మన దేశానికి సరిహద్దుగా ఉన్న దేశాల్లో ఒకటైన చైనా ఇప్పటి వరకు ఒక విషయంలో మాత్రం ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో ఉంది. ఇండియా ఆ స్థానాన్ని కైవసం చేసుకొని ప్రపంచంలోని ఇతర దేశాలను కూడా వెనక్కు నెట్టింది. ఏ విషయంలో ఇండియాలో టాప్ లో ఉందో ఇప్పుడు చూద్దాం.
ప్రపంచంలో అత్యంత ఎత్తయిన విగ్రహం ఉన్న దేశంగా భారత దేశం నిలిచింది. ఇప్పటి వరకు ఈ స్థానం చైనా ఖాతాలో ఉండేది. అయితే ఆ ప్లేస్ ను ఇండియా కైవసం చేసుకుంది. స్టాట్యూ ఆఫ్ యూనిటీ పేరుతో నిర్మించిన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహాల్లో నంబర్ వన్ స్థానంలో ఉంది. చైనాలో ఉన్న స్ప్రింగ్ టెంపుల్ బుద్ధ ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యంత ఎత్తయిన విగ్రహంగా ఉంది. సర్ధార్ విగ్రహం నిర్మాణంతో ఇండియా టాప్ ప్లేస్ లోకి వచ్చింది.
25
స్ట్యాచ్యూ ఆఫ్ యూనిటీ
స్ట్యాచ్యూ ఆఫ్ యూనిటీ (Statue of Unity) గుజరాత్ రాష్ట్రంలో ఉంది. నర్మదా జిల్లాలోని కెవాడియా వద్ద దీన్ని నిర్మించారు.
దీని ఎత్తు 182 మీటర్లు (597 అడుగులు). భారత దేశ తొలి హోంమంత్రి, "ఉక్కు మనిషి "గా ప్రసిద్ధి చెందిన సర్దార్ వల్లభభాయ్ పటేల్ విగ్రహం ఇది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ విగ్రహ నిర్మాణాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టారు.
భారత స్వాతంత్య్ర ఉద్యమం అనంతరం సంస్థానాలను భారత యూనియన్‌లో విలీనం చేయడంలో కీలక పాత్ర పోషించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గౌరవార్థం ఈ విగ్రహం నిర్మించారు. ఇది ఇప్పుడు ఒక ప్రధాన పర్యాటక కేంద్రంగా మారింది. భారతదేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుండి కూడా సందర్శకులు వస్తున్నారు.
35
రూ.3,000 కోట్లతో నిర్మాణం
సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహాన్ని సుమారు రూ.3,000 కోట్ల నిర్మాణ వ్యయంతో నిర్మించారు. అక్టోబర్ 31, 2018 ఈ విగ్రహాన్ని ప్రారంభించారు.
గుజరాత్‌లోని కెవాడియాలోని సాత్పురా, వింధ్యాచల్ కొండల నడుమ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా దీన్ని నిర్మించారు.
సందర్శకులు 153 మీటర్ల ఎత్తులో ఉన్న గ్యాలరీ వరకు వెళ్లి ఈ విగ్రహాన్ని చూడొచ్చు. ఇక్కడి నుంచి చుట్టుపక్కల ప్రాంతాల దృశ్యాలను చూడటం మరచిపోలేని అనుభూతిని అందిస్తుంది.
సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహం నిర్మాణం ముందు వరకు ప్రపంచంలో అతిపెద్ద విగ్రహంగా చైనాలోనిస్ప్రింగ్ టెంపుల్ బుద్ధ ఉండేది. దీని ఎత్తు 128 మీటర్లు. దాని పీఠంతో కలిపి 208 మీటర్లు. ఈ విగ్రహాన్ని చైనాలో 2008లో నిర్మించారు.
లైక్యూన్ సెక్కియ బుద్ధ(Laykyun Sekkya Buddha)
ప్రపంచంలో అత్యంత ఎత్తయిన విగ్రహాల్లో ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్నది లైక్యూన్ సెక్కియ బుద్ధ. ఇది 116 మీటర్లు ఎత్తు ఉంటుంది. పీఠంతో కలిపి 129 మీటర్లు ఉంటుంది. ఈ విగ్రహం మయన్మార్ దేశంలో ఉంది. దీన్ని కూడా 2008 లోనే నిర్మించారు.
55
జపాన్ లోనే నాలుగు ఎత్తయిన విగ్రహాలు
జపాన్‌లోని ఉషికు నగరంలో ఉన్న గౌతమ బుద్ధుని మరో భారీ విగ్రహం ప్రపంచంలో నాలుగో ఎత్తయిన విగ్రహం. దీన్ని 1993లో నిర్మించారు. ఉషికు దైబుట్సు అని పిలిచే ఈ విగ్రహం 120 మీటర్ల ఎత్తు ఉంటుంది.
తర్వాతి స్థానాల్లో జపాన్, థాయిలాండ్, రష్యా, చైనాలోని మరికొన్ని విగ్రహాలు ఉన్నాయి. ఇవన్నీ 100 మీటర్ల కంటే ఎత్తులోనే ఉండటం విశేషం. ఒక్క జపాన్ లోనే ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహాలు నాలుగు ఉన్నాయి.