iPhone: ఈ ఐఫోన్ ను మడతబెట్టి జేబులో పెట్టేయచ్చు.. దీని ఫీచర్స్ తెలిస్తే దిమ్మతిరుగుద్ది

Published : Jun 02, 2026, 01:50 PM IST

iPhone: మడతబెట్టి జేబులో పెట్టుకునే ఐఫోన్ వచ్చేస్తోంది. ఐఫోన్ 18 సిరీస్ కోసం యాపిల్ ఫ్యాన్స్ అందుకే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా టాప్ వేరియంట్ ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌లో అధిక మార్పులు రాబోతున్నాయిట.

PREV
14
యాపిల్ ఐఫోన్ 18 సిరీస్ వచ్చేస్తోంది

యాపిల్ ఫోన్ అంటేనే ఒక క్రేజ్.  సాధారణంగా యాపిల్ తన ఐఫోన్ మోడల్స్ ను సెప్టెంబర్‌లోనే ఒకేసారి లాంచ్ చేస్తుంది. కానీ ఈసారి మాత్రం ఆ పద్దతి మారబోతోందట.  మొదటగా ప్రీమియం మోడల్స్ అయిన ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్, యాపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్‌ను ఈ ఏడాది విడుదల విడుదల చేయనున్నారు. ఎప్పుడో తెలుసా? ఈసారి సెప్టెంబర్లో కాదు 2027 మొదట్లో.  మొదట ఐఫోన్ 18, ఐఫోన్ 18e వంటి సాధారణ మోడల్స్‌ను తీసుకురావచ్చని టాక్. ప్రీమియం మోడల్స్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టేందుకే ఈ నిర్ణయమని సమాచారం.

24
ధర ఎంత ఉండొచ్చు?

ఐఫోన్ 18 ఫోన్లు మరింత ఆధునిక ఫీచర్లతో రానున్నాయి.  కెమెరా, ఇతర భాగాల తయారీ ఖర్చు బాగా పెరగడంతో, ఐఫోన్ 18 ప్రో సిరీస్ ధర పాత మోడల్స్ కంటే చాలా ఎక్కువ ఉంటుందని అంచనా. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ప్రారంభ ధర రూ. 1,45,000 నుంచి రూ. 1,60,000 మధ్య ఉండొచ్చు (స్టోరేజ్‌ను బట్టి ధర మారుతుంది).

34
కెమెరాలో రాబోతున్న మెగా అప్‌డేట్

ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ మోడల్‌లో కెమెరా  అతిపెద్ద మార్పుగా తెలుస్తోంది. ప్రముఖ యాపిల్ విశ్లేషకుడు మింగ్-చి కువో (Ming-Chi Kuo) ప్రకారం, ఇందులో వేరియబుల్ అపెర్చర్ (Variable Aperture) కెమెరా సిస్టమ్‌ను తీసుకురానున్నారు. • ప్రస్తుత మోడల్స్‌లో ఉన్న ఫిక్స్‌డ్ (Fixed f/1.78) అపెర్చర్‌కు బదులుగా, కాంతికి అనుగుణంగా అపెర్చర్‌ను మార్చే టెక్నాలజీని ఇందులో వాడతారు. • ఇది కేవలం ప్రొఫెషనల్ కెమెరాలలో మాత్రమే కనిపించే ఫీచర్. దీనివల్ల తక్కువ వెలుతురులో కూడా చాలా స్పష్టమైన ఫొటోలు, మెరుగైన డెప్త్ కంట్రోల్, నాణ్యమైన వీడియోలు తీయొచ్చు.

44
మడతపెట్టే ఐఫోన్
ఐఫోన్ 18 సిరీస్‌తో పాటే యాపిల్ తన మొదటి ఫోల్డబుల్ ఫోన్‌ను పరిచయం చేయొచ్చు. దీనికి ఐఫోన్ ఫోల్డ్ (iPhone Fold) లేదా ఐఫోన్ అల్ట్రా (iPhone Ultra) అని పేరు పెట్టే అవకాశం ఉంది. • ఇది 7.8 అంగుళాల ఇన్నర్ డిస్‌ప్లే, 5.5 అంగుళాల ఔటర్ డిస్‌ప్లేతో పుస్తకంలా మడిచే (Book-style) డిజైన్‌లో ఉంటుందని చెబుతున్నారు. • ఫోల్డబుల్ స్క్రీన్లపై సాధారణంగా కనిపించే 'క్రీజ్' (ముడత) లేకుండా ఉండేలా యాపిల్ ప్రత్యేకంగా పనిచేస్తోందని సమాచారం. దీని ధర కూడా భారత్‌లో రూ. 1.5 లక్షలు దాటుతుందని అంచనా.
Read more Photos on
click me!

Recommended Stories