ముకేష్ అంబానీ డేటా గిరి: జియో సక్సెస్ సీక్రెట్ ఇదే...

First Published Jul 30, 2019, 12:30 PM IST

ఒక మూడు సంవత్సరాల కింద వరకు ఫోనులో డేటా ఆన్ చేయాలన్నా, ఇంటర్నెట్ వాడాలన్నా చాలా ఆలోచించేవారం. కేవలం అవసరమున్నప్పుడు మాత్రమే ఇంటర్నెట్ వాడుకుంటూ, ఉన్న డాటాను కాపాడుకునేవాల్లం. కానీ ఒకసారి జియో రావడంతో ఇదంతా గత చరిత్రగా మిగిలిపోయింది. ఇప్పుడు అందరం మొబైల్ లో డేటా ఆఫ్ చేయాలి అనే విషయాన్ని కూడా పట్టించుకోవడం లేదు. 

ఒక మూడు సంవత్సరాల కింద వరకు ఫోనులో డేటా ఆన్ చేయాలన్నా, ఇంటర్నెట్ వాడాలన్నా చాలా ఆలోచించేవారం. కేవలం అవసరమున్నప్పుడు మాత్రమే ఇంటర్నెట్ వాడుకుంటూ, ఉన్న డాటాను కాపాడుకునేవాల్లం. కానీ ఒకసారి జియో రావడంతో ఇదంతా గత చరిత్రగా మిగిలిపోయింది. ఇప్పుడు అందరం మొబైల్ లో డేటా ఆఫ్ చేయాలి అనే విషయాన్ని కూడా పట్టించుకోవడం లేదు. చాలా యూట్యూబ్ ఛానెల్లు వెబ్ ఆధారిత న్యూస్ ఛానెల్లు సక్సెస్ అవ్వడానికి కూడా ఇది ఒక ముఖ్య కారణం. ఇలా టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన రిలయన్స్ జియో ఇప్పుడు ఈ రంగంలోనే రారాజుగా వెలుగొందుతోంది. గత వారం ప్రకటించిన త్రైమాసిక ఫలితాలతో అత్యధిక మంది వినియోగదారులు కలిగి ఉన్న నెట్వర్క్ గా జియో నిలిచింది. కేవలం మూడు సంవత్సరాలలోనే ఇది ఎలా సాధ్యపడిందో తెలుసుకుందాం.
undefined
రిలయన్స్ వ్యవస్థాపకుడు ధీరుభాయి అంబానీ మరణాంతరం రిలయన్స్ గ్రూపులను అన్నదమ్ములైన ముఖేష్ అంబానీ అనిల్ అంబానీలు పంచుకున్నారు. 2005లో జరిగిన ఈ పంపకాల్లో ముఖేష్ కు టెలికాం రంగానికి చెందిన కంపెనీ ఆర్ కామ్ దక్కలేదు. అది తన తమ్ముడైన అనిల్ అంబానీకి దక్కింది. అసలు ఆర్ కామ్ ఏర్పాటు చేయడంలో అన్నీ తానై ముందుండి నడిపింది ముఖేష్ అంబానీయే. కానీ పంపకాల్లో అది అనిల్ అంబానీ పాలయ్యింది. అంతేకాకుండా ముఖేష్ అంబానీ పది సంవత్సరాలపాటు టెలికాం రంగంలోకి అడుగు పెట్టొద్దు అనే ఒప్పందం కూడా కుదిరింది. అప్పటికే ఒక ఊపు ఊపుతున్న రిలయన్స్ నెట్వర్క్ అనిల్ సొంతమయినప్పటికీ, ఇప్పుడు దాని పరిస్థితేంటో మనందరికీ తెలుసు. అప్పుల ఊబిలో కూరుకుపోయి దివాలా తీసింది.
undefined
అన్నదమ్ములు ఇద్దరి మధ్య కుదిరిన ఒప్పందం ముగిసిన వెంటనే రంగంలోకి దిగిన ముఖేష్ అంబానీ సెప్టెంబర్ 2016లో రిలయన్స్ జియోను ప్రారంభించాడు. తొలుత ఉచిత డాటాను అందిస్తూ మార్కెట్లను కుదిపేసింది. అప్పటివరకు నెలమొత్తానికి డేటా గురించి ఎంబీల్లో మాట్లాడుకునే జనాలు జీబీల్లో చర్చించుకోవడం మొదలు పెట్టారు. ఈ దెబ్బకు మిగిలిన కంపెనీలు కూడా దిగిరాక తప్పలేదు. మార్కెటులో అనేక కంపెనీలు తమ కంపెనీలను అమ్ముకున్నాయి. కొన్నేమో వేరే కంపెనీలతోని కలిసాయి. ఉదాహరణకు యూనినార్ ఎయిర్ టెల్ తో కలిసింది. వోడాఫోన్ ఐడియా తో కలిసింది. ఎయిర్సెల్ కనపడకుండా పోయింది. ఇలా మార్కెట్లో ప్రకంపనలు సృష్టించింది జియో.
