Youtube Income: యూట్యూబ్‌లో గోల్డెన్ బటన్ వస్తే నెలకు ఎన్ని డబ్బులు వస్తాయి?

Published : Dec 10, 2025, 06:51 PM IST

Youtube Income: యూట్యూబ్‌ డబ్బు సంపాదనకు మంచి మార్గంగా మారింది. ఇప్పుడు ఉద్యోగాలు వదిలేసి మరీ యూట్యూబ్ సంపాదనతో బతికేస్తున్నవారు ఎంతో మంది ఉన్నారు. యూట్యూబ్‌లో గోల్డెన్ బటన్ వస్తే ఎంత డబ్బు సంపాదించవచ్చో తెలుసా?

PREV
15
యూట్యూబ్‌లో డబ్బు సంపాదన

యూట్యూబ్‌లో వీడియోలు అప్‌లోడ్ చేయడం ద్వారా లక్షలు సంపాదిస్తున్నవారు ఎంతో మంది.  సబ్‌స్క్రైబర్లు, వ్యూస్ పెంచుకుంటే చాలు ప్రతి నెలా డబ్బులు వచ్చి పడతాయి. ముందుగా ఇందుకోసం మీరు యూట్యూబ్ పార్ట్‌నర్ ప్రోగ్రామ్ (YPP)లో చేరాలి. అప్పుడే మీ వీడియోలపై యాడ్స్ వస్తాయి. దీని ద్వారా ఆదాయం రావడం మొదలవుతుంది. యూట్యూబ్ లోని కంటెంట్ క్రియేటర్లకు ఎంత డబ్బుల వస్తాయో తెలుసుకునేందుకు ఎంతో మంది ఆసక్తి చూపిస్తారు.

25
కంటెంట్ క్రియేటర్లకు బటన్స్

యూట్యూబ్ లోని కంటెంట్ క్రియేటర్లకు వారి సబ్‌స్క్రైబర్లు, వ్యూస్ ఆధారంగా యూట్యూబ్ బటన్‌లను ఇస్తుంది. సిల్వర్, గోల్డ్, డైమండ్, రూబీ, కస్టమ్ ప్లే బటన్‌లను అందిస్తుంది. బటన్‌ను బట్టి  వచ్చే ఆదాయం ఆధారపడి ఉంటుంది.

35
ఎంత సబ్ స్రైబర్లకు ఏ బటన్ వస్తుంది?

యూట్యూబ్‌లో ఒక లక్ష మంది సబ్‌స్క్రైబర్లు ఉంటే సిల్వర్ ప్లే బటన్ వస్తుంది. 10 లక్షల సబ్‌స్క్రైబర్లకు గోల్డ్ ప్లే బటన్, 1 కోటి సబ్‌స్క్రైబర్లకు డైమండ్ ప్లే బటన్, 5 కోట్ల సబ్‌స్క్రైబర్లకు రూబీ లేదా కస్టమ్ ప్లే బటన్ లభిస్తుంది. ఇవి రావడం అంత సులువు కాదు, చాలా హై ఎండ్ లో అద్భుతంగా కంటెంట్ ఉండాలి.

45
గోల్డెన్ ప్లే బటన్ వస్తే ఎంత ఆదాయం?

మీ యూట్యూబ్ ఛానెల్‌కు 10 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉంటే, యూట్యూబ్ మీకు గోల్డెన్ ప్లే బటన్ ఇస్తుంది. దీని వల్ల మీ ఆదాయం కూడా పెరుగుతుంది. వీడియోలోని యాడ్స్‌కు 1,000 వ్యూస్ వస్తే ఆ యూట్యూబర్ 2 డాలర్లు సంపాదిస్తారు. గోల్డెన్ బటన్ తర్వాత మీరు క్రమం తప్పకుండా వీడియోలు అప్‌లోడ్ చేసి మంచి వ్యూస్ పొందితే ఏడాదికి సుమారు రూ.40 లక్షలు సంపాదించవచ్చు. ఇతర కంపెనీలతో టై అప్ అయ్యి కూడా విపరీతంగా డబ్బును సంపాదించే అవకాశం ఉంది.

55
పన్ను కూడా కట్టాలి

భారత్‌లో యూట్యూబ్ సంపాదనపై ఆదాయపు పన్ను నియమాలు వర్తిస్తాయి. వార్షిక ఆదాయం రూ.2.5 లక్షల వరకు పన్ను ఉండదు. రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల ఆదాయంపై పాత పన్ను విధానంలో 5 శాతం  పన్ను విధిస్తారు. రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల ఆదాయంపై 20 శాతం పన్ను, రూ.10 లక్షల కంటే ఎక్కువ ఆదాయంపై 30 శాతం పన్ను వర్తిస్తుంది. గోల్డెన్ బటన్ ఉన్న ఛానెల్ ఏడాదికి రూ.40 లక్షలు సంపాదిస్తే అందులో దాదాపు రూ.12 లక్షల పన్ను రూపంలోనే కట్టాలి.

Read more Photos on
click me!

Recommended Stories