భారతదేశంలో ఒక 100 మందిని ఏ రకమైన కారు కొనాలనుకుంటున్నారని అడిగితే 60-70% మంది SUV కార్లనే కొనాలనుకుంటున్నామని చెబుతారు. అందుకే భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో SUV కార్లకు ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది. పవర్ ఫుల్, స్టైలిష్ లుక్, మంచి సౌకర్యాలు, అద్భుతమైన పికప్, ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ వంటి కారణాల వల్ల ప్రజలు ఇప్పుడు SUV కార్లను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా తక్కువ ధరలో చాలా మంచి SUV కార్లు ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. వాటిలో టాప్ లో ఉన్నది హుందయ్ కంపెనీ క్రెటా.
హ్యుందాయ్ క్రెటా
హ్యుందాయ్ మిడ్సైజ్ SUV అయిన క్రెటా, ఏప్రిల్‌లో 17,016 యూనిట్లు అమ్ముడై మొదటి స్థానాన్ని సంపాదించింది. ఇది రూ.11.11 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర వద్ద అందుబాటులో ఉండగా, మాక్స్ వేరియంట్ ధర రూ.20.50 లక్షలు. పెట్రోల్, డీజిల్ మోడళ్లతో పాటు క్రెటా EV మోడల్ కూడా మార్కెట్లో ఉంది. ఈ మోడల్ 10 ఏళ్లుగా నంబర్ 1 స్థానం నిలుపుకుంటోంది.