ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ పెరుగుతోంది. అయితే యువత అభిరుచులకు అనుగుణంగా ఎలక్ట్రిక్ బైక్‌లు కూడా వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మార్కెట్లోకి మరో సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ వచ్చేస్తోంది.
భారతదేశంలో ప్రముఖ R&D ఆధారిత ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ తయారీదారు ఒబెన్ ఎలక్ట్రిక్ కొత్త తరహా Rorr EZ మోడల్‌ను ఆగస్టు 5, 2025న విడుదల చేయనుంది. ఈ మోడల్ నగర ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఆధునిక సాంకేతికత, రైడర్ ఫ్రెండ్లీ ఫీచర్లు కలిపి మరింత శక్తివంతమైన అనుభవాన్ని అందించనుంది.
DID YOU KNOW ?
బ్యాటరీ ప్రత్యేకత
ఒబెన్ ఎలక్ట్రిక్ Rorr EZ బైక్‌లో ఉపయోగించే LFP బ్యాటరీలు తక్కువ వేడి ఉత్పత్తి చేస్తూ, సాధారణ లిథియం-ఐయాన్ కంటే 50% ఎక్కువ హీట్ రెసిస్టెన్స్ కలిగి ఉంటాయి. దీంతో బ్యాటరీ దీర్ఘ కాలం పని చేస్తుంది.
25
2024లో వచ్చిన Rorr EZకి మంచి ఆదరణ
నవంబర్ 2024లో మొదటి Rorr EZకి మంచి ఆదరణ లభించింది. రోజువారీ నగర ప్రయాణికులకు ఇష్టమైన ఎలక్ట్రిక్ బైక్‌గా మారింది. క్లచ్, గేర్ మార్చాల్సిన అవసరం లేకుండా సాఫీగా ప్రయాణం చేయగలిగే విధంగా రూపొందించడంతో నగర వాసులు ఎక్కువగా ఉపయోగించారు. ట్రాఫిక్‌లో వచ్చే వైబ్రేషన్స్, వేడి తగ్గేలా డిజైన్ చేశారు.
35
ఫీచర్లు
కొత్త Rorr EZ బైక్‌ను ఒక్కసారి ఛార్జ్‌తో 175 కి.మీ వరకు ప్రయాణించవచ్చు. ఈ బైక్ కేవలం 45 నిమిషాల్లో 80% ఛార్జింగ్ అవుతుంది. గరిష్టంగా 96 కిలోమీటర్లవేగంతో వెళ్తుంది. వేగవంతమైన పికప్, సిటీ కమ్యూట్‌కి అనువుగా టార్క్, యాక్సిలరేషన్‌ను అందించారు.
ఇందులో హై-పర్ఫార్మెన్స్ LFP బ్యాటరీ టెక్నాలజీని అందించారు. ఈ బ్యాటరీలకు 50% ఎక్కువ హీట్ రెసిస్టెన్స్ ఉంటుంది. అలాగే ఎక్కువ కాలం పనిచేస్తుంది. అన్ని రకాల వాతావరణాల్లో సమర్థవంతంగా పనిచేస్తుంది.
Rorr EZ బైక్ టీజర్
55
బుకింగ్స్, డెలవరీలు
ఈ కొత్త మోడల్ ఆగస్టు 5న ప్రారంభమయ్యే లాంచ్ రోజు నుంచే బుకింగ్‌లు ఓపెన్ అవుతాయి. డెలివరీలు ఆగస్టు 15, 2025 నుండి ప్రారంభం అవుతాయి. ఇక ఒబెన్ ఎలక్ట్రిక్ విషయానికొస్తే.. బెంగళూరుకు చెందిన ఈ సంస్థ 2020లో ప్రారంభమైంది. ఈ సంస్థ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల తయారీతో పాటు EV భాగాలను కూడా స్వయంగా డెవలప్ చేస్తుంది. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ క్లిక్ చేయండి.