ముడి సరుకు ఖర్చు: ప్లేట్ సైజ్‌పై ఆధారపడి ఒక్క ప్లేట్ తయారీ ఖర్చు సుమారు రూ. 0.40 నుంచి రూ. 0.80 వరకు ఉంటుంది. మార్కెట్‌లో ఒక్క ప్లేట్‌ను రూ. 1 నుంచి రూ. 2 వరకు విక్రయించవచ్చు (సైజ్, క్వాలిటీపై ఆధారపడి ఉంటుంది). ఉదాహరణకు రోజుకు 5000 ప్లేట్లు తయారు చేసి విక్రయిస్తే. సగటు లాభం ఒక్క ప్లేట్‌పై రూ. 0.50 అనుకుంటే రోజుకు లాభం సుమారు రూ. 2500 వరకు రావచ్చు. నెలకు లెక్కిస్తే సుమారు రూ. 60,000 వరకు గ్రాస్ ప్రాఫిట్ సాధ్యమవుతుంది. ఖర్చులు తీసేసినా కనీసం నెలకు రూ. 30 వేలు సంపాదించవచ్చు. సరైన మార్కెటింగ్ చేస్తే మరింత లాభాలు పొందవచ్చు.
మార్కెటింగ్, వ్యాపారం విస్తరణ
ప్రారంభంలో మీ ప్రాంతంలోని హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, క్యాటరింగ్ సర్వీసులతో నేరుగా సంప్రదించాలి. మంచి క్వాలిటీ, తక్కువ ధర, సమయానికి సరఫరా చేస్తే స్థిరమైన కస్టమర్లు లభిస్తారు. కొంతకాలం తర్వాత వివిధ సైజుల్లో ప్లేట్లు తయారు చేయడం, బౌల్స్, గ్లాసులు తయారీ ప్రారంభించవచ్చు. హోల్‌సేల్ డీలర్లతో ఒప్పందాలు చేసుకుంటే వ్యాపారాన్ని మరింత విస్తరించవచ్చు.
గమనిక: పైన తెలిపిన విషయాలను కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. ఈ వ్యాపారం మొదలు పెట్టే ముందు అంతకు ముందు ఈ రంగంలో అనుభవం ఉన్న వారిని సంప్రదించడం ఉత్తమం.