Operation Sindoor: రూ.97,000 కంటే తక్కువకు పడిపోయిన బంగారం ధర.. ఇండియా-పాక్ ఉద్రిక్తతలే కారణం

Published : May 07, 2025, 12:04 PM ISTUpdated : May 07, 2025, 12:05 PM IST

Gold Rate: ఉగ్రమూకలను మట్టుబెట్టడమే లక్ష్యంగా భారత్ ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్ కు గోల్డ్ మార్కెట్ కూడా ప్రభావితమైంది. ఇటీవల రోజురోజుకూ పెరుగుతున్న గోల్డ్ ధరలు బుధవారం మాత్రం ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. బంగారం ధరలు తగ్గడానికి కారణాలు, మార్కెట్ నిపుణుల విశ్లేషణలు ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
Operation Sindoor: రూ.97,000 కంటే తక్కువకు పడిపోయిన బంగారం ధర.. ఇండియా-పాక్ ఉద్రిక్తతలే కారణం

ఇండియా-పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, US ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య విధానంపై ఆసక్తి నేపథ్యంలో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (MCX)లో బుధవారం బంగారం ధరలు పడిపోయాయి. ఇటీవల వరుసగా బంగారం ధరలు పెరుగుతుండటంతో అందరూ గోల్డ్ పైనే ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించారు.

రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు, ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కావడం ఇలాంటి అనేక కారణాలు గ్లోబల్ గోల్డ్ మార్కెట్ ని ప్రభావితం చేశాయి.దీంతో రోజురోజుకూ బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. 

 

25

అనూహ్యంగా తగ్గిన గోల్డ్ ధర..

అయితే అనూహ్యంగా MCXలో బంగారం ధర రూ.97,491 గా ఉండగా బుధవారం ఉదయం రూ.96,900కు ప్రారంభమైంది. ఉదయం 9:05 గంటలకి MCXలో బంగారం ధర రూ.841 తగ్గి, రూ.96,650కి ట్రేడవుతోంది. మంగళవారం సెషన్‌లో బంగారం ధర 3% కంటే ఎక్కువగా పెరిగింది.

అదే సమయంలో వెండి ధర కూడా పడిపోయింది. MCXలో వెండి ధర రూ.251 తగ్గి రూ.96,450కి ట్రేడవుతోంది.

35

అంతర్జాతీయ మార్కెట్ లోనూ అంతే..

అయితే అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు US-చైనా ట్రేడ్ టాక్స్ ల వల్ల తగ్గాయి. స్పాట్ గోల్డ్ ధరలు 1.2 శాతం తగ్గి ఔన్స్‌కు 3,388.67 డాలర్లకి చేరాయి. US గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు 0.7 శాతం తగ్గి 3,397.70 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.

ఇండియా విషయానికొస్తే ఇండియన్ ఆర్మీ నిర్వహించిన ‘ఆపరేషన్ సింధూర్’ నేపథ్యంలో భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ ఆపరేషన్‌లో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలను భారత దళాలు లక్ష్యంగా చేసుకున్నాయి. ఆపరేషన్ సింధూర్ కూడా గోల్డ్ మార్కెట్ పై ప్రభావం చూపుతోందని విశ్లేషకులు అంటున్నారు. 

45

నిపుణులు ఏమంటున్నారు..

అంతర్జాతీయ ధరలు తగ్గడం వల్ల ఈ రోజు MCXలో బంగారం ధరలు బలహీనంగా ఉండే అవకాశం ఉంది. బంగారం రూ.96,500 వరకు పడే అవకాశం ఉందని సీనియర్ రీసెర్చ్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. 

US ఫెడరల్ రిజర్వ్ బుధవారం ద్రవ్య విధానాన్ని ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో ఫెడ్ వడ్డీ రేట్లను యథావిధిగా ఉంచే అవకాశముందని గోల్డ్ మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

55

ఎలా ఇన్వెస్ట్ చేస్తే మంచిది..

ఇప్పుడున్న యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో మీ దగ్గర పెట్టబడి ఉంటే వెంటనే గోల్డ్ కొని పెట్టుకోండి. లేదంటే గోల్డ్ ఈటీఎఫ్, డిజిటల్ గోల్డ్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెడితే మీ డబ్బు సేఫ్ గా ఉంటుంది. రిటర్స్ కూడా కచ్చితంగా పెరిగే మీ చేతికి అందుతాయి. 

Read more Photos on
click me!

Recommended Stories