Fake Notes: మార్కెట్లోకి పెద్ద ఎత్తున‌ నకిలీ రూ. 500 నోట్లు.. స్మార్ట్‌ఫోన్‌తో ఇట్టే కనిపెట్టొచ్చు

Published : May 05, 2025, 09:49 AM IST

మార్కెట్లోకి పెద్ద ఎత్తున న‌కిలీ నోట్లు స‌ర్క్యూలేట్ అవుతోన్నట్లు ఇటీవ‌ల అధికారులు హెచ్చ‌రించారు. ముఖ్యంగా రూ. 500 న‌కిలీ నోట్ల‌ను మార్కెట్లోకి వ‌దులుతున్నారు. బ్యాంకుల‌కు చేరే వ‌ర‌కు ఈ విష‌యం తెలియ‌డం లేదు. అస‌లైన రూ. 500 నోట్ల‌ను పోలిన‌ట్లు డిజైన్ చేయ‌డంతో గుర్తించ‌డం ఇబ్బందిగా మారుతుంది. ఈ నేప‌థ్యంలోనే ఫేక్ నోట్ల‌ను గుర్తించేందుకు వీలుగా కొత్త యాప్‌ను తీసుకొచ్చింది ఆర్బీఐ.   

PREV
14
Fake Notes: మార్కెట్లోకి పెద్ద ఎత్తున‌ నకిలీ రూ. 500 నోట్లు.. స్మార్ట్‌ఫోన్‌తో ఇట్టే కనిపెట్టొచ్చు

మార్కెట్లో న‌కిలీ రూ. 500 నోట్లు చెలామ‌ణి అవుతున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం హెచ్చ‌రిస్తోంది. CBI, SEBI, NIA వంటి సంస్థలకు హెచ్చరిక జారీ చేసింది. రూ. 500 నోట్లు తీసుకునే స‌మ‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు. చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఆధారంగా నకిలీ నోటును గుర్తించ‌వ‌చ్చ‌ని తెలిపారు. అయితే ఓ ముఠా అలాంటి త‌ప్పు కూడా లేకుండా న‌కిలీ నోట్ల‌ను ముద్రిస్తున్న‌ట్లు గుర్తించారు. 
 

24
प्रतीकात्मक चित्र

యాప్‌ను తీసుకొచ్చిన రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 

ఈ నేప‌థ్యంలోనే న‌కిలీ నోట్ల‌ను గుర్తించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స‌రికొత్త యాప్‌ను తీసుకొచ్చింది. MANI (మొబైల్ ఎయిడెడ్ నోట్ ఐడెంటిఫైయర్) అనే పేరుతో ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. యాపిల్ స్టోర్‌తో పాటు ప్లే స్టోర్‌లోనూ ఈ యాప్ అందుబాటులో ఉంది. 
 

34

ఎలా ప‌ని చేస్తుంది.? 

ఈ యాప్‌ను ఉప‌యోగించ‌డం కూడా చాలా సులువు. యాప్ ఓపెన్ చేసిన వెంట‌నే కెమెరా ప‌ర్మిష‌న్ అడుగుతుంది. కెమెరా ఆన్ చేసి రూ. 500 నోటును స్కాన్ చేయాలి. దీంతో స‌దరు నోట్ అస‌లా.? న‌కిలీనా.? అన్న విష‌యాన్ని యాప్ చెప్పేస్తుంది. ఇంకో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏంటంటే.. ఈ యాప్‌ను ఉప‌యోగించ‌డానికి ఇంట‌ర్నెట్ కూడా అస‌వ‌రం లేదు. 

44
500 note

ఇలా గుర్తించ‌వ‌చ్చు.? 

న‌కిలీ రూ. 500 నోటును గుర్తించేందుకు ఇంకొన్ని ప‌ద్ధతులు కూడా ఉన్నాయి. రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని రాసు ఉండే ఇంగ్లిష్ లెట‌ర్స్‌లో ఒక చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఆధారంగా న‌కిలీ నోటును గుర్తించ‌వ‌చ్చు. అదే విధంగా నోటు మధ్యలో ‘భారత్’ ‘RBI’ అని వ్రాసిన మెరిసే గీత ఉంటుంది. మీరు నోటును కొద్దిగా వంచినప్పుడు ఈ గీత రంగు మారుతుంది. ఇంకా, గాంధీజీ ఫోటో దగ్గర ఒక వాటర్‌మార్క్ ఉంటుంది. అది వెలుతురులో స్పష్టంగా కనిపిస్తుంది. వీటి ఆధారంగా న‌కిలీ నోటును ఇట్టే గుర్తించ‌వ‌చ్చు. 

Read more Photos on
click me!

Recommended Stories