BSNL Freedom Offer : భారత ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆకర్షణీయమైన ఆఫర్‌ను తీసుకొచ్చింది. 'ఫ్రీడమ్ ఆఫర్' కింద 'ఆజాది కా ప్లాన్' పేరుతో లాంచ్ చేసింది. కేవలం రూ. 1 కే అదిరిపోయే ఆఫర్.
భారత ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL)కొత్త కస్టమర్లను ఆకర్షించే పనిలో పడింది. అదిరిపోయే బంపర్ ఆఫర్లతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. జియో, ఎయిర్‌టెల్, వీఐ వంటి భారీ కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రణాళికలు వేస్తోంది. మరోసారి తన వినియోగదారులను మళ్లించుకునే ప్రయత్నం చేస్తోంది. అందుకు తగ్గట్లే ఆఫర్లు కూడా ప్రకటిస్తుంది. ఈ క్రమంలో జియో, ఎయిర్‌టెల్ వంటి ప్రైవేట్ కంపెనీలకు బిగ్ షాకిస్తూ కేవలం 1 రూపాయికే 'ఆజాదీ కా ప్లాన్' అందుబాటులోకి తెచ్చింది.
25
ఆజాది కా ప్లాన్
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL)ఆకర్షణీయమైన ఆఫర్‌ను తీసుకొచ్చింది. 'ఫ్రీడమ్ ఆఫర్' కింద 'ఆజాది కా ప్లాన్' పేరుతో లాంచ్ చేసింది. ఈ ప్లాన్ ప్రత్యేకత ఏమిటంటే.. డేటా, కాలింగ్, ఎస్ఎంఎస్ వంటి అన్ని ఫీచర్స్ అందిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్ ఆఫర్‌తో కూడిన ఈ ప్లాన్ జియో, ఎయిర్‌టెల్ లకు గట్టిపోటీ ఇవ్వబోతుందా? అనే వివరాలు మీ కోసం.
35
BSNL రూ. 1 ప్లాన్ వివరాలు
BSNL ఫ్రీడమ్ డే ఆఫర్ క్రింద ‘ఆజాది కా ప్లాన్’ పేరిట వినూత్న ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. కేవలం రూ. 1 కే లభించే ఈ ప్లాన్‌లో డైలీ 2GB హైస్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు లాంటి అద్భుత ప్రయోజనాలు అందిస్తోంది. ఇది 30 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది.
ఈ ఆఫర్ ఆగస్టు 1 నుండి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆగస్టు 31లోపు ప్లాన్‌ను యాక్టివేట్ చేయలేకపోతే, ఈ అదిరిపోయే అవకాశాన్ని మీరు కోల్పోతారు. ఈ ఆఫర్‌ను పొందడానికి వినియోగదారులు తమకు సమీపంలోని BSNL కస్టమర్ సర్వీస్ సెంటర్ లేదా రిటైలర్ షాపుని సందర్శించి ఈ ప్లాన్‌ను తీసుకోవచ్చు.
55
ఈ వ్యూహం ఫలించేనా?
ఇటీవలి TRAI (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) విడుదల చేసిన నివేదిక ప్రకారం 2025 జూన్ 30,2025 నాటికి BSNL 3 లక్షలకు పై సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయింది. దీన్ని మొత్తం యూజర్ బేస్ 90,464,244కి చేరుకుంది. ఇందులో 29,822,407 రూరల్ కస్టమర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో, BSNL“ఫ్రీడమ్ ఆఫర్” వినియోగదారులను మళ్లీ ఆకర్షించేందుకు తీసుకున్న ప్రత్యేక వ్యూహంగా పరిగణించవచ్చు. ఈ ఆఫర్‌తో పాటు, ఇతర అనుబంధ ప్రీపెయిడ్ ప్యాన్స్ ను కూడా BSNL తీసుకరానుంది.