undefined
నేడు మార్కెట్లో కనుక తీసుకుంటే, కేవలం మూడు పెద్ద కంపెనీలు మాత్రమే టెలికాం రంగంలో కనపడుతున్నాయి. అవి ఎయిర్ టెల్, వోడాఫోన్-ఐడియా, జియో. ఏప్రిల్ నుంచి జూన్ వరకు వినియోగదారుల వివరాలను ప్రకటించిన వోడాఫోన్-ఐడియా కంపెనీ ఒక కోటి 41 లక్షల మంది వినియోగదారులని కోల్పోయి 320 మిలియన్ మంది వినియోగదారులను మాత్రమే కలిగి ఉంది. వోడాఫోన్- ఐడియా కంపెనీలు కలవడంతో గత నెలలోనే అత్యధిక వినియోగదారులను కలిగి ఉన్న ఈ కంపెనీ కేవలం 30 రోజుల వ్యవధిలోనే రెండో స్థానానికి పడిపోయింది. మరోవైపు ఎయిర్ టెల్ విషయానికి వస్తే, జూన్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించనప్పటికీ మే నాటికి 320మిలియన్ వినియోగదారులను కలిగి ఉంది. జూన్ ఫలితాలను ప్రకటించేనాటికి ఇది ఇంకా పడిపోవచ్చు.
undefined
మరి ఈ విధంగా ఎందుకు జరుగుతోంది? కేవలం 3 సంవత్సరాల్లోనే జియో ఎలా మార్కెట్లను శాసిస్తోందో తెలుసుకుంటే ముఖేష్ అంబానీ కృషి మనకు అర్థమవుతుంది. జియో కాకుండా వేరే రెండు కంపెనీలు అయిన ఎయిర్ టెల్, వోడాఫోన్-ఐడియా తాజాగా చాలా తక్కువ మొత్తంలో తమకు రెవిన్యూ అందించే కస్టమర్లను వదిలించుకునే ప్రయత్నం చేశారు. దానికి బదులుగా క్వాలిటీ పైన దృష్టి పెట్టారు. మన కనెక్షన్లను తొలగిస్తాము అంటూ వచ్చే ఫోన్ కాల్స్ ను బట్టి ఈ విషయం అర్థమవుతుంది. ముఖ్యంగా ఎయిర్ టెల్ ప్రకటనలను చూస్తే క్వాలిటీ పైన వారి దృష్టి మనకు అర్థమవుతుంది. దీని వల్ల వినియోగదారుల సంఖ్య తగ్గినప్పటికీ, ప్రతి వినియోగదారుడి నుంచి వచ్చే రెవిన్యూ మాత్రం పెరిగింది.
undefined
మరోపక్క జియోను తీసుకుంటే తమ వినియోగదారుల సంఖ్యను గణనీయంగా పెంచుకునే ప్రయత్నం చేసింది. వినియోగదారుల సంఖ్య పెరిగినప్పటికీ, ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే ఆదాయం మాత్రం గత రెండు త్రైమాసికాలుగా తగ్గుతూ వస్తూంది. మొత్తంగా గనుక చూసుకుంటే జియో క్వాంటిటీ పైన దృష్టి పెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది.
undefined
ఇదంతా చూసిన తరువాత జియో వినియోగదారుల సంఖ్యను పెంచుకున్నప్పటికీ నష్టాల్లో ఉంది అనుకుంటే పొరపాటే. గత సంవత్సరం వోడాఫోన్-ఐడియా దాదాపుగా 4,870 కోట్ల నష్టాలను చవిచూస్తే, జియో మాత్రం 891 కోట్ల లాభాలను ఆర్జించింది. ముఖేష్ అంబానీ స్ట్రాటజీ సక్సెస్ అయ్యింది అనడానికి దీనికి మించిన ఉదాహరణ అవసరం లేదు. 2002 లో ముఖేష్ అంబానీ కన్న కలలు ఇప్పుడు సాకారమవుతున్నట్టుగా కనపడుతుంది.
undefined
ఏది ఏమైనప్పటికీ, ఎవరు నిలుస్తారో, గెలుస్తారో తరువాత విషయం. కానీ ప్రస్తుతానికి మాత్రం వినియోగదారుడు రాబోయే రోజుల్లో కూడా ఇలానే చవకైన టారిఫ్ ప్లాన్లను ఎంజాయ్ చేయడం మాత్రం తథ్యం.
undefined
click me!