Saving scheme: 5 ఏళ్ల‌లో రూ. 3 ల‌క్ష‌లకు పైగా వ‌డ్డీ.. మీ డ‌బ్బుకు ఢోకా ఉండ‌దు

Published : May 30, 2025, 07:58 PM IST

సంపాదించిన దాంట్లో ఎంతో కొంత పొదుపు చేస్తుంటారు. భ‌విష్య‌త్తు అవ‌సరాల దృష్ట్యా పొదుపు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే మీరు పెట్టుబ‌డి పెట్టిన మొత్తానికి సెక్యూరిటీతో పాటు మంచి రిట‌ర్న్స్ వ‌చ్చే ఒక మంచి ప‌థ‌కం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
15
పోస్టాఫీస్‌కు పెరుగుతోన్న ఆద‌ర‌ణ‌

ఇటీవల నెలలుగా స్టాక్ మార్కెట్‌లో నెలకొన్న అస్థిరత వల్ల చాలా మంది పెట్టుబడిదారులు మదుపు కోసం భద్రత కలిగిన మార్గాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి ఆలోచ‌న చేస్తున్న వారికి జాతీయ పొదుపు ధృవీకరణ పత్రం (NSC - National Savings Certificate) ఒకటి. ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలోని పెట్టుబడి పథకం. దీని ద్వారా 100 శాతం భద్రతతో పాటు ఆదాయ పన్నులో కొంత మినహాయింపు కూడా లభిస్తుంది. పోస్టాఫీసుల్లో ఈ అకౌంట్‌ను ఓపెన్ చేయొచ్చు.

25
అస‌లేంటీ ప‌థ‌కం.?

ఈ ప‌థ‌కాన్ని క‌నీసం రూ. 1000తో ప్రారంభించ‌వ‌చ్చు. 5 సంవత్సరాల కాలానికి ఇది అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం సంవత్సరానికి 7.7% చక్రవడ్డీ లభిస్తోంది. పెట్టుబ‌డి ప‌రిమితి ఉండ‌దు. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు లభిస్తుంది.

ప్రస్తుతం ఉన్న వడ్డీ రేటు ప్రకారం, NSCలో పెట్టుబడి చేసిన వ్యక్తి 5 సంవత్సరాల్లో మంచి రాబడిని పొందవచ్చు. వ‌డ్డీ రేట్ల‌ను ప్ర‌తీ మూడు నెల‌ల‌కు ఒక‌సారి స‌మీక్షిస్తారు. కాబ‌ట్టి వ‌డ్డీ రేటు మారుతుండొచ్చు.

35
ఎలా పెట్టుబ‌డి పెట్టాలి.?

పెట్టుబ‌డి పెట్టే వారు రూ. 100 నుంచి మొదలుకొని రూ. 10,000 లేదా అంతకంటే ఎక్కువ మొత్తం డిపాజిట్ చేయవచ్చు. దీనిపై ఎలాంటి గరిష్ఠ పరిమితి ఉండదు. కానీ పాత పన్ను విధానం ప్రకారం రూ. 1.5 లక్షల వరకే పన్ను మినహాయింపు లభిస్తుంది.

45
రూ. 3 ల‌క్ష‌ల వ‌డ్డీ పొందాలంటే ఏం చేయాలి.?

ఈ ప‌థ‌కంలో రూ. 3 ల‌క్ష‌ల వ‌డ్డీ రావాలంటే ఎంత పెట్టుబ‌డి పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందా. ఉదాహ‌ర‌ణ‌కు మీరు ఈ ప‌థ‌కంలో ఒకేసారి రూ. 10 ల‌క్ష‌లు పెట్టుబ‌డి పెట్టార‌నుకుందాం. దీనిపై మీకు ప్ర‌తీ ఏడాది 7.7 శాతం చ‌క్ర‌వ‌డ్డీ ల‌భిస్తుంది. 5 సంవత్సరాల తర్వాత మీ పెట్టుబడి మొత్తం రూ. 13,38,226కి చేరుతుంది. అంటే 5 ఏళ్ల‌లో వ‌డ్డీ రూపంలోనే రూ. 3 ల‌క్ష‌ల‌కిపైగా పొందొచ్చు.

55
ఎవ‌రికి లాభం.?

ఉద్యోగ విర‌మ‌ణ పొందిన వారికి ఈ ప‌థ‌కం బెస్ట్ ఆప్ష‌న్‌గా చెప్పొచ్చు. పెద్ద మొత్తంలో లిక్విడ్ క్యాష్ ఉన్న వారు ఇందులో పెట్టుబ‌డి పెట్టొచ్చు. మార్కెట్ ఒడిదొడుకుల‌తో సంబంధం లేకుండా క‌చ్చిత‌మైన రిట‌ర్న్స్ పొందాల‌నుకునే వారికి ఈ ప‌థ‌కం బెస్ట్ ఆప్ష‌న్‌గా చెప్పొచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories