Reliance Jio: జియోలో అన్‌లిమిటెడ్ 5G డేటా జస్ట్ రూ.198కే: ప్లాన్ అదిరిపోయిందిగా!

Published : May 29, 2025, 11:29 PM IST

Reliance Jio: రిలయన్స్ జియో కంపెనీ రూ.198 ధరకే కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను విడుదల చేసింది. ఈ ప్లాన్ పూర్తి వివరాలను తెలుసుకుందాం రండి. 

PREV
15
పోటీని తట్టుకుంటూ కొత్త ప్లాన్స్

భారతదేశంలోనే అతిపెద్ద టెలికాం కంపెనీ అయిన రిలయన్స్ జియో కోట్లాది మంది కస్టమర్లను కలిగి ఉంది. ప్రైవేట్ కంపెనీలైన ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా, ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ తీవ్ర పోటీని ఇస్తున్నప్పటికీ జియో తక్కువ ధరకే ప్లాన్‌లను అందిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో జియో తక్కువ ధరకే 5G ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఆ వివరాలు తెలుసుకుందామా?

25
జియోలో అత్యంత తక్కువ ధర ప్లాన్ ఇదే..

రిలయన్స్ జియోలో అత్యంత చౌకైన ప్రీపెయిడ్ 5G ప్లాన్ ఇప్పుడు రూ.198కే లభిస్తోంది. మీకు 5G నెట్‌వర్క్‌ సేవలు కావాలనుకుంటే మార్కెట్లో అత్యంత చౌకైన ప్లాన్ ఇదే. ఇది తక్కువ వ్యాలిడిటీని అందించే ప్లాన్ కూడా. మీ ప్రాంతంలో లేదా మీ ఫోన్ లో జియో 5G బాగా పనిచేస్తుందో లేదో చెక్ చేయాలనుకుంటే ఈ ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకొని టెస్ట్ చేయండి. 

35
జియో రూ.198 ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు

జియో రూ.198 ప్రీపెయిడ్ ప్లాన్ ను మీరు వేసుకుంటే అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు, 2GB డైలీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ వినియోగదారులకు అదనపు ఖర్చు లేకుండా అన్‌లిమిటెడ్ 5G కనెక్టివిటీని అందిస్తుంది. ఇందులో JioTV, JioAICloud అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

ఈ ప్లాన్ వ్యాలిడిటీ 14 రోజులు కాబట్టి వినియోగదారునికి 5G ప్రయోజనం కూడా 14 రోజులకు మాత్రమే వర్తిస్తుంది. తర్వాత ఇంటర్నెట్ వేగం 64 Kbpsకి తగ్గుతుంది. 

45
రోజూ అన్‌లిమిటెడ్ 5G డేటా

అదే సమయంలో రోజువారీ 5G డేటా వినియోగానికి ఎటువంటి లిమిట్ లేదు. ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా వంటి కంపెనీలు 5G సేవలకు కొన్ని పరిమితులను విధించాయి. కానీ జియోలో ఎటువంటి పరిమితులు లేకుండా రోజూ 5G సేవను ఉపయోగించవచ్చు. జియో 5Gతో ప్రయోగాలు చేయాలనుకునే వినియోగదారులకు దీర్ఘకాలిక ప్లాన్ తీసుకోవడం కంటే ముందు ఈ ప్లాన్ చెక్ చేసి మీకు నమ్మకం కలిగితేనే రీఛార్జ్ చేసుకోండి. 

55
ఎయిర్ టెల్ కంటే జియోనే ముందు..

జియో, ఎయిర్‌టెల్ భారతదేశంలోని రెండు ప్రధాన టెలికాం కంపెనీలు. ఈ రెండు టెలికాం కంపెనీలు దేశంలోని కోట్లాది మంది మొబైల్ వినియోగదారులకు సేవలందిస్తున్నాయి. అయితే తక్కువ ధర ప్లాన్‌లు, కస్టమర్ సేవలో జియో ఒక అడుగు ముందుంది.

Read more Photos on
click me!

Recommended Stories