్నాయి. సిబిఎస్ఈ ఇప్పటికే విద్యార్థుల పేపర్లను మూల్యాంకనం చేసింది… ఇప్పుడు ఈ పలితాలను విడుదల చేయనుంది.

PREV
15
త్వరలోనే సిబిఎస్సి పలితాలు..

CBSC Results 2026 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి 10వ తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. తాజా సమాచారం ప్రకారం ఏప్రిల్ 14 నాటికి పదవ తరగతి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈసారి సెకండ్ బోర్డ్ ఎగ్జామ్స్ (రెండవ విడత పరీక్షలు) మే నెలలో ఉండటంతో, ఫలితాలను గతంలో కంటే త్వరగా విడుదల చేయాలని బోర్డు భావిస్తోంది.

25
ముఖ్యమైన తేదీలివే..

పదవ తరగతి ఫలితాల తేదీ : ఏప్రిల్ మధ్యలో (ఏప్రిల్ 14 నాటికి వచ్చే అవకాశం ఉంది).

12వ తరగతి ఫలితాలు : ఏప్రిల్ 10న పరీక్షలు ముగిసిన తర్వాత కొద్ది రోజులకు విడుదలవుతాయి.

మొత్తం విద్యార్థులు : ఈ ఏడాది సుమారు 43 లక్షల మంది విద్యార్థులు (10వ తరగతిలో 25 లక్షలు, 12వ తరగతిలో 18.5 లక్షలు) పరీక్షలకు హాజరయ్యారు.

35
ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి?

విద్యార్థులు తమ మార్కులను క్రింది అధికారిక వెబ్‌సైట్ల ద్వారా చూసుకోవచ్చు:

results.cbse.nic.in

cbse.gov.in

results.nic.in

digilocker.gov.in

డిజీలాకర్ (DigiLocker), ఉమాంగ్ (UMANG) యాప్స్ ద్వారా కూడా స్మార్ట్‌ఫోన్‌లలో ఫలితాలను పొందవచ్చు.

45
ఈసారి కొత్తగా 'సెకండ్ ఎగ్జామ్' విధానం

CBSE గతేడాది ప్రవేశపెట్టిన రెండు పరీక్షల విధానం ప్రకారం.. ఒకవేళ విద్యార్థులు తమ మార్కులను మెరుగుపరుచుకోవాలనుకున్నా (గరిష్ఠంగా 3 సబ్జెక్టులలో), లేదా కంపార్ట్‌మెంట్ కేటగిరీలో ఉన్నా, వారు మే నెలలో నిర్వహించే రెండవ బోర్డు పరీక్షలకు హాజరు కావచ్చు. దీనివల్ల విద్యార్థులకు తమ స్కోర్‌ను పెంచుకునే మంచి అవకాశం లభిస్తుంది.

55
పాస్ మార్కులు, గ్రేస్ మార్కులు

ఉత్తీర్ణత శాతం : విద్యార్థులు పాస్ అవ్వాలంటే కనీసం 33 శాతం మార్కులు సాధించాలి.

గ్రేస్ మార్కులు : ఒకటి లేదా రెండు మార్కుల తేడాతో ఫెయిల్ అయ్యే విద్యార్థులకు బోర్డు గ్రేస్ మార్కులు కలిపే అవకాశం ఉంది.

స్పెల్లింగ్ తప్పులు : లాంగ్వేజ్ పేపర్లలో స్పెల్లింగ్ తప్పులు ఉంటే మార్కులు తగ్గుతాయి. కానీ వర్డ్ లిమిట్ (పదాల పరిమితి) దాటినందుకు మార్కులేమీ తగ్గించబడవు.

Read more Photos on
click me!

Recommended Stories