Petrol Price: ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు దేశానికోలా మారుతూ ఉంటాయి. భారత్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 100 దాటింది. అయితే ఇప్పటికీ కొన్ని దేశాల్లో లీటర్ పెట్రోల్ ధర 2 రూపాయలు ఉందన్న విషయం మీకు తెలుసా.?
ప్రస్తుతం లిబియా ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరకు పెట్రోల్ విక్రయిస్తున్న దేశంగా నిలిచింది. అక్కడ లీటర్ పెట్రోల్ ధర సుమారు 0.031 డాలర్లు, అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 2.60 మాత్రమే. ఇంత తక్కువ ధరకు కారణం ప్రభుత్వ భారీ సబ్సిడీలు, అలాగే దేశంలో విస్తారంగా ఉన్న చమురు నిల్వలు. చమురు ఉత్పత్తిలో ముందున్న దేశం కావడంతో ప్రజలకు తక్కువ ధరలో ఇంధనం అందిస్తోంది.
25
ఇరాన్ – సబ్సిడీతో చౌక ఇంధనం
ఇరాన్ రెండో స్థానంలో ఉంది. అక్కడ లీటర్ పెట్రోల్ ధర సుమారు 0.029 డాలర్లు, అంటే దాదాపు రూ. 2.50 వరకు ఉంటుంది. ఇరాన్ ప్రభుత్వం బలమైన సబ్సిడీ విధానం అమలు చేస్తోంది. అయితే ఈ తక్కువ ధరల కారణంగా పొరుగు దేశాలకు అక్రమ రవాణా సమస్య పెరిగింది. అందుకే ప్రభుత్వం నెలకు 160 లీటర్లకు మించి వినియోగించే వారికి ఎక్కువ ధర విధిస్తోంది.
35
వెనిజువెలా – కోటా విధానం అమల్లో
ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత చౌక పెట్రోల్ అమ్మిన దేశంగా పేరుపొందిన వెనిజువెలా ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. అక్కడ లీటర్ ధర సుమారు 0.035 డాలర్లు, అంటే దాదాపు రూ. 3 వరకు ఉంటుంది. ఇక్కడ కోటా విధానం అమల్లో ఉంది. నెలకు 120 లీటర్ల వరకు సబ్సిడీ ధర వర్తిస్తుంది. ఆ పరిమితి దాటితే ధర ఒక్కసారిగా పెరుగుతుంది.
టాప్ మూడు దేశాల తరువాత అంగోలా ఉంది. అక్కడ లీటర్ పెట్రోల్ ధర సుమారు 0.33 డాలర్లు, అంటే దాదాపు రూ. 27. కువైట్ చౌకగా పెట్రోల్ అందిస్తున్న దేశంగా నిలిచింది. అక్కడ లీటర్ ధర సుమారు 0.34 డాలర్లు, అంటే రూ. 28 వరకు ఉంటుంది. ఈ దేశాలన్నీ చమురు ఉత్పత్తిలో ముందున్న దేశాలు కావడంతో ఇంధన ధరలను తక్కువగా ఉంచగలుగుతున్నాయి.
55
భారత్ స్థానం ఎంత?
ప్రపంచ జాబితాలో భారత్ 73వ స్థానంలో ఉంది. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర నగరానికోలా రూ. 94 నుంచి రూ. 105 మధ్య ఉంటుంది. పాకిస్తాన్ 36వ స్థానంలో ఉంది. అక్కడ ధరలు సుమారు రూ. 80 నుంచి రూ. 84 మధ్య ఉన్నాయి. మొత్తంగా చూస్తే, చమురు ఉత్పత్తి అధికంగా ఉన్న దేశాల్లో ప్రభుత్వం భారీ సబ్సిడీలు ఇవ్వడం వల్ల పెట్రోల్ ధరలు చాలా తక్కువగా ఉంటాయి. చమురు దిగుమతులపై ఆధారపడే దేశాల్లో మాత్రం ధరలు ఎక్కువగా ఉండడం సహజం.