తోబుట్టువులు ఒక్కచోట ఉంటే ఆ సరదానే వేరు. చిన్న చిన్న అల్లర్లు, అలకలు, త్యాగాలు ఆ బంధాన్ని మరింత బలోపేతం చేస్తాయి. అయితే కొందరు మాత్రం వారి తోబుట్టువులతో తరచూ గొడవ పడుతుంటారు. జ్యోతిష్యం ప్రకారం ఏ రాశివారు తోబుట్టువులతో సఖ్యతగా ఉండరో ఇక్కడ చూద్దాం.
తోబుట్టువుల బంధం చాలా ప్రత్యేకమైనది. ఒకరంటే ఒకరికి విపరీతమైన ప్రేమ, ఆప్యాయత ఉంటాయి. అయితే కొందరు తోబుట్టువుల మధ్య మాత్రం ఎప్పుడూ చిన్నచిన్న మనస్పర్థలు, అసహనం, అసూయ, గర్వం వంటి వాటివల్ల తరచూ గొడవలు జరుగుతుంటాయి. దీనికి వారు జన్మించిన రాశికూడా ఒక కారణం కావచ్చని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
కొన్ని రాశులవారి స్వభావం సహజంగానే తీవ్రంగా స్పందించే విధంగా ఉంటుంది. లేదా తమకే అన్నీ తెలుసు అనే భావన బలంగా ఉంటుంది. ఇలాంటి మనస్తత్వం వల్ల తోబుట్టువులుతో సఖ్యతగా ఉండరు. తరచూ వారితో గొడవపడుతుంటారు. మరి ఏ రాశులవారు తమ తోబుట్టువులతో ఎక్కువ గొడవలు పడుతుంటారో ఇక్కడ తెలుసుకుందాం.
26
మేష రాశి
మేషరాశి వారు చాలా చురుకైనవారు. తమ అభిప్రాయాన్ని బలంగా చెప్పాలనుకుంటారు. వీరి తోబుట్టువులు దేని గురించి అయినా అసంతృప్తిగా స్పందిస్తే, వీరు అస్సలు తట్టుకోలేరు. ఈ రాశి వారు చాలా సెన్సిటివ్.. అయినప్పటికీ బయటకు మాత్రం బాగా కోపంగా, గంభీరంగా కనిపిస్తారు. తమ కంటే తక్కువ వయసున్న తోబుట్టువులను తప్పుబట్టడంతో పాటు వాళ్లను నియంత్రించాలనే మనస్తత్వం కలిగి ఉంటారు. దానివల్ల తరచూ గొడవలు జరుగుతుంటాయి. వీరి మాటల్లో అసహనం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.
36
సింహ రాశి
సింహ రాశి వారు సహజంగానే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. వీరి అన్నదమ్ములు, లేదా అక్కాచెల్లెల్లు తమ మాట వినకపోవడం లేదా ప్రశ్నించడం వీరికి అస్సలు నచ్చదు. తమకే అన్నీ తెలుసనే భావనలో ఉంటారు. ఇంట్లో తనే ఫస్ట్. ఆ తర్వాతే మిగతా తోబుట్టువులు అనే స్వభావంతో ఉంటారు. ఈ గర్వమే తోటివారితో గొడవలు పడేలా చేస్తుంది.
వృశ్చిక రాశి వారు రహస్య స్వభావం కలిగి ఉంటారు. వారి మనసులో ఏముందో బయటపెట్టరు. దానివల్ల తోబుట్టువులు వారిని పూర్తిగా అర్థం చేసుకోలేకపోతారు. ఎప్పుడైతే ఈ రాశివారు నొచ్చుకుంటారో అప్పుడు తీవ్రంగా స్పందిస్తారు. దానివల్ల తోబుట్టువుల మధ్య దూరం పెరుగుతుంది.
56
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారు నిజాయితీకి ప్రాముఖ్యత ఇస్తారు. కానీ వారు ఏం చెప్పాలో అంత ఫిల్టర్ లేకుండా నేరుగా చెప్పేస్తారు. ఇది వారి సోదరీ సోదరులను బాధ పెడుతుంది. నిజం చెప్పాలనే ఉద్దేశమున్నా.. తోబుట్టువుల మనసు గాయపడే మాటలు అంటారు. దానివల్ల గొడవలు జరిగే అవకాశం ఎక్కువ. వీరికి మాటల మీద నియంత్రణ తక్కువగా ఉంటుంది. చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలకు దారితీస్తాయి.
66
కుంభ రాశి
కుంభ రాశి వారు బంధాలకు అంత ప్రాధాన్యం ఇవ్వరు. “ఇది నా జీవితం” అన్నదమ్ములు లేదా అక్కా చెల్లెల్లతో నాకు సంబంధం లేదు అన్నట్టు ప్రవర్తిస్తారు. దానివల్ల తోబుట్టువులు వీరికి దూరంగా ఉంటారు. ఈ రాశివారు ఎమోషనల్ గా తోబుట్టువులకు దగ్గరకారు. దానివల్ల వారి మధ్య గొడవలు, అపార్థాలు చోటుచేసుకుంటాయి.