2021 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ వృద్ధి అంచనాను మూడు శాతం తగ్గించి 9.5 శాతానికి తగ్గించాలని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నిర్ణయించిన ఒక రోజు తర్వాత సీతారామన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. అంతకుముందు ఐఎంఎఫ్ అంచనా 12.5 శాతంగా ఉంది.
1. డిఐసిజిసి బిల్లు : బ్యాంక్ కస్టమర్ల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ యాక్ట్ (డిఐసిజిసి)1961ను సవరణ బిల్లును ఆమోదించారు. దీని ద్వారా మూసివేసిన బ్యాంకుల వినియోగదారులకు పెద్ద ఉపశమనం లభిస్తుంది. బ్యాంకు డిపాజిటర్ల కష్టాలను తగ్గించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. మారటోరియం ఆంక్షల క్రింద ఉన్న బ్యాంకులకు నగదు అందుబాటులోకి వచ్చేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ఆ బ్యాంకులను లిక్విడేట్ చేసే వరకు డిపాజిటర్లు వేచి చూడవలసిన లేదు. బ్యాంకుల రోజువారీ కార్యకలాపాలను ఆర్బీఐ నిలిపేసి నిఘాలో ఉంచినపుడు కూడా ఆ బ్యాంకుల డిపాజిటర్లకు రూ.5 లక్షలు డిపాజిట్ ఇన్సూరెన్స్ కవర్‌ను కేబినెట్ ఆమోదించింది. ఈ వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బుధవారం స్వయంగా వెల్లడించారు.
2.ఇటీవల యెస్ బ్యాంక్, లక్ష్మి విలాస్ బ్యాంక్ సహా అనేక బ్యాంకులు దివాళా తీశాయి. ఇలాంటి పరిస్థితిలో ఈ వార్త డిపాజిటర్లకు పెద్ద ఉపశమనం కలిగిస్తుంది. బ్యాంకు లైసెన్స్ రద్దు చేయబడితే బ్యాంకు వినియోగదారులకు రూ .5 లక్షల వరకు డిపాజిట్ బీమా లభిస్తుంది. ఈ నియమం 2020 ఫిబ్రవరి 4 నుండి వర్తిస్తుంది. 1993 నుండి 27 సంవత్సరాలలో మొదటిసారి డిపాజిట్ భీమా మార్చబడింది.
3.2020లోనే ప్రభుత్వం డిపాజిట్ బీమా పరిమితిని ఐదు రెట్లు పెంచింది. అంతకుముందు దీని పరిమితి లక్ష రూపాయలు ఉండేది.ఈ చట్టం అన్ని బ్యాంకుల్లో రూ .5 లక్షల వరకు అన్ని రకాల డిపాజిట్లను కలిగి ఉంటుంది. మొత్తం డిపాజిట్ ఖాతాల్లో 98.3 శాతం, డిపాజిట్ విలువలో 50.98 శాతం డిఐసిజిసి చట్టం పరిధిలోకి వస్తాయని ఆర్థిక మంత్రి చెప్పారు. సీతారామన్ మాట్లాడుతూ ప్రతి బ్యాంకుకు 100 రూపాయల చొప్పున 10 పైసల ప్రీమియం ఉండేది. కానీ దీనిని 12 పైసలకు పెంచుతున్నం. ఇది 100 రూపాయలకు 15 పైసలు మించకూడదు.
4. ఎల్‌ఎల్‌పి బిల్లు లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ (ఎల్‌ఎల్‌పి) చట్టానికి మొదటి సవరణను కూడా కేంద్ర మంత్రివర్గం ప్రతిపాదించింది. ఈ చట్టం 2008-2009లో ఉనికిలోకి వచ్చింది. ఎల్‌ఎల్‌పి కోసం మొత్తం 12 అఫెన్సెస్ క్లియర్ చేయాల్సి ఉంటుంది.
5.ఎల్‌ఎల్‌పి చట్టంలో ప్రస్తుతం 24 శిక్షా నిబంధనలు, 21 కాంపౌండబుల్ అఫెన్సెస్, మూడు నాన్- కాంపౌండబుల్ అఫెన్సెస్ ఉన్నాయని ఆర్థిక మంత్రి చెప్పారు. కానీ ఈ రోజు తరువాత శిక్షా నిబంధనలు 22కి తగ్గించాయి, కాంపౌండబుల్ అఫెన్సెస్ ఏడు మాత్రమే, నాన్- కాంపౌండబుల్ అఫెన్సెస్ మూడు మాత్రమే. మొత్తంగా వీటి సంఖ్య ఇప్పుడు 12 అవుతుంది. దీని ద్వారా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రచారానికి ప్రేరణనిస్తుంది. అలాగే చిన్న ఎల్‌ఎల్‌పిల పరిధి విస్తరిస్తుంది.
6.ప్రస్తుతం, రూ .25 లక్షలు లేదా అంతకంటే తక్కువ సహకారం కలిగిన ఎల్‌ఎల్‌పిలను, రూ .40 లక్షల లోపు టర్నోవర్‌ను చిన్న ఎల్‌ఎల్‌పిలుగా పరిగణిస్తారు. కానీ ఇప్పుడు రూ .25 లక్షల పరిమితిని రూ .5 కోట్లకు పెంచారు ఇంకా టర్నోవర్ పరిమాణం 50 కోట్లకు పెరిగింది.
7. అంతర్జాతీయ ఆర్థిక సేవల సెంటర్లు,మల్టీ లాటరల్ ఏజెన్సీలు, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ సెక్యూరిటీ కమీషన్స్, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఇన్సూరెన్స్ అబ్జర్వర్స్ మధ్య మల్టీ లాటరల్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలియజేశారు.