OYO: ఓయో బంప‌రాఫ‌ర్‌.. రూ. 3 ల‌క్ష‌లు గెలుచుకునే అవ‌కాశం. ఏం చేయాలంటే..

Published : May 29, 2025, 05:01 PM ISTUpdated : May 29, 2025, 05:10 PM IST

భార‌త దేశంలో ఒక చిన్న స్టార్ట‌ప్‌గా మొద‌లైన ఓయో ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా విస్త‌రిస్తోంది. భారీగా లాభాలు ఆర్జిస్తూ దూసుకుపోతోంది. త్వ‌ర‌లోనే ఐపీఓకి వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతోన్న ఓయో ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

PREV
15
రితేష్ అగ‌ర్వాల్ కీల‌క‌ ప్ర‌క‌ట‌న

ఓయో వ్య‌వ‌స్థాప‌కులు రితేష్ అగర్వాల్ ఓ కీలక ప్రకటన చేశారు. సంస్థ వెనుక ఉన్న పేరెంటు బ్రాండ్‌కు (కార్పొరేట్ బ్రాండ్) కొత్త పేరు పెట్టనున్నట్లు తెలిపారు. అయితే, OYO Hotels, OYO Vacation Homes, OYO Workspaces వంటివి అలాగే కొనసాగుతాయి. పేరు మారేది కేవలం OYO పేరెంటు సంస్థ మాత్రమే.

25
గ్లోబ‌ల్ బ్రాండ్‌గా మారాల‌నే ల‌క్ష్యం

ఓయోను గ్లోబ‌ల్ బ్రాండ్‌గా మార్చాల‌నే ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది. ఓయోను గ్లోబల్ లెవెల్లో అర్బన్ ఇన్నొవేషన్, మోడర్న్ లివింగ్‌ను ముందుకు తీసుకెళ్లే పేరెంటు సంస్థకు కొత్త పేరును తీసుకొస్తున్న‌ట్లు రితేష్ అగ‌ర్వాల్ ఎక్స్ వేదిక‌గా పోస్ట్ చేశారు. 

“భారతదేశంలో జన్మించిన ఓయో గ్లోబల్ బ్రాండ్‌గా ఎదిగేందుకు ఇది సమయం. ప్రపంచానికి సరిపోయేలా, ప్రపంచ దృష్టిలో నిలిచేలా మేము కొత్త పేరు అన్వేషిస్తున్నాం” అని రాసుకొచ్చారు.

35
ఔత్సాహికుల‌కు ఆహ్వానం:

ఓయో కొత్త పేరును సూచించే అవ‌కాశాన్ని కంపెనీ ప్ర‌జ‌ల‌కు అందించింది. ఒక‌వేళ మీరు సూచించిన పేరు క‌న్ఫామ్ అయితే రూ. 3 ల‌క్ష‌ల న‌గ‌దు బ‌హుమ‌తి ల‌భిస్తుంది. అలాగే ఓయో వ్యవస్థాపకుడిని క‌లిసే అవ‌కాశం సొంతం చేసుకోవ‌చ్చని రితేష్ ట్వీట్‌లో రాసుకొచ్చారు.

45
పేరు ఎలా ఉండాంటే.?

కొత్త పేరు ఎలా ఉండాలి అనే విషయంపై కొన్ని మార్గదర్శకాలను కూడా ఇచ్చారు:

* బోల్డ్‌గా ఉండాలి

* ఒక్క పదంగా ఉండాలి

* గ్లోబల్ ఫీల్ ఉండాలి

* హ్యూమన్ టచ్‌తో గుర్తుండిపోయేలా ఉండాలి

* హాస్పిటాలిటీ మించి విస్తరించేలా విశాలమైన భావన ఇవ్వాలి

55
IPO ప్రక్రియ మూడోసారి ప్రారంభం

ఇదిలా ఉంటే ఓయో మళ్లీ IPO (ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్) ప్రక్రియను ప్రారంభించింది. ఓయో ఐపీఓ కోసం ప్రయత్నించడం ఇది మూడోసారి. ప్రస్తుతం దేశీయ, అంతర్జాతీయ బ్యాంకర్ల నుంచి పిచ్‌లను స్వీకరిస్తోంది. 2026 ప్రారంభంలో స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అవ్వాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. 

ఇందులో భాగంగానే ఒక ముఖ్యమైన సమావేశం జూన్‌లో లండన్‌లో జరగనుందని సమాచారం. ఇందులో OYO బోర్డు సభ్యులు, ముఖ్య షేర్‌హోల్డర్ అయిన సాఫ్ట్‌బ్యాంక్ ప్రతినిధులు పాల్గొననున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories