Published : Aug 02, 2025, 02:54 PM ISTUpdated : Aug 02, 2025, 04:23 PM IST
Top 5 best-selling cars in India: ఇండియలో ఆటోమొబైల్ మార్కెట్ అనూహ్య వేగంతో అభివృద్ధి చెందింది. పలు బ్రాండ్లు ఎప్పటికప్పుడు నయా మోడళ్లు, న్యూ ఫీచర్లు అందిస్తూ కస్టమర్స్ ను ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో 2025లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 కార్లు ఇవే.
Best Selling Cars: ఇండియలో ఆటోమొబైల్ మార్కెట్ అనూహ్య వేగంతో అభివృద్ధి చెందింది. కేవలం మైలేజ్ కోసం మాత్రమే కాకుండా, డిజైన్, సేఫ్టీ, టెక్నాలజీ, బెస్ట్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ వంటి అంశాలపై వినియోగదారులు ప్రాముఖ్యత ఇస్తున్నారు. పలు బ్రాండ్లు ఎప్పటికప్పుడు నయా మోడళ్లు, న్యూ ఫీచర్లు అందిస్తూ కస్టమర్స్ ను ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో 2025లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 కార్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం!
26
హ్యుందాయ్ క్రెటా.. SUV లకు రారాజు !
న్యూ హ్యుందాయ్ క్రెటా ( Hyundai Creta) 2025లోనూ SUV విభాగంలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. SUVల ప్రపంచంలో రారాజుగా కొనసాగుతుందని చెప్పాలి. రూ. ₹11 లక్షల ప్రారంభ ధరతో లభించే ఈ కార్ పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. 2025లోనూ హ్యుందాయ్ క్రెటా కు విపరీతమైన డిమాండ్ పెరిగింది.
లెటెస్ట్ డిజైన్, న్యూ డే టైమ్ రన్నింగ్ లైట్స్ (DRLs), బిగ్ 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్, 360° కెమెరా, అడ్వాన్స్డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS)వంటి టాప్-క్లాస్ ఫీచర్లతో ఇది టెక్నాలజీ లవర్స్ బెస్ట్ ఛాయిస్ గా నిలిచింది.
కేవలం లుక్‌కే కాదు, భద్రత, పనితీరు, బెస్ట్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ వంటి ఫీచర్లలో బెస్ట్ కారు ఇదే అని చెప్పాలి. ఇలా ఎన్నో లెటెస్ట్ ఫీచర్స్ తో కస్టమర్స్ ను ఆకట్టుకుంటూ క్రెటా ఇప్పటికీ SUV మార్కెట్‌లో అగ్రస్థానంలో నిలిచింది.
36
మారుతి సుజుకి స్విఫ్ట్ – ఎప్పటికీ యూత్ ఫేవరెట్!
2025లో విడుదలైన నయా మారుతి సుజుకి స్విఫ్ట్ ( Maruti Suzuki Swift) ధర రూ. 6 లక్షల నుండి అందుబాటులోకి వచ్చింది. ఈ కారు మరింత స్టైలిష్‌గా, టెక్నాలజీ ఆధారితంగా రీడిజైన్ అయింది. ఫ్యూయల్ ఎఫిషియంట్ ఇంజిన్, లైట్‌వెయిట్ బాడీ, అట్రాక్టివ్ ఇంటీరియర్, అలాగే కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ వంటి ఆధునిక ఫీచర్లతో ఇది యువతను ఎంతగానో ఆకర్షిస్తోంది. బెస్ట్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కోరుకునే వారికి బడ్జెట్-ఫ్రెండ్లీ బెస్ట్ ఆప్షన్ మారుతి సుజుకి స్విఫ్ట్.
రూ.11 లక్షల ప్రారంభ ధరతో లభించే టాటా పంచ్ EV (Tata Punch EV)2025లో ఇండియన్ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో అత్యధిక ప్రజాదరణ పొందిన మోడల్‌గా నిలిచింది. 300+ కిలోమీటర్ల బ్యాటరీ రేంజ్, టాటా కంపెనీ Ziptron టెక్నాలజీతో మార్కెట్ లోకి వచ్చింది.
మునుపెన్నడూ లేని విధంగా స్టైల్, భద్రత విషయంలో రాజీ పడకుండా డిజైన్ చేశారు. అలాగే.. 5-Star NCAP భద్రతా రేటింగ్ పొందిన బెస్ట్ సేప్టీ కారు ఇదే. పెట్రోల్ ధరలు క్రమంగా పెరుగుతున్న వేళ పర్యావరణహితంగా ఉండాలనుకునే వారికి టాటా పంచ్ EV ఒక బెస్ట్ ఆప్షన్.
56
మహీంద్రా XUV 3XO.. నయా ఫీచర్లతో నిండిన న్యూ అవతార్!
రూ. 7.5 లక్షల ప్రారంభ ధరతో మార్కెట్లోకి వచ్చిన మహీంద్రా XUV 3XO (Mahindra XUV 3XO)మునుపటి XUV300కు సరికొత్త రూపం ఇచ్చింది. ఈ మోడల్ కేవలం స్టైలిష్ లుక్‌కే పరిమితం కాకుండా టెక్నాలజీ, సేప్టీ పరంగా కూడా గణనీయమైన మార్పులతో మార్కెట్ లోకి వచ్చింది.
ప్రత్యేకతలు.. ప్యానోరామిక్ సన్‌రూఫ్, 6 ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) వంటి అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లతో పాటు, 10.25 అంగుళాల డిజిటల్ స్క్రీన్‌తో కూడిన కాక్‌పిట్ ఈ కారును క్లాస్ లీడింగ్ SUVగా నిలబెడుతుంది.
బోల్డ్ డిజైన్, ప్రీమియం లుక్ తో XUV 3XO మిడ్-రేంజ్ SUV కొనుగోలుదారులకు బెస్ట్ ఆప్షన్ గా మారింది. స్టైల్, టెక్నాలజీ , సేఫ్టీ ఈ మూడింటికీ బ్యాలెన్స్ చేస్తూ.. రూపుదిద్దుకున్న ఈ కొత్త అవతార్‌కి మార్కెట్లో భారీ డిమాండ్ నెలకొంది.
66
కియా సోనెట్ .. క్యూట్‌గా, కంప్లీట్‌గా!
రూ. 8 లక్షల ప్రారంభ ధరతో మార్కెట్లోకి అడుగుపెట్టిన కియా సోనెట్ 2025 ఫేస్‌లిఫ్ట్ (Kia Sonet 2025 facelift) కొత్త ఆకృతిలో మరింత ఆకర్షణీయంగా మారింది. చిన్న SUV విభాగంలో ఈ వెహికల్ ప్రీమియం ఫీచర్లు, స్పోర్టీ డిజైన్, బడ్జెట్ ఫ్రైజ్ వంటివి కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ADAS (Advanced Driver Assistance Systems), 6 ఎయిర్‌బ్యాగ్స్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే/ఆండ్రాయిడ్ ఆటో, పెట్రోల్, డీజిల్ ఇంజిన్ వేరియంట్లు లాంటి సెగ్మెంట్-లీడింగ్ ఫీచర్లతో కియా సోనెట్ మరింత అట్రాక్టివ్ గా మారింది. దీని మాస్ + క్లాస్ అట్రాక్షన్, ఇంటీరియర్ డిజైన్ అన్ని కలిపి సోనెట్‌ను బెస్ట్ SUVగా నిలబెట్టాయి.