Gold Prices: మార్కెట్లో ఊహించని బిగ్ ట్విస్ట్..భారీ పతనం తర్వాత స్థిరంగా బంగారం, వెండి

Published : Jun 02, 2026, 11:39 AM IST

Gold Prices: గత కొన్ని రోజులుగా క్షీణిస్తూ వస్తున్న బంగారం ధరలు...ఇవాళ స్థిరంగా ఉండటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ధరలు ఒక్క రూపాయి కూడా మారలేదు. మరి ఈ స్థిరత్వం వెనుక అసలు కారణమేంటి? బంగారం ఇంకా తగ్గబోతోందా? లేక భారీ పెరుగుదలకు ముందు ఇదొక సంకేతమా? 

PREV
14
మార్కెట్ నుంచి గుడ్ న్యూస్

బంగారం కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి గత కొద్దిరోజులుగా మార్కెట్ నుంచి గుడ్ న్యూస్ వచ్చింది. గతంలో పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఇప్పుడు కాస్త ఊరటనిస్తున్నాయి. ముఖ్యంగా సోమవారం రోజు పసిడి తగ్గుదల కొనుగోలుదారుల్లో ఆశలు పెంచింది. ఇవాళ మాత్రం మార్కెట్‌లో కనిపించిన పరిస్థితి మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

24
నిన్నటి ధరలే

నిన్న ఏ ధరలైతే ఉన్నాయో ఇవాళ కూడా అవే ధరలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,56,220 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల బంగారం రూ.1,43,200 వద్ద, 18 క్యారెట్ల బంగారం రూ.1,17,170 వద్ద ట్రేడ్ అవుతోంది.

సాధారణంగా బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా తగ్గిన తర్వాత మార్కెట్లు కొంత సమయం పరిస్థితులను అంచనా వేస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లలో పెట్టుబడిదారుల వైఖరి, అమెరికా డాలర్ బలం, కేంద్ర బ్యాంకుల నిర్ణయాలు, భౌగోళిక పరిస్థితులు వంటి అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతుంటాయి. ప్రస్తుతం అదే పరిస్థితి కనిపిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

34
స్థిరంగానే వెండి

వెండి మార్కెట్ కూడా ప్రస్తుతం ప్రశాంతంగానే ఉంది. హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి రూ.2,90,000 వద్ద ట్రేడ్ అవుతోంది. గతంలో బంగారం కంటే వెండి ధరల్లో ఎక్కువ ఒడిదుడుకులు కనిపించినప్పటికీ ప్రస్తుతం అది కూడా స్థిరంగా ఉంది. 

44
ఇప్పుడు అందరిది ఒకే ప్రశ్న

బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా? లేక ఈ స్థిరత్వం తర్వాత మళ్లీ పెరుగుదల ప్రారంభమవుతుందా? మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం అంతర్జాతీయ పరిస్థితులు అనుకూలంగా ఉంటే ధరల్లో మరికొంత సవరణ కనిపించే అవకాశం ఉంది. అయితే బంగారం దీర్ఘకాల పెట్టుబడిగా బలమైన స్థానం కలిగి ఉండటంతో ఏ చిన్న పరిణామమైనా మళ్లీ ధరలను పైకి తీసుకెళ్లే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేం. దుకే ప్రస్తుతం బంగారం మార్కెట్‌లో కనిపిస్తున్న ఈ నిశ్శబ్దం.. రాబోయే రోజులలో పెద్ద మార్పులకు ముందు వచ్చే సంకేతమా అనే చర్చ జోరుగా సాగుతోంది. కొనుగోలుదారులు మాత్రం తదుపరి కదలిక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories