Cheap Flight Booking Tricks: రూ. 5000 విలువైన ఫ్లైట్ టికెట్‌ కేవలం రూ. 799కే !

Mahesh Rajamoni | Published : May 5, 2025 6:47 PM
Google News Follow Us

Cheap Flight Booking Tricks: ఖరీదైన ఫ్లైట్ టికెట్లను చూసి రైలు లేదా ఇతర ప్రయాణ ఎంపికల కోసం వెతుకుతున్నారా? ఇక ఆ అవసరం లేదు ! రూ. 5000 విలువ చేసే ఫ్లైట్ టికెట్లను కేవలం రూ.799కే బుక్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన బెస్ట్ టైమింగ్ టిప్స్ మీకోసం.

 

15
Cheap Flight Booking Tricks: రూ. 5000 విలువైన ఫ్లైట్ టికెట్‌ కేవలం రూ. 799కే !
ఎప్పుడు ఫ్లైట్ టికెట్ బుక్ చేయాలి?

ఫ్లైట్ టికెట్లు కొన్ని సమయాల్లో చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉంటాయి. పలు రిపోర్టులు ప్రకారం.. మంగళవారం అర్ధరాత్రి నుండి బుధవారం ఉదయం 6 గంటల మధ్య ఫ్లైట్ టికెట్లు బుక్ చేస్తే చాలా తక్కువ ధరకు దొరుకుతాయి. ఎయిర్ లైన్స్ ఈ సమయంలోనే డిస్కౌంట్ టికెట్లు విడుదల చేస్తాయి. 70% వరకు ఆదా చేసుకోచ్చు.

25
ఎన్ని రోజుల ముందు ఫ్లైట్ టికెట్ బుక్ చేయాలి?

ప్రయాణ తేదీకి 21 నుండి 30 రోజుల ముందు ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తే రూ.799 నుండి రూ.2,500 వరకు ధరలు ఉంటాయి. చాలా ముందుగా లేదా చాలా ఆలస్యంగా బుక్ చేస్తే ధరలు పెరుగుతాయి. 3 వారాల ముందు బుకింగ్ చేయడం వల్ల మీకు సాధారణ ధరలు లేదా తక్కువ ధరలకు టికెట్లు అందుబాటులో ఉండవచ్చు. 

35
ఫ్లైట్ టికెట్ బుకింగ్ కి వారంలో ఏ రోజులు బెస్ట్?

సాధారణంగా మంగళవారం, బుధవారం, శనివారాల్లో ఫ్లైట్ టికెట్లు చౌకగా లభిస్తాయి. సోమ, శుక్రవారాల్లో బిజినెస్ ట్రావెల్స్ ఎక్కువగా ఉండటం వల్ల ధరలు ఎక్కువ. కాబట్టి వారం మధ్యలో లేదా వారాంతపు రోజుల్లో ప్రయాణం ప్లాన్ చేసుకోవడం మంచిది.

45
ప్రైస్ డ్రాప్ అలర్ట్ సెట్ చేసుకోండి

అప్పుడప్పుడు ఫ్లైట్ ధరలు తగ్గుతుంటాయి. కాబట్టి ఫ్లైట్ టిక్కెట్ల ప్రైస్ డ్రాప్ అలర్ట్ లను సెట్ చేసుకోండి. Google Flights, Skyscanner లేదా Hopper యాప్స్ ఇన్‌స్టాల్ చేసి 'Price Alert' ఆన్ చేయండి. టికెట్ ధరలు తగ్గినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. తక్కువ ధరకు టికెట్ పొందే అవకాశం ఉంటుంది.

55
ఈ వెబ్‌సైట్‌లలో ఫ్లైట్ టికెట్లపై అదనపు డిస్కౌంట్లు

ixigo, Paytm Travel, EaseMyTrip వంటి  వెబ్ సైట్స్ కొత్త యూజర్లకు రూ.500 నుంచి రూ. 1500 వరకు కూపన్లు ఇస్తాయి. అలాగే, క్రెడిట్ కార్డ్ లేదా UPI ద్వారా చెల్లింపు చేస్తే బ్యాంకులు ఆఫర్లు ఇస్తాయి. టికెట్ బుకింగ్ ముందు ఈ ఆఫర్లను చూసుకోండి.  తక్కువ ధరకే మీకు ఫ్లైట్ టికెట్లు లభించవచ్చు.

Read more Photos on
click me!
Recommended Photos