Electric scooter: ధ‌ర రూ. 55 వేలు, మైలేజ్ 130 కిలోమీట‌ర్లు.. లైసెన్స్ అవ‌స‌రం లేని బెస్ట్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్

Published : Jul 25, 2025, 09:27 AM IST

ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌కు భారీగా డిమాండ్ పెరుగుతోంది. ఇందుకు అనుగుణంగానే కొత్త కొత్త కంపెనీలు స్కూట‌ర్ల‌ను లాంచ్ చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా జిలియో మొబిలిటీ అనే సంస్థ మార్కెట్లోకి అప్‌గ్రేడ్ వెర్ష‌న్‌తో కొత్త స్కూటీని తీసుకొచ్చింది. 

PREV
15
జిలియో ఈమొబిలిటి నుంచి కొత్త వెర్ష‌న్

ప్ర‌ముఖ ఎల‌క్ట్రానిక్ వాహ‌నాల త‌యారీ సంస్థ జిలియో ఈ మొబిలిటే గ్రేస్ ప్ల‌స్ వేరియంట్ పేరుతో కొత్త స్కూట‌ర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ స్కూటీలో ఉప‌యోగించిన BLDC మోటార్ పూర్తిగా ఛార్జ్ చేయ‌డానికి కేవ‌లం 1.8 యూనిట్ల విద్యుత్ మాత్రమే ఖర్చవుతుంది.

ఒకసారి ఛార్జ్‌తో 60 నుంచి 130 కిలోమీటర్ల దూరం సులభంగా ప్రయాణించవచ్చు. స్కూటర్ గరిష్ట వేగం గంటకు 25 కి.మీ మాత్రమే. దీంతో ఈ వాహ‌నాన్ని న‌డ‌ప‌డానికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా అవ‌స‌రం ఉండ‌దు.

25
గ్రౌండ్ క్లియరెన్స్, లోడ్ కెపాసిటీ పెంపు

భారతీయ రోడ్ల పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని గ్రౌండ్ క్లియరెన్స్‌ను 180 మిల్లీమీటర్లకు పెంచారు. స్కూటర్ బరువు 88 కిలోలుగా ఉండగా, ఇది 150 కిలోల వరకు లోడును మోయగలదు. ఈ కారణంగా డెలివరీ బాయ్స్, ఆఫీసు వెళ్తున్న ఉద్యోగులు, విద్యార్థులు, చిరు వ్యాపారులు వంటి విభిన్న వర్గాల వినియోగదారులకు అనుకూలంగా ఉంటుంది.

35
బ్యాటరీ ఆప్షన్లు

గ్రేసీ+ ఇప్పుడు మొత్తం ఆరు రకాల బ్యాటరీ ఎంపికలతో లభిస్తోంది. లిథియం అయాన్ బ్యాటరీలు దాదాపు 4 గంటల్లో ఛార్జ్ అవుతాయి. జెల్ బ్యాటరీలు పూర్తిగా ఛార్జ్ కావడానికి 8 నుంచి 12 గంటల సమయం పడుతుంది. టాప్ మోడల్స్ ఒక్కసారి ఛార్జ్‌తో 130 కి.మీ వరకు మైలేజీ ఇస్తాయి.

45
ఫీచర్లు, వారంటీ వివరాలు

స్కూటర్‌లో డిజిటల్ డిస్‌ప్లే, కీలెస్ స్టార్ట్, USB ఛార్జింగ్ పోర్ట్, DRL లైటింగ్, యాంటీ-థెఫ్ట్ అలారం, పార్కింగ్ గేర్, పిలియన్ ఫుట్‌రెస్ట్ లాంటి అధునాత‌న ఫీచ‌ర్ల‌ను అందించారు. ఈ స్కూటీని వైట్‌, యాష్‌, బ్లాక్‌, బ్లూ క‌ల‌ర్స్‌లో అందుబాటులోకి తెచ్చారు.

55
ధ‌ర వివ‌రాలు

ఇక ఈ స్కూట‌ర్‌పై రెండేళ్ల వారంటీని అందించారు. కాగా లిథియం అయాన్ బ్యాటరీపై ఒక ఏడాది అద‌నంగా అంటే మూడేళ్ల వ‌ర‌కు వ్యారంటీ ఉంటుంది. జెల్ బ్యాటరీపై ఒక సంవత్సరం వారంటీ అందిస్తున్నారు. ముందు భాగంలో డ్రమ్ బ్రేక్‌లు, వెనుక భాగంలో డిస్క్ బ్రేక్‌లు ఏర్పాటు చేశారు. హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్స్ వ‌ల్ల‌ డ్రైవింగ్ అనుభవం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.

గ్రేసీ ప్లస్ కొత్త వెర్షన్ ధర రూ. 54,000 నుంచి ప్రారంభమవుతుంది. తక్కువ నిర్వహణ ఖర్చుతో ఎక్కువ మైలేజీ కావాలనుకునే వినియోగదారులకు ఇది మంచి ఆప్షన్‌గా నిలుస్తోంది. ఇక ఈ స్కూటీ టాప్ ఎండ్ మోడ‌ల్ ధ‌ర రూ. 69,500గా ఉంటుంది. పూర్తి వివ‌రాల కోసం కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించండి.

Read more Photos on
click me!

Recommended Stories