చాలా ప్రయత్నించిన తర్వాత ఒక కాల్ సెంటర్‌లో 6000 రూపాయల జీతంతో అశుతోష్ ఉద్యోగం ప్రారంభించారు. ఒకరోజు కాల్‌లో ఒక వ్యక్తికి అశుతోష్ గొంతు నచ్చింది. రెట్టింపు జీతం ఇస్తానని, తన కంపెనీలో పనిచేయాలని ఆయన ఆఫర్ ఇవ్వడంతో అశుతోష్ ఆ కంపెనీలో జాయిన్ అయ్యారు. జీతం రూ.14000. అది ఒక స్టార్టప్ కంపెనీ. అప్పుడు అశుతోష్ వయసు 19 సంవత్సరాలు. ఆ స్టార్టప్ వ్యవస్థాపకుల వయసు 22-24 సంవత్సరాలు ఉంటాయి. కానీ వారు నెలకు రూ.కోట్లు సంపాదిస్తున్నారు.
దీంతో తానెందుకు సెల్ఫ్ బిజినెస్ చేయకూడదని అశుతోష్ ఆలోచించడం ప్రారంభించారు. సెల్ఫ్ డెవలప్ మెంట్ కోసం ఇన్‌స్పిరేషనల్ బుక్స్ చదవడం ప్రారంభించారు. దీంతో అశుతోష్ ఆలోచనా విధానంలో, జీవన శైలిలో చాలా మార్పు వచ్చింది. ఒకరోజు తాను చదివే కళాశాల ప్రిన్సిపాల్ దగ్గరకు వెళ్లి స్కూడెంట్స్ కి నైపుణ్య అభివృద్ధి కోసం కోచింగ్ ఇవ్వాలనుకుంటున్నానని చెప్పారు. అశుతోష్ ఉత్సాహం నచ్చి వారు అనుమతి ఇచ్చారు. ఆ ప్రోగ్రామ్ మంచి సక్కెస్ అయ్యింది. అందరూ బాగా ప్రశంసించారు. దీంతో అశుతోష్ లో కాన్ఫిడెన్స్ పెరిగింది.
తర్వాత అశుతోష్ ఎవల్యూషన్ పేరుతో సొంత సంస్థను స్థాపించారు. అతని స్పీచ్ లు నచ్చి ఇతర కళాశాలల నుండి కూడా ప్రసంటేషన్ ఇవ్వమని ఆహ్వానాలు అందేవి. దీంతో ఢిల్లీలోని వివిధ కళాశాలల్లో అశుతోష్ కార్యక్రమాలు నిర్వహించేవారు. అలా సొంత యూట్యూబ్ ఛానెల్ కూడా ప్రారంభించారు. మొదట్లో వ్యూస్, లైక్‌లు రాలేదు. కానీ ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే నిరంతర కృషి అవసరమని అశుతోష్ గ్రహించి ఓపిగ్గా తన పని తాను చేసుకోవడం ప్రారంభించారు.