New Labour Codes : కొత్త లేబర్ కోడ్స్ తో మీ జీతం తగ్గుతుందా? కేంద్రం చెప్పిందేంటో తెలుసా!

Published : Dec 11, 2025, 11:56 PM IST

New Labour Codes : ఇటీవలే కొత్త లేబర్ కోడ్‌లు అమల్లోకి వచ్చాయి. అయితే, వీటి కారణంగా టేక్ హోమ్ జీతం తగ్గదని కేంద్రం స్పష్టం చేసింది. . రూ.15000 పీఎఫ్ సీలింగ్ యథాతథంగా కొనసాగుతుందని కార్మిక శాఖ తెలిపింది.

PREV
14
టేక్ హోమ్ సాలరీపై పై కొత్త లేబర్ కోడ్స్‌ ప్రభావం

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త లేబర్ కోడ్స్ దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశాయి. ముఖ్యంగా ప్రైవేట్ ఉద్యోగుల్లో ఒక ముఖ్యమైన సందేహం నెలకొంది. అదే“కొత్త లేబర్ కోడ్స్ అమల్లోకి వస్తే టేక్ హోమ్ సాలరీ తగ్గుతుందా?” అనే ప్రశ్న. సోషల్ మీడియాలోనూ, ఉద్యోగ వర్గాల్లోనూ ఈ అంశంపై గందరగోళం పెరుగుతూనే వచ్చింది.

ఈ నేపథ్యంలో కేంద్ర కార్మిక శాఖ అధికారికంగా స్పందిస్తూ.. ఉద్యోగుల చేతికందే వేతనంలో ఎలాంటి తగ్గుదల ఉండదని స్పష్టంగా తెలిపింది. ఈపీఎఫ్ లెక్కలు ఇప్పటివరకు అమల్లో ఉన్న రూ.15,000 చట్టబద్ధ వేతన పరిమితి ఆధారంగానే కొనసాగుతాయని కూడా ధృవీకరించింది.

24
పీఎఫ్ పరిమితి ఎందుకు ముఖ్యం? వేతన లెక్కల్లో అది ఎలా పనిచేస్తుంది?

ప్రస్తుతం ఈపీఎఫ్ లెక్కల కోసం రూ.15,000 వేతన పరిమితి అమల్లో ఉంది.

దీని ప్రకారం:

• యజమాని పీఎఫ్ వాటా = 12% = ₹1,800

• ఉద్యోగి పీఎఫ్ వాటా = ₹1,800

మొత్తం పీఎఫ్ = ₹3,600 మాత్రమే.

ఈ పరిమితి ఎప్పటిలాగే కొనసాగుతుండటంతో, కొత్త లేబర్ కోడ్స్ వచ్చినా కూడా ఉద్యోగి నెల జీతంలో మార్పు ఉండదు. రూ.15,000కు పైగా పీఎఫ్ చెల్లించడం పూర్తిగా ఉద్యోగి స్వచ్ఛంద నిర్ణయం మాత్రమే. ఇది ఎప్పుడూ తప్పనిసరి కాదు.

34
వేతన నిర్మాణంలో మార్పులున్నా జీతం ఎందుకు తగ్గదు?

కొత్త లేబర్ కోడ్స్‌లో ప్రధాన మార్పు ఏమంటే బేసిక్ వేతనం + డీఏ = మొత్తం జీతంలో కనీసం 50% ఉండాలి. ఇది కంపెనీలు ఎక్కువ అలవెన్సులు చూపించి పీఎఫ్ లెక్కలు తగ్గించడం నివారించడానికే. అయితే ఇక్కడ ఉద్యోగులకు వచ్చిన పెద్ద సందేహం.. బేసిక్ పెరిగితే పీఎఫ్ పెరిగి, చేతికందే జీతం తగ్గిపోతుందా?

కేంద్రం సమాధానం స్పష్టం చెబుతూ.. బేసిక్ పెరగొచ్చు, అలవెన్సులు తగ్గొచ్చు కానీ పీఎఫ్ మాత్రం రూ.15,000 పరిమితి ఆధారంగానే లెక్కిస్తారు. అందువల్ల చేతికందే జీతం యథాతథంగానే ఉంటుంది. ఎలాంటి తగ్గుదల ఉండదని పేర్కొంది.

44
ఉద్యోగులకు కేంద్రం ఇచ్చిన హామీ

కేంద్ర కార్మిక శాఖ చెప్పింది ఒక్కటే ఉద్యోగి స్వచ్ఛందంగా అధిక పీఎఫ్ ఎంచుకోనంత వరకు టేక్ హోమ్ జీతం తగ్గదు. అంటే కొత్త లేబర్ కోడ్స్ వేతన నిర్మాణాన్ని పారదర్శకంగా చేయడానికే, ఉద్యోగిపై అదనపు భారాన్ని పెట్టడానికి కాదు. పీఎఫ్ సీలింగ్ మారనందున చేతికందే జీతం కూడా మారదు. 

అయితే, కొన్ని అంశాలు అంటే గ్రాట్యుటీ, లివ్ ఎన్‌క్యాష్‌మెంట్ వంటివి ప్రభావం చూపే అవకాశం ఉన్నప్పటికీ, నెలవారీ జీతంలో తగ్గుదల ఉండదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది.

Read more Photos on
click me!

Recommended Stories