Hero HF Deluxe Pro: రూ. 73 వేలకే హై ఎండ్ ఫీచర్స్.. 83 కిలోమీటర్ల మైలేజ్‌ ఇచ్చే కొత్త బైక్

Published : Jul 28, 2025, 12:00 PM IST

బైక్ కొనుగోలు చేసే ముందు మ‌న‌లో ఎక్కువ మంది ఆలోచించేది మైలేజ్‌. అది కూడా త‌క్కువ ధ‌ర‌లో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్స్‌పై ఆస‌క్తి చూపిస్తుంటారు. అలాంటి బైక్ ఒక‌టి ప్ర‌స్తుతం మార్కెట్లో హ‌ల్చ‌ల్ చేస్తోంది. ఈ బైక్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు మీకోసం. 

PREV
15
హీరో మోటోకార్ప్ నుంచి కొత్త బైక్

హీరో మోటోకార్ప్ తాజాగా మార్కెట్‌లోకి కొత్త మోడల్ HF డీలక్స్ ప్రోను విడుదల చేసింది. ఈ మోడల్ సాధారణ బైక్‌లా కాకుండా మరింత స్టైలిష్ డిజైన్, ఆధునిక ఫీచర్లతో వస్తోంది. బడ్జెట్ సిగ్మెంట్ బైక్‌లలో కొత్త ట్రెండ్‌ను సెట్ చేసేలా దీన్ని రూపొందించారు. నమ్మకంతో పాటు విలువ, ఆకర్షణీయమైన లుక్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్ష‌న్‌గా చెప్పొచ్చు.

25
ఆకర్షణీయమైన డిజైన్, ఆధునిక ఫీచర్లు

HF డీలక్స్ ప్రో డిజైన్‌లో హీరో మోటోకార్ప్ కొత్త మార్పులు చేసింది. కొత్తగా డిజైన్ చేసిన బాడీ గ్రాఫిక్స్, LED హెడ్‌ల్యాంప్‌లో కిరీటం ఆకారపు పొజిషన్ లైట్ జోడించడం ఈ మోడల్ ప్రత్యేకత. ఈ ఫీచర్ ఈ సెగ్మెంట్‌లో తొలిసారిగా అందించారు. ఇది రాత్రివేళల్లో మెరుగైన విజిబిలిటీని ఇస్తూ రైడింగ్ అనుభవాన్ని మరింత సులభం చేస్తుంది. అదనంగా క్రోమ్ యాక్సెంట్‌లు బైక్‌కు ప్రీమియం టచ్‌ను అందిస్తున్నాయి.

35
శక్తివంతమైన ఇంజన్, మెరుగైన పనితీరు

ఈ బైక్‌లో 97.2cc ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ అమర్చారు. ఇది 8000 RPM వద్ద 7.9 bhp పవర్, 6000 RPM వద్ద 8.05 Nm టార్క్ ఇస్తుంది. తక్కువ ఘర్షణ ఇంజిన్ డిజైన్ వల్ల పవర్ వృథా కాకుండా మైలేజీ మెరుగుపడుతుంది. రోజువారీ ప్రయాణాలకు అనువుగా ఉండే ఈ పనితీరు మెట్రో నగరాల్లో తరచుగా ప్రయాణించే రైడర్లకు ఉపయోగకరంగా ఉంటుంది.

45
i3S టెక్నాలజీతో ఇంధన పొదుపు

HF డీలక్స్ ప్రోలో i3S (Idle Stop-Start System) టెక్నాలజీని అందించారు. ట్రాఫిక్‌లో బైక్ ఆగిన‌ప్పుడు ఇంజిన్ ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. తిరిగి యాక్సిలేటర్ ఇవ్వ‌గానే మళ్లీ ఆన్ అవుతుంది. దీని వల్ల ఇంధన వినియోగం తగ్గుతుంది. ఈ బైక్ సుమారు 83 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. అదనంగా, ప్రత్యేకంగా డిజైన్ చేసిన టైర్లు మెరుగైన గ్రిప్, స్టెబిలిటీని అందిస్తాయి.

55
ఆధునిక డిస్‌ప్లే, విభిన్న క‌ల‌ర్స్

HF డీలక్స్ ప్రోలో డిజిటల్ స్పీడోమీటర్, లో ఫ్యూయల్ ఇండికేటర్ (LFI) వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇవి రియల్ టైమ్ డేటాను స్పష్టంగా చూపించి రైడింగ్ అనుభవాన్ని ప్రీమియంగా మారుస్తాయి. రంగుల విషయంలో కూడా హీరో మోటోకార్ప్ కొత్త డ్యూయల్-టోన్ ఆప్షన్లను ఇచ్చింది – ఎరుపు-నలుపు, పసుపు-నలుపు, వెండి-నలుపు, నీలం-నలుపు కాంబినేషన్లు. అల్లాయ్ వీల్స్, ఇంజిన్, గ్రాబ్ రైల్ వంటి భాగాల్లో నలుపు రంగు డామినేట్ చేయడం బైక్‌కు స్పోర్టీ లుక్‌ను ఇస్తోంది.

ఇక ధ‌ర విష‌యానికొస్తే ఈ బైక్ ఎక్స్ షోరూమ్ రూ. 73,550గా నిర్ణ‌యించారు. అయితే ఇది డీల‌ర్‌, షోరూమ్ ఏరియా బ‌ట్టి మారుతుంది. మొత్తం మీద చెప్పాలంటే ధరకు మించిన ఫీచర్లతో, ఎంట్రీ లెవల్ బైక్ సెగ్మెంట్‌లో స్టైల్, మైలేజీ, ఫీచర్లను కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్ష‌న్‌గా చెప్పొచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories