BSNL Offers: బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్.. రూపాయికే 1 జీబీ డేటా..ఈ ఆఫర్ ఎలా పొందాలో తెలుసా?

Published : Jun 30, 2025, 04:20 PM IST

BSNL Offers: బీఎస్ఎన్‌ఎల్ ఫ్లాష్ సేల్ ఆఫర్‌లో భాగంగా రూ.400కి 400GB డేటా అందిస్తోంది. అంటే రూపాయికే 1 జీబీ డేటా మీరు పొందొచ్చు. అయితే ఈ ఆఫర్ పరిమిత కాలానికే అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. 

PREV
15

భారత ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్‌ఎల్ (BSNL) మరోసారి వినియోగదారులకు ఆకర్షణీయమైన ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఫ్లాష్ సేల్ ఆఫర్ రూపంలో కంపెనీ రూ.400 ధరకు 400GB డేటా అందిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇది తక్కువ ధరలో పెద్ద మొత్తంలో డేటా అవసరమయ్యే వినియోగదారుల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఆఫర్.

25

ఈ ఫ్లాష్ సేల్ ఆఫర్ పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. బీఎస్ఎన్‌ఎల్ అధికారిక వెబ్‌సైట్, ‘మైబీఎస్ఎన్‌ఎల్’ యాప్‌ ద్వారా ఈ ఆఫర్‌ను రీఛార్జ్ చేసుకోవచ్చు. అయితే ఇది ప్రీపెయిడ్ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ ప్లాన్ అన్నీ సర్కిళ్లలో అందుబాటులో ఉంటుందని బీఎస్ఎన్‌ఎల్ తెలిపింది.

35

బీఎస్ఎన్‌ఎల్ ఇప్పటికే తన సేవలను 4జీ నెట్‌వర్క్‌కు వేగంగా విస్తరిస్తోంది. అందువల్ల ఈ డేటా ఆఫర్ వినియోగదారులకు మరింత ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ ఆఫర్ ముఖ్యంగా ఎక్కువ డేటా అవసరమయ్యే విద్యార్థులు, ఆన్‌లైన్ వర్కర్లు, రూరల్ యూజర్లకు అనుకూలంగా ఉంటుంది.

45

అద్భుతమైన ఈ ఆఫర్ ప్రకటనతో పోటీ కంపెనీలైన జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్-ఐడియా కంపెనీల్లో ఆందోళన మొదలైంది. ముఖ్యంగా జియో, ఎయిర్ టెల్ కి వినియోగదారులు ఎక్కువగా ఉన్నప్పటికీ బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న మంచి ఆఫర్లతో కస్టమర్లు ఈ నెట్వర్క్ కి మారిపోతున్నారు. దీంతో వినియోగదారులు తగ్గిపోతారని ఆయా కంపెనీల్లో ఆందోళన మొదలైంది. 

55

బీఎస్ఎన్ఎల్ ఇప్పటి వరకు దేశంలో 90,000 4G టవర్లను ఏర్పాటు చేసింది. అందుకే ఈ ఆఫర్ క్రేజీగా మారింది. సిగ్నల్ ప్రాబ్లమ్ తీరడమే కాకుండా, మెరుగైన 4జీ నెట్వర్క్ ద్వారా వేగంగా ఇంటర్నెట్ కూడా లభించనుంది. ఈ ప్లాన్‌ రీఛార్జ్ చేసుకోవడానికి BSNL వెబ్‌సైట్, సెల్ఫ్ కేర్ యాప్ ఉపయోగించవచ్చు. 

ఈ ఫ్లాష్ సేల్ జూన్ 28 నుండి జూలై 1, 2025 వరకు మాత్రమే ఉంటుందని సమాచారం. ఈ ఆఫర్‌లో రూ.400కే 400GB డేటా లభిస్తుంది. డేటా వోచర్లతో రీఛార్జ్ చేసుకునే వారికి ఇది వర్తిస్తుంది. ఈ ప్లాన్‌లో రూ.1కి 1GB డేటా లభిస్తుంది. ఇది హై స్పీడ్ 4G డేటా. డేటా 40 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories