Stock market motivational story: జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు కష్టాలు అందరికీ వస్తాయి. కొందరు వాటికి భయపడి వెనక్కి తగ్గుతారు, కానీ కొందరు వాటిలో అవకాశాలను వెతుక్కుంటారు. మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన విజయ్ కెడియా కథ కూడా అలాంటిదే. రూ.14 నుంచి నేడు ఆయన 1,400 కోట్లకు అధిపతి అయ్యాడు. స్టార్ మార్కెట్ కింగ్ గా ఎదిగాడు.
విజయ్ కెడియా మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి స్టాక్ బ్రోకర్. విజయ్ 10వ తరగతి చదువుతున్నప్పుడు, తండ్రి అకస్మాత్తుగా మరణించారు. దీంతో ఇంట్లో ఆదాయానికి మార్గం లేకుండా పోయింది. ఈ కష్టకాలంలోనే విజయ్ తన చదువు పూర్తి చేశాడు, కానీ కుటుంబ పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి ఆయన ఏదో ఒకటి చేయాల్సి వచ్చింది.
25
షేర్ మార్కెట్ లోకి అడుగులు
కుటుంబ పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి విజయ్ దగ్గర ఎక్కువ మార్గాలు లేవు. షేర్ మార్కెట్ (Share Market) లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రారంభంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, వెనక్కి తగ్గలేదు. క్రమంగా షేర్ ట్రేడింగ్ లో కొంత విజయం సాధించడం ప్రారంభించారు, ఆయన జీవితం మారడం మొదలైంది.
35
14 రూపాయలు కూడా లేని స్థితిలో విజయ్ కేడియా
విజయ్ కేడియా జీవితంలో ఒక సమయంలో పాల ప్యాకెట్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఏర్పడింది. ఒకరోజు ఆయన బిడ్డ ఆకలితో ఏడుస్తుంటే, భార్య పాలు తెమ్మని అడిగింది. కానీ విజయ్ దగ్గర రూ.14 పాల ప్యాకెట్ కొనడానికి కూడా డబ్బులు లేవు. ఈ సంఘటన ఆయనను కుదిపేసింది. దాన్ని తన బలహీనతగా భావించకుండా మళ్ళీ కష్టపడటం మొదలుపెట్టాడు.
1990ల ప్రారంభంలో విజయ్ కలకత్తా వదిలి ముంబై వెళ్లారు. అక్కడ ఆయన అదృష్టం కలిసొచ్చింది. 1992లో షేర్ మార్కెట్ లో బుల్ రన్ వచ్చినప్పుడు, విజయ్ కేడియా బాగా డబ్బు సంపాదించారు. ఆయన కలకత్తా నుండి పంజాబ్ ట్రాక్టర్స్ షేర్లు ₹35,000 కి కొనుగోలు చేశారు. బుల్ రన్ సమయంలో ఈ షేర్ల ధర ఐదు రెట్లు పెరిగింది. వాటిని అమ్మి ACC షేర్లు కొన్నారు, ఈ పెట్టుబడి కూడా ఆయనకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. దీంతో ఆయన ఆర్థిక పరిస్థితి మారిపోయింది, ఆత్మవిశ్వాసం పెరిగింది.
55
విజయ్ కేడియా పోర్ట్‌ఫోలియో
2009లో విజయ్ తన భార్యకు ఒక పాల కంపెనీ షేర్లు బహుమతిగా ఇచ్చాడు. అది ఆ రూ.14 కి సమాధానం. నేడు ఆయన పేరు దిగ్గజ పెట్టుబడిదారుల్లో ఒకటి. ఆయన కేడియా సెక్యూరిటీస్ వ్యవస్థాపకుడు కూడా. నివేదికల ప్రకారం, డిసెంబర్ 2024 నాటికి ఆయన నికర ఆస్తి ₹1,396.9 కోట్లు, అంటే దాదాపు ₹1,400 కోట్లు. ఆయన పోర్ట్‌ఫోలియోలో తేజస్ నెట్‌వర్క్స్, అతుల్ ఆటో వంటి కంపెనీల స్టాక్స్ ఉన్నాయి.
గమనిక: ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు మీ మార్కెట్ నిపుణుల సలహా తీసుకోండి.