పది నిమిషాల్లో వస్తువులే కాదు భూమి కూడా కొనొచ్చు..

Published : Aug 19, 2025, 11:42 AM IST

క్విక్ కామర్స్ రాకతో కేవలం 10 నిమిషాల్లోనే వస్తువులు ఇంటికి వచ్చేస్తున్నాయి. అయితే అదే పది నిమిషాల్లో భూమి కొనుగోలు చేస్తే ఎలా ఉంటుంది. వినడానికి వింతగా ఉన్నా దీనిని జెప్టో నిజం చేసింది. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
రియల్ ఎస్టేట్ అంటేనే క్లిష్టమైన ప్రాసెస్

భారతదేశంలో రియల్ ఎస్టేట్ కొనుగోలు సాధారణంగా ఎక్కువ సమయం, కాగితాల పనులు, చట్టపరమైన క్లిష్టతలతో కూడి ఉంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితి మారబోతోంది. క్విక్-కామర్స్ ప్లాట్‌ఫామ్ జెప్టో (Zepto) వినియోగదారులకు కేవలం 10 నిమిషాల్లోనే స్థలం సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ వినూత్న ఆలోచన ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా (HoABL) అనే రియల్ ఎస్టేట్ సంస్థతో జెప్టో కలసి తీసుకొచ్చింది. జన్మాష్టమి 2025 సందర్భంగా విడుదల చేసిన యాడ్ ఫిల్మ్‌లో దీనిని అధికారికంగా ప్రకటించారు.

DID YOU KNOW ?
HoABLతో కలిసి
జెప్టో, HoABLతో కలిసి వినియోగదారులకు కేవలం 10 నిమిషాల్లో స్థలం కొనుగోలు చేసే సౌకర్యాన్ని అందిస్తోంది.
25
జెప్టో ల్యాండ్ ప్లాట్స్ అంటే ఏంటి?

జెప్టో, HoABLతో కలిసి వినియోగదారులకు కేవలం 10 నిమిషాల్లో స్థలం కొనుగోలు చేసే సౌకర్యాన్ని అందిస్తోంది. ఈ ప్రక్రియలో ఎక్కువ పేపర్ వర్క్, మధ్యవర్తుల అవసరం ఉండదు. ప్రస్తుతం ఈ క్యాంపెయిన్‌ను బృందావన్‌లోని ప్లాట్స్ కోసం ప్రారంభించారు. అంటే, జెప్టో యాప్ ద్వారా అక్కడి స్థలాలను నేరుగా బుక్ చేసుకోవచ్చు.

35
HoABL గురించి.?

ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా (HoABL) ఒక ఆధునిక రియల్ ఎస్టేట్ డెవలపర్. వీరి లక్ష్యం భూస్వామ్యాన్ని కొత్త తరం కోసం సులభం, పారదర్శకం, ఆధునికంగా మార్చడం. ముఖ్యంగా మిల్లెనియల్స్, NRIలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్థలాలు కొనుగోలు చేయగలిగేలా టెక్నాలజీ ఆధారిత ప్లాట్‌ఫామ్‌ను అందిస్తున్నారు.

HoABL ప్రాజెక్టులు

HoABL ఇప్పటికే అనేక ప్రీమియం డెస్టినేషన్ ప్రాజెక్టులు చేపట్టింది. వీటిలో ప్ర‌ధాన‌మైన‌వి..

* అలీబాగ్ – "The Sanctuary" పేరుతో ప్రీమియం ప్లాట్స్

* దపోలి, గోవా, అయోధ్య – లగ్జరీ స్థల ప్రాజెక్టులు

* అమృతసర్, వారణాసి, శిమ్లా, నాగ్‌పూర్, ఖపోలి (ముంబై సమీపంలో) – కొత్త తరహా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు.

45
HoABLలోని ప్రత్యేకత:

* ముందుగానే భూమి సేకరణ, చట్టపరమైన క్లారిటీతో టైటిల్స్ సెక్యూర్ చేస్తారు.

* నేరుగా కస్టమర్లకు విక్రయాలు చేస్తారు, మధ్యవర్తులు అవసరం ఉండదు.

* డిజిటల్ పేపర్‌వర్క్, ఈజీ పేమెంట్ ప్లాన్స్ ద్వారా సమయం ఆదా అవుతుంది.

* ఆధునిక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో ప్రాజెక్టులు ప్లాన్ చేస్తారు. ఇప్పుడు ఈ మొత్తం ప్రక్రియను జెప్టో ప్లాట్‌ఫామ్‌లో 10 నిమిషాల్లో పూర్తిచేసేలా రూపొందించారు.

55
ఈ క్యాంపెయిన్ ఎక్కడ వర్తిస్తుంది?

ప్రస్తుతం జెప్టో–HoABL క్యాంపెయిన్ వృందావన్లోని ప్లాట్స్‌కే పరిమితమైంది. అయితే HoABL స్వతంత్రంగా ఇతర నగరాల్లో కూడా స్థలాలను విక్రయిస్తోంది. అంటే, జెప్టో ద్వారా కేవలం వృందావన్ మాత్రమే, కానీ HoABL ప్లాట్‌ఫారమ్ ద్వారా దేశవ్యాప్తంగా అనేక ప్రదేశాల్లో స్థలం కొనుగోలు చేయవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories