EPFO 3.0 : ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. వాట్సాప్‌లోనే పీఎఫ్ బ్యాలెన్స్ చెకింగ్.. కొత్త రూల్స్ ఇవే

Published : Jun 03, 2026, 09:38 AM IST

PF WhatsApp Balance Check: పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం సూపర్ న్యూస్ చెప్పింది. వాట్సాప్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడమే కాకుండా, అత్యవసర కాలంలో యూపీఐ పిన్ ఎంటర్ చేసి క్షణాల్లో డబ్బులు విత్‌డ్రా చేసుకునే సరికొత్త 'EPFO 3.0' సేవలు తీసుకొచ్చింది.

PREV
15
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి బంపర్ ఆఫర్.. ఈపీఎఫ్ఓ 3.0తో మారనున్న రూల్స్

ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) అకౌంట్ కలిగి ఉన్న సుమారు 8 కోట్ల మంది చందాదారులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. సాధారణంగా పీఎఫ్ అకౌంట్‌లో డబ్బులు ఉన్నా.. అత్యవసర సమయాల్లో వాటిని విత్‌డ్రా చేసుకోవాలంటే ఉద్యోగులకు చుక్కలు కనిపించేవి. కానీ ఇకపై ఆ టెన్షన్స్ ఏమీ ఉండవు.. మనం రోజువారీ అవసరాలకు గూగుల్ పే, ఫోన్ పే ల ద్వారా ఎంత ఈజీగా మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నామో.. అదే విధంగా నేరుగా మీ పీఎఫ్ అకౌంట్ నుండి యూపీఐ ద్వారా క్షణాల్లో డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు.

ఈ సరికొత్త "EPFO 3.0" సేవలకు సంబంధించిన ట్రయల్స్ విజయవంతంగా పూర్తయ్యాయని, త్వరలోనే ఈ సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు.

25
EPFO 3.0 : నో పేపర్‌వర్క్.. వారాల పని సెకన్లలోనే ఫినిష్

ప్రస్తుతం అమల్లో ఉన్న పాత సిస్టమ్ ప్రకారం పీఎఫ్ డబ్బులు మన చేతికి రావాలంటే కనీసం 7 నుండి 10 రోజుల సమయం పడుతుంది. ఒకవేళ మీరు రూ. 1 లక్ష కంటే ఎక్కువ మొత్తాన్ని విత్‌డ్రా చేయాలనుకుంటే మాన్యువల్ వెరిఫికేషన్ తప్పనిసరి. ఆ ప్రాసెస్ లో డాక్యుమెంట్లలో చిన్న తప్పులున్నా క్లెయిమ్ రిజెక్ట్ అయిపోతుంది.

కానీ, రాబోయే కొత్త ఈపీఎఫ్ఓ 3.0 విధానంలో ఎలాంటి పేపర్ వర్క్ ఉండదు. అన్నింటికంటే సూపర్బ్ విషయం ఏంటంటే.. మీ కంపెనీ అప్రూవల్ కూడా అవసరం లేకుండా నేరుగా ఆన్‌లైన్ లోనే క్లెయిమ్ సెటిల్ అయిపోతుంది. అనారోగ్యం, పెళ్లి, చదువు, ఇల్లు కట్టుకోవడం వంటి అత్యవసరాల కోసం 3 రోజుల్లోనే మనీ మీ బ్యాంక్ ఖాతాలోకి వచ్చేస్తుంది.

35
అసలు యూపీఐ విత్‌డ్రా ప్రాసెస్ ఎలా పనిచేస్తుందంటే?

ఈ కొత్త టెక్నాలజీ ద్వారా డబ్బులు ఎలా డ్రా చేయాలి? ముందుగా యూజర్లు ఉమాంగ్ (UMANG) యాప్‌లో లాగిన్ అవ్వాలి. అక్కడ మీ పీఎఫ్ ఖాతా నుండి ఎంత డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి అర్హత ఉందో స్క్రీన్ మీద క్లియర్ గా కనిపిస్తుంది. ఆ తర్వాత మీకు కావాల్సిన అర్హత ఉన్న మొత్తాన్ని సెలెక్ట్ చేసుకుని, మీ యూపీఐ పిన్ ఎంటర్ చేయగానే డబ్బులు నేరుగా మీ పీఎఫ్ ఖాతాకు లింక్ అయిన బ్యాంక్ అకౌంట్లోకి క్షణాల్లో క్రెడిట్ అయిపోతాయి.

అలా వచ్చిన డబ్బును మీరు ఎప్పటిలాగే యూపీఐ ఆధారిత ఏటీఎంల ద్వారా క్యాష్ డ్రా చేసుకోవచ్చు లేదా డైరెక్ట్ ఆన్‌లైన్ పేమెంట్స్ కోసం వాడుకోవచ్చు. ప్రస్తుతం ఈ సిస్టమ్ టెస్టింగ్ మాత్రమే పూర్తయింది. పబ్లిక్ యూజ్ కోసం అధికారిక లాంచ్ డేట్ త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.

45
ఎంత పడితే అంత డ్రా చేయొచ్చా? రూల్స్ ఏమిటి?

యూపీఐ ద్వారా విత్‌డ్రా ఈజీ అయింది కదా అని అకౌంట్ లోని డబ్బు మొత్తాన్ని ఖాళీ చేయడం కుదరదు. మీ రిటైర్మెంట్ సేవింగ్స్ సురక్షితంగా ఉండటం కోసం ఈపీఎఫ్ఓ కొన్ని కఠినమైన కండిషన్స్ పెట్టింది. మీ మొత్తం పీఎఫ్ బ్యాలెన్స్ లో 25 శాతం డబ్బు ఎప్పటికీ లాక్ అయి ఉంటుంది. మిగిలిన 50 శాతం నుండి 75 శాతం బ్యాలెన్స్ మొత్తాన్ని మాత్రమే మీరు అత్యవసరంగా విత్‌డ్రా చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.

యాప్‌లోనే మీకు 'ఎలిజిబుల్ బ్యాలెన్స్' ఎంతో స్పష్టంగా చూపిస్తుంది కాబట్టి ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. అలాగే ఈ ఫెసిలిటీని ఉపయోగించుకోవాలంటే పీఎఫ్ చందాదారులకు యాక్టివ్ యూఏన్ (UAN) నంబర్ ఉండాలి. దాంతో పాటు మీ పాన్ (PAN) కార్డ్ వివరాలు మీ UAN నంబర్‌తో లింక్ అయి ఉండాలి. ముఖ్యంగా, మీ పీఎఫ్ రికార్డులలో ఉన్న పేరు, పుట్టిన తేదీ వివరాలు.. మీ ఆధార్ కార్డులో ఉన్న వివరాలతో కచ్చితంగా మ్యాచ్ అవ్వాలి.

55
వాట్సాప్‌లోనే పీఎఫ్ బ్యాలెన్స్ చెకింగ్.. ఇక అంతా డిజిటల్

పీఎఫ్ సమాచారాన్ని సాధారణ ఉద్యోగులకు సైతం మరింత సులభతరం చేయడానికి ఈపీఎఫ్ఓ ఒక సరికొత్త వాట్సాప్ చాట్‌బాట్ ను కూడా రంగంలోకి దించబోతోంది. ఇకపై గూగుల్ లో వెతకడం, వెబ్‌సైట్లు ఓపెన్ చేసి పాస్‌వర్డ్‌లు కొట్టే తలనొప్పులు లేకుండా.. కేవలం ఒక చిన్న వాట్సాప్ మెసేజ్ పంపడం ద్వారా మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎంతో, అలాగే మీరు ఎంత విత్‌డ్రా చేసుకోవచ్చో చిటికెలో తెలుసుకోవచ్చు. టెక్నాలజీని వాడుకుంటూ కేంద్రం తెచ్చిన ఈ సూపర్ డిజిటల్ మార్పు కోట్లాది మంది ఉద్యోగులకు పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories