Jio Recharge Plans: రిలయన్స్ జియో 4జీ నెట్ వర్క్ తో దేశంలో సంచలనం రేపింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద టెలికాం కంపెనీగా గుర్తింపును సాధించింది. అయితే, తాజాగా పలు బేసిక్ రీఛార్జ్ ప్లాన్‌లను నిలిపివేసి యూజర్లకు షాక్ ఇచ్చింది.
దేశంలోని అతిపెద్ద టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో తన వినియోగదారులకు పెద్ద షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు అందుబాటులో పలు బేసిక్ ప్లాన్‌లను రద్దు చేసింది. వాటి స్థానంలో కొత్త ప్లాన్లను తీసుకువచ్చింది.
రూ.209 (22 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 1GB డేటా), రూ.249 (28 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 1GB డేటా) ప్లాన్‌లను కంపెనీ నిలిపివేసింది. ఇకపై ఈ ప్లాన్‌లు జియో యూజర్లకు అందుబాటులో ఉండవు.
DID YOU KNOW ?
రిలయన్స్ జియో
రిలయన్స్ జియోను 2007లో స్థాపించారు. 2016 సెప్టెంబర్ 5న వాణిజ్యంగా 4జీ సేవలు ప్రారంభించి, తక్కువ కాలంలోనే ఇండియాలో అతిపెద్ద టెలికాం కంపెనీగా ఎదిగింది.
25
వినియోగదారులకు జియో కొత్త బేసిక్ ప్లాన్ ఆప్షన్
బేసిక్ ప్లాన్‌లు రద్దు కావడంతో జియో వినియోగదారులు తప్పనిసరిగా రూ.299 ప్లాన్ ఎంచుకోవాల్సి వస్తోంది. ఈ ప్లాన్‌లో 28 రోజుల గడువుతో రోజుకు 1.5GB డేటా లభిస్తుంది.
తక్కువ ఖర్చుతో మొబైల్ డేటా వాడకాన్ని ఇష్టపడే కస్టమర్లకు ఇది అదనపు భారమవుతుంది. పాత ప్లాన్లతో పోలిస్తే ఆదనంగా 50 రూపాయల వరకు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.
35
ఇతర టెలికాం కంపెనీల పరిస్థితి ఏమిటి?
జియో మాత్రమే కాకుండా, ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియా (Vi) వంటి ఇతర టెలికాం కంపెనీలు కూడా తమ బేసిక్ ప్లాన్‌లను సవరించాయి. ప్రస్తుతం ఈ కంపెనీల బేసిక్ రీచార్జ్ ధరలు రూ.299 వద్ద ప్రారంభమవుతున్నాయి. ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియా ప్లాన్‌లలో రోజుకు 1GB డేటా లభిస్తుంది.
ఈ మార్పు ముఖ్యంగా విద్యార్థులు, సాధారణ వాడకదారులు, గ్రామీణ ప్రాంతాల్లోని కస్టమర్లపై ప్రభావం చూపనుంది. తక్కువ ధరలో మొబైల్ డేటాను ఉపయోగించే అవకాశం తగ్గిపోవడంతో, వారు అధిక మొత్తంలో ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
కాగా, ఈ నెలలోనే జియో వార్షిక మీటింగ్ ఉంది కాబట్టి ఈ కంపెనీ అధినేత ముఖేష్ అంబానీ గుడ్ న్యూస్ చెబుతూ కొత్త రీఛార్జ్ ప్లాన్లను ఏమైనా ప్రకటిస్తారేమో చూడాలి.
55
పెరగనున్న టెలికాం రీఛార్జ్ ధరలు
టెలికాం నిపుణుల అంచనాల ప్రకారం, రాబోయే ఆరు నెలల్లో మొబైల్ రీఛార్జ్ ధరలు మరింత పెరగవచ్చని సూచిస్తున్నారు. స్పెక్ట్రమ్ ఖర్చులు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విస్తరణ, డేటా వినియోగం పెరుగుదల వంటి అంశాలు ఈ ధరల పెరుగుదలకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. దీని ఫలితంగా మొబైల్ వినియోగదారులపై భారం మరింత పెరిగే అవకాశం ఉంది.