Fuel Saving Tips: పెట్రోల్, డిజిల్ ధరలు మీ బడ్జెట్‌పై తీవ్ర ప్రభావితం చూపుతున్నాయా? అయితే, పెట్రోల్ ధరలను తగ్గించడం అసాధ్యమే. కానీ కొన్ని సాధారణ అలవాట్లను మార్చుకోవడం ద్వారా, మీరు పెట్రోల్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు.
Fuel Saving Tips: రోజురోజుకు పెరిగిపోతున్న పెట్రోల్ ధరలు సామాన్యుడి బడ్జెట్‌కు గండి కొడుతున్నాయి. ఒక మధ్యతరగతి కుటుంబం నెలవారీ ఆదాయంలో పెద్ద భాగాన్ని పెట్రోల్‌కి కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇది ఆర్థికంగా ఒత్తిడికి దారి తీస్తోంది. అయితే, పెట్రోల్ ధరలను తగ్గించడం అసాధ్యమే. కానీ, కొన్ని చిన్న మార్పులతో పెట్రోల్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించడం సాధ్యమే.
28
అలా చేస్తే పొదుపుతో పాటు ఆరోగ్యం కూడా
రోజూ చిన్న పనుల కోసం కూడా బైక్ లేదా కారు ఉపయోగిస్తున్నారా? మీ ఇంటికి దగ్గర్లో ఉన్న దుకాణం, పాఠశాల, బస్ స్టాప్ వంటి ప్రదేశాలకు నడిచి వెళ్ళే అలవాటు చేసుకోండి. ఇలా చేస్తే.. వారానికి కనీసం 1 లీటర్ పెట్రోల్ ను ఆదా చేయవచ్చు. అంటే నెలకు సుమారు ₹400–₹500 పొదుపు చేసినట్లే. అలాగే పరోక్షంగా వ్యాయామం చేసినట్టు అవుతుంది.
38
పనులన్నీ ఒకేరోజు.. పెట్రోల్, సమయం ఆదా
మీ వెహికల్ తీసుకొని ఒకసారి బిల్లు కోసం, మరొకసారి కూరగాయల కోసం, ఇంకోసారి బ్యాంకు లేదా స్కూల్, ఇలా పనులు విడివిడిగా చేస్తే ఆధికంగా పెట్రోల్ ఖర్చు అవుతుంది. అలా కాకుండా మీ పనులన్నింటీని ఒకే రోజులో పూర్తి చేయడానికి ప్రయత్నిచండి. మీ అవసరాలన్నింటినీ ఒకే రోజు ప్లాన్ చేసుకుని పూర్తి చేసుకుంటే, పెట్రోల్ ఖర్చు తగ్గుతుంది. ఇలా చేయడం వల్ల ఒక వైపు పెట్రోల్, మరొ వైపు సమయం ఆదా అవుతుంది.
ప్రతి చిన్న పని కోసం బైక్ పై వెళ్లడం అవసరం లేదు. మందులు, కిరాణా సామాగ్రి, ఫుడ్ వంటి అవసరాల కోసం ప్రతి సారి బయటకు వెళ్లడం వల్ల పెట్రోల్ ఖర్చు అవడమే కాకుండా సమయం కూడా వృథా అవుతుంది. దీన్ని నివారించేందుకు మీరు డెలివరీ యాప్‌లను ఉపయోగించవచ్చు. ఇవి తక్కువ డెలివరీ ఛార్జీలతో అన్ని అవసరమైన వస్తువులను మీ ఇంటి వద్దకే చక్కగా డెలివరీ అవుతాయి. ఇలా చేయడం వల్ల నెలకు సుమారుగా రూ.500 వరకు పెట్రోల్ ఖర్చును ఆదా చేయవచ్చు. అంతేకాదు, ట్రాఫిక్, పార్కింగ్, ఎండ వంటి సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.
58
ఆ ప్రణాళికే సేవింగ్స్ కీ!
కుటుంబ సభ్యులంతా వేర్వేరు వాహనాల్లో బయటకు వెళ్లకుండా కలిసి వెళ్తే పెట్రోల్ ఖర్చును ఆదా చేసినట్లే. అంటే.. ఒకరు ఆఫీస్, ఇంకొకరు మార్కెట్, ఇంకొకరు స్కూల్ డ్రాపింగ్ అంటూ ఒక్కొకరు ఒక్కో వాహనం తీసుకెళ్లడం వల్ల ఎక్కువ ఫ్యూయల్ ఖర్చవుతుంది. కానీ, మీరు ఒకే మార్గంలో ఉండే పనులకు ఒకే వాహనంలో కలిసి వెళ్లేందుకు ట్రై చేయండి. ఇలా చేస్తే.. రోజుకు కనీసం ₹30 నుండి ₹50 వరకు పొదుపు చేయవచ్చు. దీని వల్ల పరస్పర సహకారం పెరగడమే కాకుండా ఫ్యూయల్ సేవింగ్ కూడా చేయవచ్చు.
68
ఫుల్ ట్యాంక్ – ఫుల్ ఎఫిషియెన్సీ!
కొంతమంది తక్కువ మొత్తంలో పెట్రోల్ కొట్టించుకునే అలవాటు ఉంటుంది. ఇలా తరచుగా ఇంధనం నింపే అలవాటు కొన్నిసార్లు మీ వాహన పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఇంజిన్ పై ఒత్తిడి, మైలేజ్ తగ్గుతుంది, అలాగే ప్యూయల్ పంప్ త్వరగా పాడయ్యే అవకాశం ఉంది. అందువల్ల, చిన్నచిన్న మొత్తాల్లో పెట్రోల్ నింపడం కంటే, అవసరమైనంత మొత్తాన్ని ఒకేసారి పూర్తిగా నింపడం ఉత్తమం. మీ ప్రయాణం సజావుగా సాగడమే కాకుండా పొదుపు కూడా.
78
చిన్న ప్రశ్న.. ఆర్థిక భారంలో తేడా..
మీరు మీ వెహికల్ ను బయటకు తీసే ముందు ప్రతిసారీ, మిమ్మల్ని మీరు ఒక ప్రశ్నించుకోండి. ఈ ప్రయాణం అవసరమా? ఏదైనా పనిని వాయిదా వేసుకోవచ్చా? లేదా ప్రత్యామ్నాయ మార్గాలు (పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, షేరింగ్, నడక) ఉన్నాయా? అని ఒక్క నిమిషం ఆలోచించండి. ఇలా చేయడం వల్ల మీ వార్షిక ఖర్చులలో తేడాను గమనించవచ్చు.
88
ఆ అలవాట్లను మార్చుకుంటే..
పెట్రోల్ ధరలు మన నియంత్రణలో ఉండకపోయినా, వాటిపై మన ప్రభావం మాత్రం తప్పకుండా ఉండొచ్చు. మన డ్రైవింగ్ అలవాట్ల ద్వారా, వాహనం వినియోగాన్ని ఆచితూచి ప్లాన్ చేసుకుని అనవసర ప్రయాణాలను తగ్గిస్తే ఆదా చేసినట్లే. ఈ మార్పు ఒక్కసారిగా కనిపించకపోవచ్చు. ఈరోజు మీరు అలవాట్లను మార్చుకుంటే, రేపటి వ్యయం తగ్గుతుంది.