Visa Free Travel: పాస్ పోర్టు ఉంటే చాలు వీసా లేకుండా మనం ఇప్పుడు 56 దేశాలు తిరగేయచ్చు

Published : Feb 15, 2026, 09:08 AM IST

Visa Free Travel: విదేశాలకు వెళ్లాలని ఉందా? అయితే మీకు పాస్ పోర్టు ఉంటే చాలు. వీసా లేకపోయినా ఇప్పుడు మనం 56 దేశాలకు వెళ్లవచ్చు. వెళ్లాక ఆ దేశంలో కూడా వీసా తీసుకోవచ్చు. 

PREV
13
వీసా అవసరమే లేదు

విదేశాలకు తిరగాలన్న కోరిక ఎంతో మందికి ఉంటుంది. కానీ వీసా వస్తుందో రాదో అని ఎంతో మందికి సందేహం. దాని కోసం వెయిటింగ్ చేయాలి కూడా. ఇప్పుడు భారతీయులు 56 దేశాలకు ఎలాంటి ముందస్తు వీసా లేకుండా ఆ దేశాలకు వెళ్లిపోవచ్చు.  ఒక దేశానికి చెందిన పాస్ట్ పోర్టు విలువను కొలిచే హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2026 జాబితాలో భారత్ పురోగతి సాధించింది. ఈ ఏడాది భారత్ 75వ స్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే 10 స్థానాలు మెరుగుపడింది. దీనివల్ల భారత పాస్‌పోర్ట్ హోల్డర్లు చాలా దేశాలకు సులభంగా ప్రయాణించే అవకాశం దొరికింది.

23
56 దేశాలకు వెళ్లవచ్చు

కొత్త ర్యాంకింగ్ ప్రకారం భారతీయులు ఇప్పుడు 56 దేశాలకు వీసా లేకుండా లేదా వీసా-ఆన్-అరైవల్, ఇ-వీసా ద్వారా వెళ్లొచ్చు. దీనివల్ల ముందే వీసా కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా టూరిజం, స్వల్ప  ప్రయాణాలకు ఇది చాలా కలిసొచ్చే ఛాన్స్. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌ను ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (IATA) డేటా ఆధారంగా తయారు చేస్తారు. ఒక దేశ పౌరులు ముందస్తు వీసా లేకుండా ఎన్ని దేశాలకు వెళ్లగలరు అనేదాన్ని బట్టి ర్యాంకింగ్ నిర్ణయిస్తారు. ర్యాంకింగ్‌లో ముందున్న దేశాలకు ఎక్కువ ప్రయాణ స్వేచ్ఛ ఉంటుంది.

33
మొదటిస్థానం ఆ దేశానిదే

ఈ ఏడాది కూడా సింగపూర్ తన మొదటి స్థానాన్ని మళ్లీ నిలబెట్టుకుంది. జపాన్, దక్షిణ కొరియా కూడా టాప్ ర్యాంకుల్లో కొనసాగుతున్నాయి. చాలా యూరోపియన్ దేశాలు కూడా ఉన్నత ర్యాంకుల్లో ఉన్నాయి. ఈ దేశాల పాస్‌పోర్టులకు ప్రపంచవ్యాప్తంగా తిరిగే ప్రయాణ స్వేచ్ఛ ఉంటుంది.

భారత్ ప్రస్తుతం 75వ ర్యాంకులో ఉంది.  2006లో నాటి 71వ ర్యాంక్ ఉండేది. కానీ తరువాత 85 వ ర్యాంకుకు చేరింది. ఇప్పుడు గతేడాదితో పోలిస్తే మళ్లీ ర్యాంకును తగ్గించుకుని పాస్ట్ పోర్టు విలువను పెంచుకుంది. ఇది భారతీయులకు అంతర్జాతీయ ప్రయాణ అవకాశాలు మెరుగుపడుతున్నాయని చూపిస్తోంది. భవిష్యత్తులో మరిన్ని దేశాలు వీసా మినహాయింపు ఇస్తే, భారత పాస్‌పోర్ట్ బలం మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories