Post office: నెల‌కు రూ. 5 వేలు ప‌క్క‌న పెడితే.. రూ. 8.5 ల‌క్ష‌లు సొంతం చేసుకోవ‌చ్చు

Published : Dec 11, 2025, 02:58 PM IST

Post office: సంపాదించిన డ‌బ్బును స‌రైన విధానంలో ఇన్వెస్ట్ చేయాల‌ని నిపుణులు సూచిస్తుంటారు. ఇందుకోసం ఎన్నో ర‌కాల ప‌థ‌కాలు అందుబాటులో ఉన్నాయి. పోస్టాఫీస్ అందిస్తున్న ప‌థ‌కాల‌కు జ‌నాలు ఎక్కువ‌గా అట్రాక్ట్ అవుతున్నారు.  

PREV
15
పోస్ట్‌ ఆఫీస్ RD స్కీమ్

సురక్షిత పెట్టుబడులతో మంచి రాబడి కావాలనుకుంటున్నవారికి పోస్ట్‌ ఆఫీస్ అందించే రికరింగ్ డిపాజిట్ (RD) స్కీమ్ అద్భుతమైన ఎంపికగా చెప్పొచ్చు. ఇందులో నెల నెలా చిన్న మొత్తం పెట్టి, సంవత్సరాల తర్వాత పెద్ద మొత్తం సంపాదించవచ్చు. ఇది ప్రభుత్వ భరోసా ఉండే స్కీమ్‌ కావడంతో రిస్క్‌ అసలు ఉండదు.

25
6.7% ఆకర్షణీయ వడ్డీ, ప్రభుత్వ హామీ

ప్రస్తుతం ప్రభుత్వం పోస్ట్‌ ఆఫీస్ RDపై సంవత్సరానికి 6.7% వడ్డీ ఇస్తోంది. ఈ స్కీమ్‌ ప్రధానంగా స్థిరమైన, భద్రత ఉన్న రాబడులు కోరుకునే వారికి సరైన ఎంపిక. ఈ ప‌థ‌కంలో మార్కెట్‌ మార్పులు ప్రభావం చూపవు. వడ్డీ రేటు స్థిరంగా ఉంటుంది. ప్రభుత్వ గ్యారంటీ ఉంటుంది. అందుకే చాలామంది ఈ స్కీమ్‌ని లాంగ్‌టెర్మ్ సేవింగ్స్‌గా ఎంచుకుంటున్నారు..

35
నెల‌కు రూ. 5 వేలు ప‌క్క‌న పెడితే..

పోస్ట్‌ ఆఫీస్ RDలో రూ. 5,000 ప్రతినెల జమ చేస్తే మొదటి 5 సంవత్సరాల్లో..

మొత్తం పెట్టుబడి: రూ. 3,00,000

6.7% వడ్డీతో లాభం: సుమారు రూ. 56,830 అవుతుంది.

మెచ్యూరిటీ మొత్తం: రూ. 3,56,830 పొందుతారు.

ఒక‌వేళ ప‌థ‌కాన్ని మరో 5 సంవత్సరాలు పొడిగిస్తే..

మొత్తం పెట్టుబడి: రూ. 6,00,000

10 సంవత్సరాల వడ్డీ: సుమారు రూ. 2,54,272

మొత్తం ఫండ్: రూ. 8,54,272

అంటే, కేవలం వడ్డీ ద్వారానే రూ. 2.54 లక్షలు సంపాదించవచ్చు.

45
రూ. 100తో ప్రారంభం

ఆర్డీ స్కీమ్‌ను కేవలం రూ. 100తోనే ఖాతా ప్రారంభించ‌వ‌చ్చు. ఈ స్కీమ్‌ అందరికి అందుబాటులో ఉండేలా రూపొందించారు. దగ్గరలోని ఏ పోస్టాఫీస్‌లోనైనా సులభంగా ప్రారంభించవచ్చు. కావాలంటే మెచ్యూరిటీకి ముందు ఖాతాను క్లోజ్ చేసే సౌకర్యం కూడా ఉంది. చిన్న మొత్తంతో మొదలుపెట్టి, పెద్ద మొత్తంగా సేవింగ్స్‌ను పెంచుకోవచ్చు.

55
లోన్ సౌకర్యం కూడా

పోస్ట్‌ ఆఫీస్ RDలో మరో ప్రత్యేకమైన ప్రయోజనం లోన్‌ సదుపాయం. RD ఖాతా 1 సంవత్సరం పూర్తైతే, జమ చేసిన మొత్తంలో 50% వరకు లోన్ తీసుకోవచ్చు. ఈ లోన్‌పై అదనంగా త‌క్కువ మొత్తంలో వ‌డ్డీ వ‌సూలు చేస్తారు. ఇత‌ర బ్యాంకుల‌తో పోల్చితే ఇది చాలా త‌క్కువ అని చెప్పాలి. నెలవారీ ఆదాయం ఉండి, లాంగ్‌ట‌ర్మ్‌లో డ‌బ్బులు పొదుపు చేయాల‌నుకునే వారికి ఈ ప‌థ‌కం బెస్ట్ ఆప్ష‌న్‌గా చెప్పొచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories