Zodiac Signs: మూడు గ్రహాల బలం… ఈ 6 రాశుల వారికి మంచి రోజులు వ‌చ్చేశాయ్‌. డ‌బ్బే డ‌బ్బు

Published : Dec 18, 2025, 09:44 PM IST

Zodiac Signs: ప్రస్తుత గ్రహ సంచారంలో శని, రాహువు, గురువులు అపూర్వ బలం సంపాదించాయి. ఈ మూడు గ్రహాలు తమ తమ స్వనక్షత్రాల్లో కదలడం వల్ల వచ్చే మూడు నెలలు ప్రత్యేక ప్రభావం కనిపించనుంది. దీని ఫలితంగా 6 రాశుల వారికి క‌లిసిరానుంది. 

PREV
16
వృషభ రాశి: ఆదాయం పెరుగుదల

వృషభ రాశివారికి ఈ కాలంలో ధన ప్రవాహం స్పష్టంగా పెరుగుతుంది. ఉద్యోగ రంగంలో అధికార బాధ్యతలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. చాలాకాలంగా నెరవేరని ఆశలు ఇప్పుడు ఫలిస్తాయి. విదేశీ అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు సానుకూలంగా మారతాయి. ఆస్తి సమస్యలు పరిష్కార దిశగా కదులుతాయి. వ్యక్తిగత అభివృద్ధికి ఇది మంచి సమయం.

26
మిథున రాశి: ఉద్యోగంలో పురోగతి

ఈ రాశివారికి వృత్తి జీవితంలో గుర్తింపు పెరుగుతుంది. కొత్త బాధ్యతలు, పదోన్నతి అవకాశాలు వస్తాయి. నైపుణ్యాల పెంపుపై దృష్టి పెడితే ఫలితం మరింత బలంగా ఉంటుంది. విదేశీ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలించే సూచనలు ఉన్నాయి. వ్యాపార రంగంలో చిన్న మార్పులు పెద్ద లాభాలకు దారి తీస్తాయి. పెట్టుబడుల విషయంలో లాభ సూచనలు కనిపిస్తున్నాయి.

36
కన్య రాశి: ప్రయత్నం చేస్తే విజయం ఖాయం

కన్య రాశివారికి ఏ పని మొదలుపెట్టినా మంచి ఫ‌లితం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి దూర ప్రాంతంలో అవకాశాలు రావచ్చు. వివాహ ప్రయత్నాలు సానుకూలంగా మారతాయి. ఆదాయం పెరిగి ఆర్థిక స్థితి బలపడుతుంది. ప‌నిచేసే చోట‌ ప్రతిభకు తగిన గుర్తింపు లభించి పదోన్నతి సాధించే అవకాశం ఉంది.

46
తుల రాశి: ఆస్తి లాభాలు, కుటుంబ సుఖం

ఈ రాశివారికి ఆర్థిక ఒత్తిడులు తగ్గుతాయి. అనేక మార్గాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. భూ వివాదాలు, న్యాయ సమస్యలు రాజీ దిశగా పరిష్కారం అవుతాయి. ఇల్లు, వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో సంతోషకరమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆస్తి విలువ కూడా పెరుగుతుంది.

56
మకర రాశి: గౌరవం, గుర్తింపు, విజయాలు

మకర రాశివారికి ఈ కాలం ప్రత్యేకంగా చెప్పొచ్చు. ప్రభుత్వ పరంగా గుర్తింపు లభించే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో ప్రతిభకు మంచి ఫలితం దక్కుతుంది. వ్యాపార రంగంలో లాభాలు అంచనాలకన్నా ఎక్కువగా ఉండవచ్చు. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో విజయం సాధించే అవకాశం ఉంది. సంతానానికి సంబంధించి శుభవార్తలు వినిపించవచ్చు.

66
కుంభ రాశి: తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం

కుంభ రాశివారికి అదృష్టం పూర్తిగా అనుకూలంగా మారుతుంది. ఆకస్మిక ధన లాభాలు రావచ్చు. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరిగి నిర్ణయాల్లో మాటకు విలువ వస్తుంది. అదనపు ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. చాలాకాలంగా వెంటాడిన ఆర్థిక సమస్యలు క్రమంగా తొలగిపోతాయి.

Read more Photos on
click me!

Recommended Stories