మే 1 నుండి అమలయ్యే 6 ముఖ్యమైన మార్పులివే: మన జేబుకు చిల్లే

Published : May 01, 2025, 01:50 PM IST

మే 1 నుండి కొన్ని ముఖ్యమైన మార్పులు అమలులోకి వస్తున్నాయి. ఇకపై ATM ల నుండి డబ్బు విత్‌డ్రా చేయాలంటే ఎక్కువ ట్యాక్స్ కట్టాలి. అలాగే రైల్వేలో రిజర్వేషన్ చేయిస్తే వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్లు వచ్చిన వారు జనరల్ కోచ్‌లో మాత్రమే ప్రయాణించడానికి అనుమతి ఉంటుంది. ఇలాంటి 6 ముఖ్యమైన మార్పుల గురించి తెలుసుకుందాం రండి.  

PREV
15
మే 1 నుండి అమలయ్యే 6 ముఖ్యమైన మార్పులివే: మన జేబుకు చిల్లే

ATM లపై ఛార్జీల మోత

మే 1, 2025 నుండి ATM ల నుండి డబ్బు విత్‌డ్రా చేయడం ఖరీదైనదిగా మారుతుంది. RBI ఇటీవల NPCI ప్రతిపాదనపై ఛార్జీల పెంపునకు అనుమతి ఇచ్చింది. అంటే మే 1 నుండి ఒక వ్యక్తి తన హోమ్ బ్యాంక్ ATM కాకుండా వేరే నెట్‌వర్క్ ATM నుండి డబ్బు విత్‌డ్రా చేస్తే లిమిట్ తర్వాత ప్రతి లావాదేవీకి రూ. 23 చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఇంతకు ముందు రూ.17 మాత్రమే ఉండేది. అదేవిధంగా వేరే బ్యాంక్ ATMలో బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే రూ.6 కాకుండా రూ.7 ఛార్జ్ విధిస్తారు. 

25

ATM లావాదేవీల లిమిటేషన్ కూడా మారింది

మే 1 నుండి ATM లావాదేవీల పరిమితి కూడా మారుతోంది. కొత్త నియమాల ప్రకారం మెట్రో నగరాల్లో వినియోగదారులు నెలకు 3 ఉచిత ATM లావాదేవీలు మాత్రమే చేయగలరు. మెట్రో కాకుండా ఇతర నగరాల్లో ఈ లిమిట్ నెలకు 5 చేయవచ్చు. ఈ ట్రాన్సాక్షన్ లిమిట్ దాటితే ఎక్కువ ఛార్జీలు కట్టాల్సిందే.

35

జనరల్ కోచ్‌లో మాత్రమే వెయిటింగ్ టికెట్

మే 1, 2025 నుండి రైల్వే టికెట్ బుకింగ్ నియమాల్లో కూడా మార్పులు వస్తున్నాయి. దీని ప్రకారం వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్లు ఇంతకు ముందులా రిజర్వేషన్ బోగీలో నుంచొని ప్రయాణించడానికి లేదు. జనరల్ కోచ్‌లో మాత్రమే ప్రయాణించాలి. అంటే ఇకపై మీరు వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్‌తో స్లీపర్ కోచ్‌లో ప్రయాణించలేరు.

45

LPG సిలిండర్ ధరల్లోనూ మార్పులు

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల మొదటి తేదీన గ్యాస్ సిలిండర్ ధరలను సమీక్షిస్తాయి. కాబట్టి మే 1న LPG సిలిండర్ ధరల్లో మార్పులు ఉండవచ్చని సమాచారం. ముఖ్యంగా కమర్షియల్ సిలిండర్ ధర రూ.17 వరకు తగ్గుతుందని తెలిసింది. 

55

CNG-PNG ధరల్లో మార్పులు

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల మొదటి తేదీన CNG, PNG ధరలను కూడా సవరిస్తాయి. దీని ప్రకారం విమాన ఇంధనం అయిన ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరల్లో కూడా మే 1 నుండి మార్పులు ఉంటాయని తెలిసింది. 

మే నెలలో 12 రోజులు బ్యాంకులకు సెలవు

మే నెలలో దేశవ్యాప్తంగా బ్యాంకులకు మొత్తం 12 రోజులు సెలవులు ఉంటాయి. వీటిలో 2 శనివారాలు, 4 ఆదివారాలు కూడా ఉన్నాయి. ఇవి కాకుండా వివిధ రాష్ట్రాల్లో బుద్ధ పూర్ణిమ, మహారాణా ప్రతాప్ జయంతి ఇతర స్థానిక సెలవులు ఉంటాయి.

Read more Photos on
click me!

Recommended Stories